Tuesday, June 30, 2020

తేనె ఉపయోగాలు - సంపూర్ణ వివరణ

తేనె ఉపయోగాలు - సంపూర్ణ వివరణ . 

       తేనె మనిషికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరంగా చెప్పుకోవచ్చు. తేనెలో తియ్యదనంతో పాటు అనేక పోషక గుణములు , ఔషధగుణములు ఉన్నాయి . తియ్యదనానికి అర్థం చెప్పే పదార్థం కాబట్టి దీనిని మధు అంటారు. 

        ఆయుర్వేదంలో ఆరోగ్య పరిరక్షణకు వ్యాధి నివారణకు కూడా తేనె ప్రాచుర్యం పొందినది. ఆహారమున ఔషధముగా , ఔషధాలకి అనుపానంగా , సౌందర్య సాధనంగా తేనె కీలకపాత్రను పోషిస్తుంది . చలువ చేస్తుంది . ఆకలిని పుట్టిస్తుంది. బలమును కలిగించును. హృదయమునకు మంచిది . నేత్రములకు మంచిది . చర్మానికి కాంతిని కలిగించును . శరీరంలో కొవ్వుని పెరగనివ్వదు. పుండ్లను మాన్పును . ఇలా ఎన్నో గొప్ప ఔషధ గుణాలు తేనెలో కలవు. 

                  స్వచ్చమైన తేనెలో శరీరముకు కావలసిన పోషకపదార్ధాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధముగా ఆహారపదార్ధాల కంటే తేనెలో కెలోరిక్ విలువలు ఎక్కువుగా ఉన్నాయి. ఉదాహరణకు ఒక కిలో ( 900ml ) పాలలో 620 క్యాలరీలు , ఆపిల్ పండులో 420 క్యాలరీలు , నారింజలో 230 క్యాలరీలు ఉండగా ఒక కిలో తేనెలో 3 ,150 నుండి 3 , 360 క్యాలరీక్ విలువ ఉండును. తేనె అనేక వ్యాధులలో పనిచేస్తుంది అని ఎన్నో పురాతన ఆయుర్వేద గ్రంథాలలో ఉన్నది. నోటిలో పుండ్లకు , దద్దులకు తేనె అత్యుత్తమంగా పనిచేయును . నోటిపూతకు తేనె రాస్తే నోటిపూత తగ్గును . 

                సాధారణముగా వచ్చే దగ్గులలో తేనె , అల్లంరసం కలిపి ఇస్తే దగ్గులు తగ్గును. వాంతులు తగ్గును. ప్రతిరోజు పొద్దున్నే చల్లటినీటిలో తేనె , నిమ్మరసం కలిపి తాగితే శరీరపు లావు తగ్గును. ఊపిరితిత్తుల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు. ప్రతినిత్యం తేనె , నిమ్మరసంతో తీసుకుంటుంటే వ్యాధి తీవ్రత తగ్గుటయే కాక వ్యాధి కూడా తగ్గును . 

                   పుండ్లు , చర్మవ్యాధులు , మొటిమలు , తలనొప్పి , దగ్గు , జ్వరము , రక్తహీనత , న్యుమోనియా , గుండెజబ్బు మొదలగు వ్యాధులకు తేనె దివ్యౌషధముగా పనిచేయును . తులసిరసముతో , తేనె కలిపి తీసుకుంటే శ్వాసకోశ , న్యుమోనియా మొదలగు వ్యాధులు నివారించబడును. తేనె , తులసిరసము , పసుపు కలిపి ఇస్తే ప్లేగు వంటి సాంక్రమిక వ్యాధులు కూడా నివారణ అగును. మధుమేహ వ్యాధి ఉన్నవారు రోజు కొద్దిగా తేనె తాగుట వలన మంచిఫలితాలు కనిపించును. ముఖ్యముగా ఒక్కవిషయం గుర్తించుకోవాలి మార్కెట్లో దొరికే తేనెలో పంచదరపాకం కలిపి ఉంటుంది. అది మధుమేహరోగులు తీసుకోరాదు . దానివల్ల వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం కలదు. కావున స్వచ్చమైన తేనెని ఎంచుకొనవలెను . 

              Low - Bp సమస్యతో బాధపడువారు , నిద్ర సరిగా పట్టనివారు రోజూ తేనెని తీసుకోవడం చాలా మంచిది . ప్రతినిత్యం తేనెని తీసుకోవడం వలన చక్కటినిద్ర రావడమే కాకుండా సుఖవిరేచనం అగును. తేనె వ్రణారోపణం కలిగి ఉంది. వ్రణారోపణం అంటే పుండ్లును త్వరగా మాన్పుగుణం అని అర్థం . కాలిన గాయాలను , పుండ్లను , కురుపులను తేనె వెంటనే మాన్పును . లొపల చెడు ఉన్నటువంటి పుండ్లు కూడా త్వరగా మానును . 

                    సౌందర్య సాధనములలో కూడా తేనె ఎంతో ప్రయోజనకారిగా పేరు పొందినది. తేనెలో ఎన్నో విటమిన్లు , పోషకాలు ఉన్నవి. బంగారుఛాయలో  సన్నగా ఉండాలనుకునే స్త్రీలు తప్పకుండా నిత్యం తేనెని తీసుకోవడం చాలా మంచిది . చర్మసౌందర్యానికి , శరీర ఆరోగ్యానికి అవసరం అయిన Riboflavin తేనెలో అధికంగా ఉన్నది. పెదవులను కూడా పగుళ్లు లేకుండా చేస్తుంది . అదేవిధముగా మొటిమల సమస్యతో ఇబ్బంది పడువారు ప్రతిరోజు క్రమంతప్పకుండా ఒక గ్లాసు నీళ్లలో ఒకస్పూను నిమ్మరసం , ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ విధముగా కొంతకాలంపాటు చేయుచున్న మంచి ఫలితం కనిపించును. అలానే తేనెలో పసుపు కలిపి ఉండలుగా చేసుకుని తినుచున్న మొటిమలు తగ్గును. 

              ఆయుర్వేదంలో తేనె బలాన్ని కలిగిస్తూ లేఖన గుణము కలిగి ఉంటుంది అని వివరించబడినది. లేఖన గుణము అనగా శరీరానికి శక్తిని ఇస్తూ శరీరమును సన్నబడునట్లు చేయునది అని అర్థం . ఈవిధముగా శక్తిని కోల్పోకుండా శరీరపు లావును తగ్గించటంలో తేనె అత్యుత్తమముగా పనిచేయును . ముఖసౌందర్యము కొరకు పాలను తేనెలో కలిపి ముఖంపై రాసుకుని కొద్దిసేపు అయ్యాక కడిగివేసిన ముఖము సౌందర్యముగా కనిపించును. తేనె కలిపిన పాలు ముఖమునకు రాసుకుని కొంచం ఆగి మెత్తటి పెసరపిండితో ముఖమును కడుగుచున్న ముఖం కాంతివంతమగును. 


             ఈవిధముగా ఆహారం , ఔషధముగా , ఔషధాలకు అనుపానంగా , సౌందర్య సాధనంగా తేనె ప్రాముఖ్యత వహించడం వలనే మన ప్రాచీనులు తేనె , ఆవుపాలు , ఆవువెన్న , ఆవునెయ్యి , ఆవుపెరుగులతో పాటు చేర్చి పంచామృతాలుగా చెప్పారు . 

   

అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

టార్పాలిన్స్1099 మాత్రమే, 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com

పాడి రైతులకు సూచనలు ఏంటి బయోటిక్స్ మందులను పశువులకు అవసరం ఎంత ?

పాడి రైతులకు సూచనలు
ఏంటి బయోటిక్స్ మందులను పశువులకు అవసరం ఉన్నప్పుడే హేతు బద్ధంగా వాడాలి.
విశృంఖలంగా వాడితే అవి పాల ద్వారా విసర్జింప బడి ప్రజారోగ్యానికి హానికర మవుతాయి.
పొదుగు వాపు కు EVM చికిత్స అద్భుతంగా పని చేస్తుంది.
వివరాలు చూడండి..
డా.డి.ప్రసాద్.


అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

టార్పాలిన్స్1099 మాత్రమే, 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com

Monday, June 29, 2020

లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోండి


లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోండి

ప్రభుత్వ ఉద్యోగులు తప్ప
కూలీలతో పాటు అందరు అర్హలే
తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి
ఏడాదికి రూ 22 మాత్రమే
5 స0 రాలు ఒకేసారి చెల్లించాలి, కేవలం 110/-రూ.. మాత్రమే

1) 18 నుండి 55 years ఉన్న  స్త్రీ , పురుషులు అర్హులు

2) ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన,ఇతరులైన ఇందులో చేరవచ్చు.

3) రేషన్ కార్డు,ఆధార్ కార్డు,జిరాక్స్ జత చేయాలి

4) బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి.

ప్రయోజనాలు

5) పాలసీదారు సహజ మరణం పొందితే  రూ.1,30,000/-రులు ఇన్సూరెన్స్

6.అలాగే  ప్రమాద వశాత్తూ మరణం వల్ల రూ.6,00000/-

7) ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000/-రూ,,

8) ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు 30,000/-రూ,, చొప్పున వచ్చే అవకాశం ఉంది.

9) 1 year పాలసీ పొందిన తరువాత లబ్ధిదారునికి
ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు, అదే 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది.

ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి 110/-రూ .చెల్లిస్తే 5 సంవత్సరాల వరకు చెల్లించనక్కర్లేదు.అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి 22/-రూ,,అన్నమాట

వెంటనే మీరు,మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులందరిని చేర్పించండి.

ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి.
కావున వెంటనే మీ మండలంలోని కార్మిక అధికారిని(లేబర్ ఆఫీసర్)MPDO/MRO గార్లను సంప్రదించండి.

చివరగా ఒక్క మాట 
ఈ పథకంలోకి చాలా మంది.... కార్మికులు మాత్రమే  చేరవచ్చని అనుకుంటారు.అది కానే కాదు.తెల్ల రేషన్ కార్డు కలిగి వున్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే..


అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

టార్పాలిన్స్1099 మాత్రమే, 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com

రియల్ హీరో శ్రీకాంత్ 👌💐

మరో సూర్యుడు-బొల్లా శ్రీకాంత్

మచిలీపట్నం జిల్లా లోని సీతారామపురం పల్లెలో ఒక రైతుకుటుంబం లో 1992 జూలై 7 వ తేదీన బొల్లా శ్రీకాంత్ పుట్టినపుడు తల్లితండ్రులు సంతోషించలేదు. పైగా చాలా బాధ పడ్డారు. ఎందుకంటే అతను రెండు కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి. ఆ వూరిజనం అయితే మరో అడుగు ముందుకేసి , ఆ పిల్లవాడిని ఎలా వదిలించుకోవాలో కూడా సలహాలు ఇచ్చారు. కానీ అమ్మ నాన్న అలా చేయలేదు. '' మేము బతికున్నంతవరకు వీడిని బాగా చూసుకొంటాం. మేము పోయాక దేవుడే చూసుకోవాలి '' అని అనేవారు. కళ్ళుకనపడకపోవడం తప్ప , బడిలో శ్రీకాంత్ అందరికంటే చురుకుగా వుండేవాడు. కానీ ఇంటర్ లో ' నీవు గుడ్డివాడివి కాబట్టి సీటు ఇవ్వలేమని '' కాలేజీలు చెపితే శ్రీకాంత్ కోర్టుకెళ్ళి గెలిచి admission తెచ్చుకొన్నాడు. తోటి పిల్లల ఎగతాళి భరించలేక చదువు మానేసి 2 ఏళ్ళు ఇంట్లోనే వుండిపోయాడు. మళ్ళీ హైదరాబాద్ లో school for the specially abled లో చేరాడు. అక్కడకూడా పిల్లలు అవమానపెట్టారు. అందరూ తనను వదిలేసి వెళ్ళిపోతుంటే బాధ తట్టుకోలేక బడివదిలేసి

పారిపోతుంటే ఒక teacher పట్టుకొని చెంపచెళ్ళుమనిపించింది. అది అతని జీవితం లో game changing moment. ఆ టీచర్ ఆడియో టేపుల్లో పాఠాలు వినిపించింది. ఇంటర్ లో MPC చదివి 98% సంపాదించగా ఎగతాళి చేసినవారు అవాక్కయ్యారు. కానీ IIT వాళ్ళు సీటు ఇవ్వమన్నారు. నిరాశ పడని అతను అమెరికా universities లకు entrance exams వ్రాస్తే Stanford , మరో 2 universities admission ఇవ్వడానికి ముందుకొచ్చాయి. శ్రీకాంత్ Howard Massachusetts Institute of Technology [ అమెరికా ] లో చేరాడు. అక్కడ Brain Cognitive Sciences లో చేరిన తొలి అంధుడిగా రికార్డు పొందాడు. అతని ప్రతిభ చూసి , చదువు అయ్యాక 4 అమెరికన్ కంపెనీ లు తమదగ్గర వుద్యోగం చేయమని అడిగితే శ్రీకాంత్ సున్నితంగా ' లేదు ' అనిచెప్పాడు. ' భారతదేశం చేరుకొని తనతోటి నిరుపేద , దివ్యాంగ భారతీయులకు సహాయపడే భాగ్యాన్ని నాకు ఇవ్వు ' అని అతను భగవంతుడిని ప్రతి రాత్రీ ప్రార్థించేవాడు. ప్రార్థనలు పరమాత్మ విన్నాడు.

శ్రీకాంత్ India కు వచ్చి హైదరాబాద్ దగ్గర Bollant Industries స్థాపించాలని వుందంటే రతన్ టాటా ముందుకొచ్చి ఫండ్స్ ఇచ్చారు. అది మొదలైంది. ఈరోజు అది 150 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీ. దానికి శ్రీకాంత్ CEO. సాక్షాత్తూ అబ్దుల్ కలాం గారే అక్కడికొచ్చారు. ఇద్దరూ కలిసి Lead India Project ద్వారా 4 లక్షలమంది విద్యార్థులకు పాఠాలు చెప్పారు. శ్రీకాంత్ దగ్గర ఇపుడు సుమారు 300 మంది దివ్యాంగులు వుద్యోగాలు చేస్తున్నారు. అతను 3000 మంది విద్యార్థులను చదివిస్తున్నాడు.

చీకటి ని అసహ్యించుకోనేవారు కొందరు , చీకటి ని చూసి భయపడేవారు ఇంకొందరు , చీకటిని చీల్చుకువెళ్ళేవారు మరికొందరు.ఆ మూడవరకం వాళ్ళను మూడక్షరాల పదం లో '' సూర్యుళ్ళు '' అంటారు. మనవాడు మరోసూర్యుడు,మరియు ఎందరికో మార్గదర్శి,ఇటువంటి వారి చరిత్రలు ఎందరికో దశ,దిశ నిర్దేశితాలు.

కరోన వచ్చింది మన చిన్నతనం గుర్తుకు తెచ్చింది

గతమెంతో ఘనమైనది తెలుగోడా......

మడిబట్ట ఆరేసుకోవటానికి దండె వుండేది, 

మడి నీళ్లు, వంటిల్లు, చల్లగదిలో ఊరగాయ జాడీలు, అందులో చింతకాయి, నిమ్మకాయి,దబ్బకాయి, ఆవకాయ, మాగాయి, మెంతి కాయి, తొక్కుడు పచ్చడి, వడియాలు, అప్పడాలు, ఊరచల్ల మిరపకాయలు, వుండేవి. 

బాదం చెట్టు, కరివేపాకు, అరటి, మందార పుావుల, పారిజాతం, తులసి మొదలైనవి. 

రెండు పెద్ద అరుగులు, ఎడమవైపు పోస్టాఫీసు గది, కుడి వైపు కరణీకం దస్త్రాలు గది, మధ్యలో మండువా, అటుా, ఇటుా గదులు, పెద్ద వసారా, అందులో ఆడపిల్లలు కుార్చునేవారు.

ఇంట్లోకి  రాకుాడని వారు, 
ఆచారము, అంటు అని మాట, మాటకి అనేవారు. 

బయట తిరిగి వస్తే, కాళ్లు చేతులు కడుగుకొని, బట్టలు మార్చుకున్నాకే భోజనం. 
ఉదయం 10.30, సాయంత్రం 6 కల్లా భోజనం. మజ్జిగ అన్నంలో వేసవి కాలంలో మామిడి పళ్ళు.

ఉదయం చద్దెన్నం, చిన్న పిల్లలకు కాఫీ లేదు, మధ్యాహ్నం , జంతికలు, మిఠాయి కొమ్ములు, చేగోడీలు, పుాతరేకులు.

శీతాకాలంలో, సీతాపలాలు, జామకాయ, సపోటా, తేగలు, బుర్ర గుంజు ,  తాటి ముంజెలు, 
వేసవికాలంలో, ఈత కాయలు, చీమచింతకాయలు.

భోజనములో కంది పచ్చడి, పెసరపప్పు పచ్చడి, మినపప్పు పచ్చడి, గోంగూర పచ్చడి, కొబ్బరి కాయ పచ్చడి, వంకాయ పచ్చడి, పచ్చి పులుసు, మెంతి మజ్జిగ, చల్లపులుసు, కందిపొడి, నువ్వులపొడి, పొట్లకాయపెరుగు పచ్చడి, పాలుపోసి ఆనపకాయకుార, ఆవ పెట్టి, పనస, అరటి, కందబచ్చలి, కుమారులు, తెలగపిండితో కుారలు, గుత్తి వంకాయ, మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు (టమోటా తక్కువ), తోటకూర, బచ్చలికూర, గోంగూర శనగ పప్పు పులుసు, పెండలం కుార, వేపుళ్ళు, బంగాళదుంప ఉప్మా కుార.
 
ఇంక తద్దినం భోజనము సరేసరి,   ఆలస్యం అయినా అమోఘం, మధ్యాహ్నం 2 దాక వేచి చూసే  వాళ్ళం, మధ్యలో అడిగితే, బ్రాహ్మలు భోజనాలు  అవుతున్నాయి, అరగంట ఆగండి అనేవారు.

గారెలు, అప్పాలు, పరవాన్నం, 
నుావుపచ్చడి, అల్లపచ్చడి, పులుసు వుండదు, చారు, పెసరపప్పు (ఉట్టిదే తినాలని పించేది) తీపి కుార, 
ఆవపెట్టిన కుార, ఇంకో కుార, 
అనకుాడదుకానీ, తద్దినం భోజనం తలుచుకుంటే ఎటువంటివారికైనా నోట్లోనుంచి చొంగ కారాల్సిందే ... 

శుభకార్యాలలో, బుారెలు, బొబ్బట్లు, మైసుారు పాక్(ఆరోజుల్లో) పుాతరేకులు, బుాంది లడ్డు, గుమ్మడి కాయ దప్పళం, పనస పొట్టు కుార స్పెషల్.

అత్తరు సాహెబ్ సెంటు, అత్తరు, 
వచ్చినప్పుడు కంటికి సుర్మ పెట్టే వాడు, 

తలకు రాసుకోవటానికిి టాటా, స్వస్తిక్ సువాసనగల నుానె, ఆడవాళ్ళు జుట్టు ఊడకుండ 'రీట' రాసుకునేవారు. 
అప్పట్లో తిలకం పెట్టుకునే వారు, స్టిక్కర్లు లేవు. 

మగవాళ్ళుకుాడ తిలకం పెట్టుకుని బడికి వెళ్ళేవాళ్ళం, 

పెద్దలు విభూది పెట్టు కొనేవారు. 
రాత్రి పడుకునేటప్పుడు కథలు చెప్పుకునేవారం, 

కరోన వచ్చింది.
మా చిన్నతనం గుర్తొచ్చింది,

టీవీలో వచ్చే వివిధ ఛానెల్స్‌ అన్నీ ఒకే ఒక కేబుల్‌ తీగ ద్వారా ఎలా ప్రసారం అవుతాయి?

 టీవీలో వచ్చే వివిధ ఛానెల్స్‌ అన్నీ ఒకే ఒక కేబుల్‌ తీగ ద్వారా ఎలా ప్రసారం అవుతాయి


 మీ టీవీ వెనుక తగిలించే కేబుల్‌ తీగను మీ ప్రాంతంలో ఉండే కేబుల్‌ ఆపరేటర్‌ ఏర్పాటు చేస్తాడు. మీ టీవీలో ప్రసారమయ్యే రకరకాల ఛానెల్స్‌ నిర్వాహకులకు అతడు కొంత సొమ్ము చెల్లించి వాటిని ప్రసారం చేసే హక్కుల్ని పొందుతాడు. ఆయా ఛానెల్స్‌ వాళ్లు తమ కార్యక్రమాల సంకేతాలను ఉపగ్రహాలకు ప్రసారం చేస్తే వాటిని ప్రత్యేక ఏంటెన్నాల ద్వారా కేబుల్‌ ఆపరేటర్లు సేకరిస్తారు. అలా సేకరించే ఛానెల్స్‌ సంకేతాలన్నీ వేర్వేరు ఫ్రీక్వెన్సీలలో ఉంటాయి. వాటిని ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్‌ పరికరం గ్రహించి కేబుల్‌ తీగ ద్వారా ప్రసారం చేయగలిగే ఫ్రీక్వెన్సీలోకి మారుస్తుంది. ఇవన్నీ కలగలిసి కేబుల్‌ ద్వారా ఇంటికి చేరుకుంటాయి. టీవీ వెనుక ఉండే రేడియో ఫ్రీక్వెన్సీ (RF) సాకెట్‌కు తగిలించినప్పుడు ఆ సంకేతాలన్నీ వేర్వేరు ఛానెళ్ల ఫ్రీక్వెన్సీలోకి మారతాయి. ఈ పద్ధతినే డీమాడ్యులేషన్‌ లేదా విశ్లేషణం అంటారు. ఎంపిక చేసుకున్న ఛానెల్‌కు సంబంధించిన ఫ్రీక్వెన్సీని టీవీ సర్క్యూట్‌ ఉత్పత్తి చేయగా, అదే ఫ్రీక్వెన్సీకి చెందిన అంశాల అనునాదం (resonance) జరుగుతుంది. ఫలితంగా ఆ ఛానెల్‌కి సంబంధించిన కార్యక్రమాలే తెరపై కనిపిస్తాయి. ఈ ప్రక్రియంతా కాంతి వేగంతో జరుగుతుంది.

భోజనం వండడానికి యోగ్యమైన పాత్రలు ? మన భారతీయ సంస్కృతిలో

భోజనం వండడానికి యోగ్యమైన పాత్రలు


*వాటిలో వండితే ఉండే పోషక విలువల నిష్పత్తి*...
*మట్టికుండలో .... 100%*
*కంచు పాత్రలో ......97%*
*ఇత్తడి పాత్రలో .........93%*
*అల్యూమినయం*
*ప్రెషర్ కుక్కర్ లో...7% నుంచి 13%*

*కావున మన మందరము ఇత్తడి లేక మట్టి పాత్రలను వాడి తే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుగలము*. ...

*మట్టి పాత్రల విశిష్టత*

*వాగ్బటాచార్యులు* చెప్పిన మొదటి సూత్రం ఏ ఆహారమైనా వండేటప్పుడు గాలి , వెలుతురూ తగులుతూ వుండేలా చూసుకోవలెను . మనం వండుకునే ఏ ఆహారానికైనా సూర్యునికాంతి , గాలి ( పవనము ) తగలని ఆహారము తినకూడదు . అది ఆహారము కాదు విషముతో సమానము . ఈ విషము నిదానముగా పని చేస్తుంది . అంటే కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలుగా పని చేస్తుంది .

*ప్రెషర్ కుక్కర్* లో వండే ఆహారానికి ఏ మాత్రమూ గాలి , సూర్యరశ్మి తగలదు . కావున ఇందులో వండిన ఏ ఆహారమైన విషతుల్యము . అల్యూమినియంతో ఈ ప్రెషర్ కుక్కర్ ని తయారు చేస్తారు . అల్యూమినియం పాత్రలలో ఆహారం వండటంగానీ , నిలువ వుంచటానికి గానీ ఏ మాత్రం పనికిరాదు . ఈ పాత్రలలో వండిన ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ తింటూ వుంటే వారికి *మధు మేహం , జీర్ణ సంబంధిత , టి.బి. ఆస్తమా మరియూ కీళ్ళ సంబంధ* వ్యాధులు తప్పకుండా వస్తాయి . ఈ రోజు అందరి ఇళ్ళలోకి అల్యూమినియం వచ్ఛేసింది .

ప్రెషర్ అనగా ఒత్తిడి అంటే మనం ప్రెషర్ కుక్కర్ లో వండే పదార్ధం ఒత్తిడికి గురై త్వరగా మెత్తబడుతుంది . కానీ ఉడుకదు. పదార్ధం ఉడకడం వేరు మెత్తబడడం వేరు .

ఆయుర్వేదం ప్రకారం భూమిలో ఏగింజ పండడానికి ఎక్కవకాలం పడుతుందో అదేవిధంగా ఆగింజ వండడానికి ఎక్కవ సమయం తీసుకుంటుంది . గింజలోని అన్నిరకాల పోషకాలు మన శరీరంలోకి చేరాలంటే పదార్ధం వండబడాలి . మెత్తబడితే సరిపోదు . ఇది ప్రకృతి ధర్మం , ఆయుర్వేద సిద్ధాంతం .

ప్రాచీన కాలంనుండి భారత దేశంలో దేవాలయాలలో భగవంతునికి ప్రసాదం మట్టి పాత్రలోనే వండి , మట్టి పాత్రలోనే భగవంతునికి సమర్పిస్తారు . ఎందుకంటే మట్టి పరమ పవిత్రమైనది . మన శరీరం అంతటా ఉండేది మట్టియే . మన ఆరోగ్యానికి కావలసిన 18 రకాల మైక్రోన్యూట్రియన్స్ ఈ మట్టిలో వున్నాయి . మట్టి పాత్రలో వండిన ఆహార పదార్ధాన్ని రీసెర్చ్ చేయిస్తే వచ్చిన రిపోర్ట్ ఏమిటంటే ఈ పదార్ధాంలో ఒక్క మైక్రో న్యూట్రియన్స్ కూడా తగ్గలేదు . ప్రెషర్ కుక్కర్ లో వండిన పదార్ధాన్ని కూడా టేస్ట్ చేయిస్తే 7% నుండి 13% న్యూట్రియన్స్ మాత్రమే ఉన్నాయి . 93% నుండి 87% న్యూట్రియన్స్ దెబ్బతిన్నాయి , లోపించాయి అని తేలింది . *మట్టిపాత్ర* లో వండిన పదార్ధములో 100% న్యూట్రియన్స్ ఉన్నాయి . ఈ పదార్ధినికి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది .

మన పూర్వీకులు ఈ సంప్రదాయం ప్రకారం జీవించినంత వరకు వారికి కళ్ళజోడు రాలేదు . జీవితాంతం వరకు పళ్ళు ఊడిపోలేదు , మోకాళ్ళ నొప్పులు , డయాబెటీస్ వంటి సమస్యలు రాలేదు . జీవితాంతం మన శరీరానికి కావల్సిన న్యూట్రియన్స్ అందుతుంటే మన పనులు మనమే చేసుకుంటూ ఎవరిమీద ఆధారపడకుండా జీవించగలం . అదీ ఒక్క మట్టిపాత్రలో వండిన ఆహారం భుజించటం వలన మాత్రమే సాధ్యమవుతుంది . డయాబెటీస్ ఏ స్ధాయిలో ఉన్నవారికైనా ఈ పద్ధతిలో భోజనం వండి పెట్టండి. సుమారు కొన్ని నెలలోపే ఖచ్చితంగా డయాబెటీస్ రోగం నుండి విముక్తులవుతారు . ఆనందంగా జీవిస్తారు .

మనం ఆరోగ్యంగా జీవితాంతం బ్రతకాలంటే గాలి , సూర్యరశ్మి తగిలేలాగా ఆహారం వండు కోవాలి . ఈ పద్ధతికి అత్యుత్తమైనది *మట్టి పాత్ర* .

మనకి మట్టి పాత్రలు తయారు చేసే కుమ్మరి వాళ్ళు ఎంతో గౌరవనీయులు . అన్ని రకాల మట్టి పాత్రలకు పనికి రాదు . ఏ మట్టి పనికి వస్తుందో , ఎలాంటి మట్టిలో వంట పాత్రలు చేయవచ్చో గుర్తించి తయారు చేస్తారు . ఇంత గొప్ప సేవచేసి మనకు ఆరోగ్యాన్ని అందించుచున్నందుకు నిజంగా వారు మనకు వందనీయులు .

మట్టి పాత్రలోనే ఆహారం వండుకుందాం.  కుదరకపోతే ఇత్తడి లేద రాగి పాత్రలోనైన సరే వండుకుందాం ఆరోగ్యముగా  జీవిద్దాం .

అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

టార్పాలిన్స్1099 మాత్రమే, 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com

కిసాన్ క్రెడిట్ కార్డ్ వివరాలు & కార్డుకి ఎవరు అర్హులు?

కిసాన్ క్రెడిట్ కార్డ్ వివరాలుఈ కార్డుకి ఎవరు అర్హులు?

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి నుండి   రైతు భరోసా లో కేంద్ర ప్రభుత్యం నుండి రూ. 6000/- పొందిన రైతులు అందరూ ఈ పథకానికి అర్హులు. 

👉🏼 *ఈ వివరాలు ఎక్కడ లభిస్తాయి ?*
https://pmkisan.gov.in  వెబ్సైట్ లో లభిస్తాయి.  ఈ లిస్టులో ఉన్నవాళ్లు అందరూ అర్హులే. కానీ క్షేత్రస్థాయిలో కొంతమంది లబ్దిదారులే మనకు అర్హతకు వస్తారు. ఉదాహరణకు ఒక గ్రామాన్ని తీసుకొన్నట్లయితే 100 రైతులకు అర్హత ఉంటే 40-50% మంది పట్టణాల్లో లో వుంటారు(కౌలికి ఇచ్చి వుంటారు). 10 % మంది రైతులకు పాడి పశువులు ఉండవు.కాబట్టి లిస్టులో మనకు 40 - 50 శాతం మంది రైతులు క్రెడిట్ కార్డ్ పొందేందుకు అర్హులుగా వుంటారు. వాళ్ళను మనం లిస్ట్ చేసుకొని పెట్టుకోవాలి.
ఆ లిస్టులో ఉన్న  18 నుండి 75 సంవత్సరాల వయస్సు గల రైతులు అందరూ అర్హులు. 
👉🏼 *ఉండవలసిన పత్రాలు*
రైతు ఫోటో,
 పాన్ కార్డ్,
 ఆధార్ కార్డ్.
👉🏼 *ఎంత మొత్తం రుణం ఇస్తారు?*
రూ.1,60,000/- ఎటువంటి భూమికి సంబందించిన పత్రాలు లేకుండా ఇస్తారు.ఆ పై దాటితే భూమికి సంభందించిన పత్రాలు ఉండాలి.2 ఎకరాల 50 సెంట్స్ కు రూ.2,50,000/-  రుణం ఇస్తారు. గరిష్ట పరిమితి 3 లక్షలు.
👉🏼 ఈ రుణం బ్యాంక్ వారి (మండలాలలో పరిధి లోని బ్యాంక్ ) సూచనల మేరకు 1 సంవత్సరం లో కట్టాలి.
👉🏼 వడ్డీ 7% పడుతుంది.(సుమారుగా 25 పైసలు) .రైతు బ్యాంకు వారు సూచించినట్లు 1 సంవత్సరం లో లోను కట్టినట్లు అయితే *ఇంటరెస్ట్ సబ్వెన్షన్ స్కీం ( ISS)* కింద నాబార్డ్ లేదా RBI 3% రైతు ఖాతాలోకి వడ్డీ అమౌంట్ తిరిగి జమ చేస్తుంది.అలాగే రీ పేమెంట్ prompt గా చేస్తే *prompt repayment incentive*  కింద ప్రభుత్యం వడ్డీ అమౌంట్ లో 3% మరల రైతు ఖాతాలోకి డబ్బు జమ చేస్తుంది.అంటే రైతు తీసుకొన్న లోన్ సక్రమంగా చెల్లిస్తే మొత్తంగా 1% వడ్డినే కడతారు (5 - 10 పైసలు వడ్డీ) .
👉🏼 ఈ కార్డ్ కాలపరిమితి 5 సంవత్సరాలు.దీనిలో ఇంకా నెలకు 12 రూపాయలు కడితే (5 సంవత్సరాలు) ప్రైమినిస్టర్ స్వంవృద్ది బీమా యోజన క్రింద  ₹2,00,000 ప్రమాద భీమా వర్తిస్తుంది.(మరణానికి మరియు శాశ్వత వైకల్యానికి). అలాగే  సంవత్సరంనకు ₹ 330/- కడితే (5 సంవత్సరాలు) ప్రైమినిస్టర్ జ్యోతి భీమా క్రింద జీవితకాలం ₹2,00,000/-  ప్రమాద భీమా( మరణానికి మరియు 
శాశ్వత వైకల్యానికి) వర్తిస్తుంది. 

కాబట్టి రైతు భరోసా కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న పారా సిబ్బంది AHA లు మరియు గోపాలమిత్రులు ఒక్కో RBK కి 10 కార్డ్స్ ను ప్రాధమికంగా మంజూరు చేయించండి. ఈ కార్డులో లోన్ తీసుకొన్న రైతుకు చాలా తక్కువగా వడ్డీ పడుతుంది. ఆర్ధికంగా మనం తోడ్పాటు చేసినవాళ్ళం అవుతాము. మన ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించిన వాళ్ళం అవుతాం. మనము చేయవలసినదంతా రైతును గుర్తించడం, అప్లికేషన్ నింపడానికి కావలసిన పత్రాలను గూర్చి చెప్పడం మరియు ఆ అప్లికేషన్ ఆ రైతు బ్యాంకులో సమర్పించేటట్లు చేయడం తో మన పని ముగుస్తుంది. ఆ రైతుకి ఉన్న అర్హత బట్టి, ఇంతకు ముందు ఏమైనా అప్పులు ఉన్నవా ,ఇతరత్రా విషయాలు బాంక్ వారు చూసి లోన్ మంజూరు చేస్తారు. అప్లికేషన్లో మన AH డిపార్ట్మెంట్ దగ్గర టిక్ చేయాలి లేదా పైన రాయాలి. పై లోన్ మొత్తం గేదేలు  మరియు ఆవులు కొనేందుకు కాదు. దాణా, పశుగ్రాసం పెంపకం మరియు ఇతర యాజమాన్య ఖర్చులకు అని తెలుపగలరు. 

*గమనిక*: పాడి పశువులు ఎన్ని ఉన్నా, రైతు భరోసా  అర్హులకు మాత్రమే వర్తి స్తుంది. కాబట్టి గమనించ గలరు.

అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

టార్పాలిన్స్1099 మాత్రమే, 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com

అమ్మ మీకు వందనం 💐

అమ్మ మీకు వందనం 💐

పిల్ల‌లు పుట్ట‌లేద‌ని చెట్ల‌ను పెంచుకుంది.. ఆమె నాటిన మొక్క‌ల విలువ రూ. 1,75,00,000.. 

ప్రకృతి మాతకు ఆమె చేసిన సేవకు గుర్తింపుగా ఆమెకు  ప‌ద్మశ్రీ పుర‌స్కారం లభించింది.!🇮🇳

ఓ తిమ్మక్కా ... నీకు వందనం .... 🙏🙏🙏

107 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న సాలుమ‌ర‌ద తిమ్మ‌క్క‌. మ‌న‌కెవ‌రికీ అంత‌గా తెలియ‌క‌పోయినా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుల‌కు మాత్రం సుప‌రిచితురాలు. గొప్ప ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌. సాలుమ‌ర‌ద అంటే చెట్ల వ‌ర‌స అని అర్థం. తిమ్మ‌క్క‌ను మ‌ద‌ర్ ఆఫ్ ట్రీస్‌గా పిలుస్తారు. ఎవ‌రీ తిమ్మ‌క్క‌? క‌ర్ణాట‌క రాష్ట్రం బెంగ‌ళూరు రూర‌ల్ జిల్లా హులిక‌ల్ గ్రామానికి చెందిన సాధార‌ణ మ‌హిళ‌. పుట్టింది, పెరిగింది గుబ్బి ప‌రిధిలోని తుముకూరులో. పేద‌రికం కార‌ణంగా చ‌దువుకోలేదు. త‌ల్లిదండ్రులు దిన‌స‌రి కూలీలు. ప‌దేళ్ల వ‌య‌సు వ‌చ్చేస‌రికి తిమ్మ‌క్క గొర్రెల‌ను, మేక‌ల‌ను కాసే బాధ్య‌త చేప‌ట్టింది. చెట్లంటే ప్రాణం ఆమెకు చెట్లంటే ప్రాణం. చిన్న‌ప్ప‌టి నుంచి తుముకూరులో చెట్ల‌తో మంచి అనుబంధం ఏర్ప‌రుచుకుంది. రోజూ అడ‌వి నుంచి ఏదో ఒక చెట్టు ప‌ట్టుకొచ్చి ఇంట్లో నాటేద‌ట‌. అలా ప్ర‌కృతి నేస్తంగా మారిన ఆవిడ త‌న‌లా ఎంద‌రినో ప్ర‌కృతి గురించి ఆలోచింప‌జేసింది. అందుకే ప్లాంట్ ఎ ట్రీ.. అడాప్ట్ ఎ ట్రీ.. సేవ్ ఎట్రీ.. గెట్ ఎ ట్రీ అనే క్యాంపెయిన్ న‌డిపిస్తున్నారు. చెట్లే పిల్ల‌లుగా తిమ్మ‌క్క‌కు బికాలు చిక్క‌య్య‌తో పెళ్ల‌యింది. అత‌డు ఏదో ఒక ప‌ని చేస్తున్న‌ప్ప‌టికీ పేద‌రికం మాత్రం పోలేదు. పెళ్ల‌యి సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా వాళ్ల‌కు పిల్ల‌లు పుట్టలేదు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యారు. చిన్న‌ప్ప‌ట్నుంచి చెట్లంటే ప్రాణంగా భావించే తిమ్మ‌క్క చెట్ల‌నే పిల్ల‌లుగా పెంచుకోవాల‌నుకుంది. ఊళ్లో చెట్ల‌ను నాటుతూ క‌న్న బిడ్డ‌ల్లా.. కంటికి రెప్ప‌లా చూసుకున్నారు. 384 మ‌ర్రిచెట్లు హులికుల్ నుంచి కుడుర్ వ‌ర‌కు ఉన్న జాతీయ ర‌హ‌దారికి ఇరువైపులా సుమారు నాలుగు కిలోమీట‌ర్ల మేర 384 మ‌ర్రి చెట్లు పెంచింది తిమ్మ‌క్క‌. ప్ర‌తిరోజూ పొద్దున్న చెట్ల‌కు నీళ్లు పోయ‌డం.. పాదులు తీయ‌డం.. అక్క‌డే ఉండి వాటిని ప‌రిర‌క్షించ‌డం వారి దిన‌చ‌ర్య‌లో భాగ‌మైంది. కోట్ల విలువ‌ ఆమె నాటిన మొక్క‌ల విలువ రూ. 1,75,00,000 అని ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు చెప్తున్నారు. తిమ్మ‌క్క సేవ‌ల‌ను గుర్తించిన క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఆమెను ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌గా ప్ర‌క‌టించింది. చ‌దువు లేక‌పోయినా.. డ‌బ్బు లేక‌పోయినా వాళ్ల‌కు తెలియ‌కుండా స‌మాజానికి చేస్తున్న అమూల్య సేవ‌ల‌ను అనేక‌సార్లు అవార్డుల రూపంలో స‌న్మానించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ఆవిడ‌ చేస్తున్న‌ది గొప్ప కార్యంగా.. భ‌విష్య‌త్ త‌రాల‌కు ఆస్తిగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు ప్ర‌శంసించారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌, ఆక్లాండ్‌, కాలిఫోర్నియాలోని ప‌ర్యావ‌ర‌ణ సంస్థ‌ల‌కు ఆమె పేరు మీద తిమ్మ‌క్కాస్ రీసోర్సెస్ ఫ‌ర్ ఎన్విరాన్‌మెంట‌ల్ ఎడ్యుకేష‌న్ అని పేరు పెట్టారు. సీబీఎస్ఈ పాఠ్య పుస్త‌కాల్లో ఆమె గురించి పాఠాన్ని పొందుప‌ర్చారు. ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం ప‌ర్య‌వర‌ణ సంర‌క్ష‌ణ కోసం కృషి చేస్తున్న తిమ్మ‌క్క కోట్లాది రూపాయ‌ల సంప‌ద‌నైతే స‌మాజానికి ఇచ్చింది కానీ.. ఆమె మాత్రం ప్ర‌భుత్వం ఇచ్చే రూ.500 పింఛ‌న్‌తోనే పూట గ‌డుపుతోంది. పర్యావ‌ర‌ణ కోసం.. స‌మాజం కోసం ఆమె చేస్తున్న సేవ‌ల‌ను గుర్తించి భార‌త ప్ర‌భుత్వం ఈసారి ప‌ద్మ అవార్డుల్లో భాగంగా తిమ్మ‌క్క‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డు ప్ర‌క‌టించింది. 1995లో భార‌తీయ పౌర స‌త్కారం.. 1997లో ఇందిరా ప్రియ‌ద‌ర్శిని వృక్ష‌మిత్ర పుర‌స్కారం కూడా పొందింది.

ఓ తిమ్మక్కా ... నీకు వందనం ..

పంటలకు పెరిగిన మద్ధతు ధరల వివరాలు


పంటలకు పెరిగిన మద్ధతు ధరల వివరాలు


వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( వానాకాలం సీజన్ కోసం).

ప్రతి క్వింటాల్ కు.....

1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53)

2. వరి (గ్రేడ్ ఎ రకం) నూతన ధర రూ.1888

3. జొన్నలు ( హైబ్రీడ్) నూతన ధర రూ. 2,620/- ( పెంచిన ధర రూ.70/-)

4. జొన్నలు ( దేశీయ) నూతన ధర రూ. 2640(పెంచిన ధర రూ.70/-)

5. సజ్జలు నూతన ధర రూ.2150/-( పెంచిన ధర రూ.150/-)

6. రాగులు నూతన ధర రూ.3,295/-( పెంచిన ధర రూ. 145)

7. మొక్కజొన్నలు నూతన ధర రూ.1,850/-( పెంచిన ధర రూ.90/-)

8. కంది పప్పు పెంచిన  ధర రూ.6,000/-, ( పెంచిన ధర రూ.200/-)

9. పెసర పప్పు పెంచిన ధర రూ.7196/-, పెంచిన ధర రూ.146

10. మినపప్పు పెంచిన ధర రూ. 6,000/-(పెంచిన ధర రూ.300/-)

11. వేరుశనగ నూతన ధర రూ.5275/-( పెంచిన ధర రూ.185/-)

12 . ప్రొద్దుతిరుగుడు నూతన ధర రూ.5885/-( పెంచిన ధర రూ. 235/-)

13. సోయాబిన్ నూతన ధర రూ. 3,880/-( పెంచిన ధర రూ.175/-)

14. నువ్వులు నూతన ధర రూ.6855, ( పెంచిన ధర రూ.370/-)

15. ఒడిసెలు నూతన ధర రూ. 6,695/-(పెంచిన ధర రూ. 755/-)

16. ప్రత్తి(మధ్యరకం) నూతన ధర రూ.5515( పెంచిన ధర రూ.260/-)

17. ప్రత్తి( పొడవు రకం) నూతన ధర రూ.5825(పెంచిన ధర రూ. 275/-)
          
అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 

https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

టార్పాలిన్స్1099 మాత్రమే, 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్
              www.chaarviinnovations.com

            www.chaarviinnovations.com

మృగశిరకార్తె గురించి ఇప్పటి తరానికి

మృగశిరకార్తె గురించి ఇప్పటి తరానికి 

 
సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించిన నాటి నుండి మృగశిరకార్తె ఏర్పడుతుంది. ఈ కార్తె నుండి వర్షాలు పడతాయని మనవారి భావన. ఇదే సమయంలో మన ప్రాంతంలోకి నైఋతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. 
భారతీయ జ్యోతిష సాంప్రదాయ ప్రకారం ఒక్కోక్క కార్తెలో ప్రకృతిలోని మార్పు, దాని వలన జరిగే ప్రత్యేకాంశలను సవివరంగా వివరించింది. ఈ కార్తెల ఆధారంగా వ్యవసాయ దారులు, జానపదులు ( గ్రామీన ప్రాంతం వారు) ఎక్కువగా వీటిపై ఆధారపడి చేయువృత్తులు, వ్యవసాయ సాగు. ఈ కాలగణనతో కార్తెల అధారంగా వారి పంటల నిర్ణయం, సాగు చేసుకుంటారు. సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించిన నాటి నుండి మృగశిర కార్తె ఏర్పడుతుంది. ఈ కార్తె నుండి వర్షాలు పడతాయని మనవారి భావన. ఇదే సమయంలో మన ప్రాంతంలోకి నైఋతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. 

పంచాగ ప్రకారం:-  ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్క వర్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయదారులకు నిత్య జీవనోపయోగిగా వ్యవసాయ పనులకు మార్గదర్శకంగా ఈ కార్తెలు ఉపయోగపడుతున్నాయి.

పురాణగాధ ప్రకారం:- మృగ శిరస్సు కలిగిన మృగ వ్యాధుడు అను వృతాసురుడు వర ప్రభావంచే పశువులను, పంటలను హరించివేయడం ప్రకృతి భీభత్సాలాను సృష్టించడం, వర్షాలకు అడ్డు పడటం జరుగుతూ ఉండేడిది. వీడు చనిపోకుండా అనేక వరాలు కలిగి ఉండటంచేత ఇంద్రుడు సముద్ర అలల నుండి వచ్చే నురుగును ఆయుధంగా చేసి చంపివేస్తాడు.

మృగశిర కార్తెకు మన ఆచార సాంప్రదాయంలో విశేష ప్రాధాన్యత ఉంది. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలతో సతమతమయ్యే జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతువపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. ఈ కార్తెను రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. ఏరువాక అంటే నాగటి చాలు ఈ కాలంలో రుతు పవనాలు విస్తరించి తొలకరి జల్లులు పడగానే పొలాలు దున్ని పంటలు వేయడం మొదలు పెడతారు. 

కార్తె ప్రారంభం :- చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. ఏ నక్షత్రం సమీపంలో ఉంటే.. ఆ కార్తెకు ఆ పేరు పెడతారు... అశ్వినితో ప్రారంభమై రేవతితో ముగిసే వరకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల పేర్లతో కార్తెలు ఉన్నాయి. ప్రస్తుతం మృగశిర నక్షత్రానికి చేరువలో చంద్రుడు ఉండటం వల్ల దీనికి మృగశిర కార్తె అనే పేరు వచ్చింది. 

మృగశిర కార్తెను ఎలా జరుపుకోవాలి:- మృగశిర కార్తె మొదటి రోజును దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర , మృగం , మిరుగు , మిర్గం పేర్లతో వ్యవహరిస్తారు. ఈ రోజు ప్రజలు బెల్లంలో ఇంగువను కలుపుకుని సేవిస్తారు. ఇంగువ శరీరంలో ఉష్ణాన్ని ప్రేరేపించి.. వర్షా కాలంలో సోకే వ్యాధులను నియంత్రిస్తుందని పెద్దలు చెబుతారు. అలాగే మృగశిర కార్తె ప్రారంభం రోజున చేపలు / ఇతర మాంసాహారం తింటే వ్యాధులు దరిచేరవని మాంసాహార ప్రియుల ప్రజల నమ్మకం.
మృగశిరా కార్తె ఫలములు:- జ్యేష్ట బహుళ తదియ తేదీ 8 జూన్ 2020 సోమవారం రోజున ఉదయం 6:39 నిమిషాలకు రవి నిరయన మృగశిరా కార్తె ప్రవేశము. ప్రవేశ సమయమునకు పూర్వాషాడ నక్షత్రం, మిధున లగ్నం, వరుణ మండలం , పాద జలరాశి ,నపుం-స్త్రీ యోగం, మహిష వాహనము, రవ్వాది గ్రహములు దహ, సౌమ్య , రస, సౌమ్య, రస, వాయు, జలనాడీచారము మొదలగు శుభాశుభ యోగములచే
సరాసరి ఈ కార్తెలో వర్ష భంగములు ఎక్కువగా ఉన్నందున దేశ భేదమున స్వల్ప తుంపురు వర్షములు కురియును.

వివిధ కార్తెల్లో చేయవలసిన వ్యవసాయ పనులు

కొంతమంది రైతుసోదరులు అడిగారు వ్యవసాయకార్తె గురుంచి సమాచారం కావలి అని వారికోసం

వివిధ కార్తెల్లో చేయవలసిన వ్యవసాయ పనులు
అశ్వని కార్తె
సజ్జ : వేసవి పైరు కోతలు 
వరి : కోతలు, కత్తెరకు (కృత్తిక) వరి నారు పోయుట. 
జొన్న : వేసవి జొన్న పంట సాగు. 
మొక్కజొన్న : వేసవి పంట విత్తుట. 
వేరుశనగ : త్రవ్వకాలు

భరణి కార్తె
వేసవి పనులు

కృత్తిక కార్తె
వేసవి పనులు

రోహిణి - మృగశిర కార్తెలు
వరి : సార్వ లేక అబి వరినారు పోయుట, వరి వేయబోయే పొలాల్లో ఎరువులు వేయుట. 
మొక్కజొన్న : దమ్ములు చేయుట. ఎరువులు వేసి దుక్కులు దున్నుట, ఖరీఫ్ పంటలను విత్తుట. 
కాయ ధాన్యాలు : తక్కువ పంటకాలపు పెసర, మినుము, కంది విత్తుట, అంతర కృషి చేయుట. 
గోగు : రసాయనిక ఎరువులు వేయుట. 
పసుపు : భూమిని తయారు చేయుట, ఎరువులు వేయుట, విత్తనం వేయుట (కడప, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో) 
కూరగాయాలు : బెండ, గోరుచిక్కుడు విత్తుట, గుమ్మడి, సొర, పొట్ల, కాకర పాదులు పెట్టుట. 
సజ్జ : ఎరువులు వేసి దుక్కులు దున్నుట. 
ప్రత్తి : ఎరువులు వేసి దుక్కులు దున్నుట. విత్తనం వేయుట. 
పండ్లు : ద్రాక్షకు క్రిమి సంహారక మందులు చల్లుట, ఎరువులు వేయుట, నిమ్మకు ఎరువులు, రేగు, దానిమ్మ మొక్కల నాట్లు. (అంటు కట్టే మొక్కలకు మామిడి టెంకలు నాటడం). 
వేరుశనగ : రసాయనిక ఎరువులు వేసి విత్తుట. 
సువాసన మొక్కలు : రూషాకామంచి, పాల్మా రోజా విత్తనాలు చల్లటం.

ఆర్ధ్ర కార్తె
వరి : నారుమళ్లలో అంతరకృషి, సస్యరక్షణ 
జొన్న : దుక్కులు దున్నుట, రసాయనిక ఎరువులు వేయుట, విత్తనం వేయుట. 
మొక్కజొన్న : సస్యరక్షణ - రెండవ దఫా ఎరువులు వేయుట. 
ప్రత్తి : అంతరకృషి, మొక్కలను పలుచన చేయుట. 
గోగు : అంతరకృషి, మొక్కలను పలుచన చేయుట. 
పండ్లు : అరటి, మామిడి, జామనాట్లు, కొబ్బరి చెట్లకు ఎరువులు వేయుట, రేగు, దానిమ్మ నాట్లు. 
పప్పుధాన్యాలు : వర్షాలు ఆలస్యం అయినచో కంది విత్తుటకు భూమిని తయారు చేయుట - విత్తుట. 
కూరగాయలు : బీర, సొర, పొట్ల, గుమ్మడి విత్తుట. 
సువాసన మొక్కలు : నిమ్మగడ్డి, కామాక్షిగడ్డి, సిట్రొనెల్లా నాట్లు.

పునర్వసు కార్తె
వరి : సార్వా లేక అబి వరినాట్లు, ముందుగా నాటిన వరిలో అంతరకృషి, సస్యరక్షణ. 
సజ్జ : రసాయనిక ఎరువులు వేసి పునాస లేక ఖరీఫ్ పైరు విత్తుట. 
వేరుశనగ : అంతరకృషి, సస్యరక్షణ. 
ఆముదం : రసాయనిక ఎరువులు వేసి విత్తుట. 
మిరప : నారుమళ్లలో విత్తులు జల్లుట. 
పసుపు : దుగ్గిరాల ప్రాంతంలో నాట్లకు భూమిని తయారు చేయుట, ఎరువులు వేయుట, గోదావరి ప్రాంతంలో పైరులో కలుపు తీయుట, గొప్పు త్రవ్వుట, (త్రవ్వటం). 
పూలు : చేమంతి నారు పోయుట, గులాబి, మల్లె కనకాంబరం చెట్లకు ఎరువులు వేయుట. సస్యరక్షణ. 
జొన్న : పునాస లేక ఖరీఫ్ జొన్న విత్తుట. విత్తిన పంటకు ఎరువులు వేయుట. సస్యరక్షణ. 
మొక్కజొన్న : అంతరకృషి, సస్యరక్షణ. నెలాఖరులో ఎరువులు వేయుట. 
పసుపు : దుగ్గిరాల ప్రాంతంలో పసుపు నాట్లు. 
చెరకు : సస్యరక్షణ, ఎరువులు వేయుట. 
పండ్లు : మామిడి, నిమ్మ, నారింజ, అరటి, సపోటాలకు ఎరువులు వేయుట, ద్రాక్ష తీగలను పారించుట, మందులు చల్లుట. జామ, సపోటాలకు అంట్లు కట్టుట. దానిమ్మ, రేగు, అనాస నాట్లు వేయుట. 
కొర్ర : ఎరువులు వేయుట, దుక్కి తయారు చేయుట. 
వేరుశనగ : అంతరకృషి, సస్యరక్షణ. 
ఆముదం : కలుపు తీయుట, సస్య రక్షణ. 
మిరప : నారుమళ్ళలో సస్యరక్షణ. 
కూరగాయలు : చేమ, వంగనాట్లు. 
సువాసన మొక్కలు : కామంచి గడ్డి, నిమ్మగడ్డి మొక్కల నాట్లు.

పుష్యమి కార్తె
వరి : సస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట. 
జొన్న : అంతరకృషి, మొక్కలు పలుచన చేయుట, సస్యరక్షణ. 
మొక్కజొన్న : అంతరకృషి, సస్యరక్షణ. 
కొర్ర : విత్తనం వేయుట. 
మిరప : నాట్లకు భూమి తయారు చేయుట. 
పొగాకు : నారుమళ్లు తయారు చేయుట. 
పండ్లు : తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో నిమ్మ జాతి మొక్కలు నాటుట. దానిమ్మ, రేగు, అనాస నాట్లు. 
వనమహోత్సవం : చెట్లనాట్లకు తయారీ, పొలాల గట్లపై చెట్లనాట్లకు తయారి. 
పశువులు : దొమ్మ, పారుడు, గురక, గాలికుంటు మరియు యితర వ్యాధుల నుండి కాపాడుటకు చర్యలు.

ఆశ్లేష కార్తె
జొన్న : అంతరకృషి, రెండవ దఫా ఎరువులు వేయుట, సస్యరక్షణ 
సజ్జ : అంతరకృషి, సస్యరక్షణ 
వేరుశనగ : సస్యరక్షణ. 
ఆముదం : రసాయనిక ఎరువులు వేయుట, అంతరకృషి, సస్యరక్షణ. 
మిరప : నారుమళ్ళలో సస్యరక్షణ. 
పొగాకు : నారుపోయుట, తర్వాత సస్యరక్షణ. 
పసుపు : అర్మూర్, మెట్టుపల్లి, కోరట్ల, జగిత్యాల ప్రాంతాల్లో పసుపులో కలుపు తీయుట, ఎరువులు వేయుట, కృష్ణా జిల్లాలో భూమిని తయారు చేయుట, విత్తడం పూర్తి చేయుట. 
వరి : అంతరకృషి, సస్యరక్షణ, ఉల్లికోడు తట్టుకొనే రకాల నాట్లు పూర్తిచేయుట. 
మొక్కజొన్న : రసాయనిక ఎరువులు వేయుట. 
కొర్ర : ఆలస్యంగా వర్షాలు పడినచో వెంటనే విత్తనం వేయుట. 
రాగి : మే నెలలో విత్తిన రాగి కోతలు. 
కాయధాన్యాలు : తక్కువ పంటకాలపు పెసర, మినుము కోతలు, కంది పంటకు కలుపు తీయుట. 
ప్రత్తి : అంతరకృషి, రసాయనిక ఎరువులు వేయుట.

మాఘ కార్తె
జొన్న : మాఘీ జొన్నకు నేల తయారీ. 
సజ్జ : సస్యరక్షణ. 
కొర్ర : రసాయనిక ఎరువులు వేసి అంతరకృషి చేయుట. 
ఆముదం : అంతరకృషి, సస్యరక్షణ, దాసరి పురుగు నివారణ 
పొగాకు : నారుమళ్ళలో సస్యరక్షణ, పొగాకు వేయు చేలలో దుక్కులు తయారు చేయుట. 
పసుపు : మే, జూన్, జూలై నెలల్లో నాటిన పైరులో సస్యరక్షణ, ఎరువులు వేయుట. 
వరి : సస్యరక్షణ, కలుపు తీయుట, రెండవ దఫా ఎరువులు వేయుట. 
కాయధాన్యాలు : తక్కువ పంటకాలపు మినుము పంటకు వస్తుంది. 
వేరుశనగ : సస్యరక్షణ. 
ప్రత్తి : సస్యరక్షణ 
మిరప : నారుమడిలో సస్యరక్షణ, నాట్లకు దుక్కులు తయారు చేయుట. 
పశుగ్రాసాలు : చలికాలపు పశుగ్రాసాల నాట్లకు నేలను తయారు చేయుట, విత్తనం సేకరించుట. 
పశువులు : వ్యాధులు రాకుండా టీకాలు వేయించుట. 
చేపల పెంపకం : మడుగులు నిర్మించుట, విత్తనం సేకరించుట. 
అటవీ శాస్త్రం : మెట్టపొలాల గట్లపై చెట్లు నాటుట. 
పండ్లు : జీడిమామిడి తోటల నాట్లు, మామిడి మొక్కల నాట్లు, ఎరువులు వేయుట.

పుబ్బ కార్తె
వరి : రసాయనిక ఎరువులు వేయుట, సస్యరక్షణ, కలుపు తీయుట. 
జొన్న : రబీ జొన్న వేయుటకు దుక్కులు తయారు చేయుట. 
వేరుశనగ : సస్యరక్షణ, ఎరువులు వేయుట. 
పసుపు : ఆగష్టులో నాటిన పైరులో కలుపు తీయుట, జూన్‍లో నాటిన పంటకు పొటాష్ వంటి ఎరువులు వేయుట. సస్యరక్షణ చర్యలు. 
కూరగాయలు : క్యాబేజి, కాలిఫ్లవర్ పంటలకు నారు పోయుట.

ఉత్తర కార్తె
సజ్జ : రబీ పంటలకు రసాయనిక ఎరువులు వేయుట, విత్తుట. 
వేరుశనగ : సస్యరక్షణ. 
ఆముదం : సస్యరక్షణ. 
మిరప : మిరప తోటలలో ఖాళీలను పూరించుట, సస్యరక్షణ, అంతరకృషి. 
పొగాకు : నారుమడిలో సస్యరక్షణ, పొగాకు వేయబోయే చేలలో దుక్కులు దున్నుట. 
కూరగాయలు : వంగ, టొమాటో నాట్లు. 
పండ్లు : ఎక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో నిమ్మ మొక్కలు నాటుట. అరటి నాట్లకు నేలను తయారు చేయుట. విత్తనం పిలకలను సేకరించుట. 
సజ్జ : కోతలు 
నువ్వులు : జూన్ నెలలో వేసిన పైరు కోతలు 
ప్రత్తి : సస్యరక్షణ 
పశుగ్రాసాలు : శీతాకాలపు పశుగ్రాసాల విత్తనం సేకరించుట, నేలను తయారు చేయుట.

హస్త - చిత్త కార్తెలు
జొన్న : జూలై నెలలో విత్తిన పైరులో సస్యరక్షణ. రబీ జొన్న విత్తుట, సస్యరక్షణ. 
కాయధాన్యాలు : కోతలు, దీర్ఘకాలపు కందికి సస్యరక్షణ, ఉలవ, శనగ విత్తుట. 
వేరుశనగ : గుత్తి రకం కాయ తీయుట. 
మిరప : అంతరకృషి, సస్యరక్షణ, పచ్చికాయ ఏరుట. 
ఉల్లి : నారు పోయుట. 
పూలు : గులాబి కత్తిరించుట, ఎరువులు వేయుట. 
మొక్కజొన్న : కోతలు. 
ప్రత్తి : సస్యరక్షణ. 
ఆముదం : అరుణ పైరులో కాయ తీయుట ప్రారంభించుట. 
పొగాకు : నాట్లు, మూడవ వారంలో ఖాళీలను పూరించడం. 
పసుపు : సస్యరక్షణ, జూన్ నెలలో నాటిన పైరులో కలుపు తీయుట, రసాయనిక ఎరువులు వేయుట, జూలై నెలలో నాటిన పైరులో అంతరకృషి. 
కొర్ర : కోతలు 
కుసుమ : విత్తుట. 
ధనియాలు : విత్తుట. 
వాము : విత్తుట. 
పశుగ్రాసాలు : లూసర్న్, బర్సీము, పిల్లిపెసర, జనుము విత్తుట. 
పండ్లు : కోస్తా జిల్లాల్లో అరటి పిలకల నాట్లు, రేగు పండ్ల మొక్కలు, దానిమ్మ మొక్కల నాటు.

స్వాతి కార్తె
వరి : తక్కువ పంటకాలపు రకాల కోతలు. 
జొన్న : రబీ జొన్నలో సస్యరక్షణ, ఖరీఫ్‍లో వేసిన తక్కువ పంట కాలపు రకాలు కోతకు వచ్చుట. 
వేరుశనగ : తీగ రకం కాయ తీయుట. 
గోగు : కోతలు. 
పొగాకు : అంతరకృషి 
ఆలుగడ్డ : నాటుటకు భూమిని తయారు చేయుట. 
మొక్కజొన్న : రబీ పంటకు విత్తనాలు వేయుట. 
పశుగ్రాసాలు : చలికాలపు పశుగ్రాసాలు విత్తుట. (పిల్లిపెసర, లూసర్న్) 
చిలగడ దుంప : నాటుట.

విశాఖ కార్తె
జొన్న : రబీ జొన్నలో అంతరకృషి, తొందరగా విత్తిన వాటికి సస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట. 
మొక్కజొన్న : రబీ పంటకు విత్తనం వేయుట. 
గోధుమ : భూమిని తయారు చేయుట, ఎరువులు వేయుట, రెండవ వారంలో విత్తుట. 
ప్రత్తి : ఖరీఫ్ ప్రత్తిలో ఎరువులు. 
గోగు : కోసిన గోగు మొక్కలను నీటిలో ఊర వేయుట. 
మిరప : అంతరకృషి, సస్యరక్షణ. 
పొగాకు : అంతరకృషి, సస్యరక్షణ. 
ఉల్లి : నాట్లు. 
కాయధాన్యాలు : తక్కువ పంట కాలపు పెసర, మినుము, వరి పండిన పొలాల్లో చల్లుట, కందికి సస్యరక్షణ. 
పసుపు : సస్యరక్షణ, జూన్ నెలలో నాటిన పైరులో ఎరువులు వేయుట, ఆఖరి సారి నాగలితో అంతరకృషి. 
కాయగూరలు : క్యాబేజి, కాలిఫ్లవర్ నాట్లు, కంద నాట్లు, బిన్నీసు విత్తుట. 
పండ్లు : మామిడి తోటలకు సస్యరక్షణ, అరటి నాట్లు.

అనూరాధ కార్తె
వరి : మధ్య కాలిక రకాల కోతలు, రబీ పైర్లకు నారు పోయుట. 
మొక్కజొన్న : సస్యరక్షణ. 
మిరప : తోటలలో సస్యరక్షణ. 
చెరకు : చెరకు తోటలు కొట్టడం ప్రారంభం. కార్శి తోటల పెంపకం, బెల్లం తయారి, చెరకు పిప్పిని పాతరవేయుట. 
గోధుమ : ఇంకా విత్తనచో వెంటనే విత్తనం వేయుట. 
జొన్న : రబీ పైరులో సస్యరక్షణ. 
గోగు : నార తీయుట. 
పసుపు : సస్యరక్షణ. 
పశుగ్రాసాలు : చెరకు పిప్పిని పాతర వేసి పశుగ్రాసంగా మార్చడం. 
కాయధాన్యాలు : కంది విత్తడం 
పశువులు : ఈనిక కాలంలో మాయ పడనిచో తగు జాగ్రత్తలు తీసికొనుట, దూడలకు ఏలిక పాములు రాకుండా నివారణ చర్యలు. 
పండ్లు : ఫాల్సా కత్తిరింపులు, ఉసిరి కాయలు మార్కెటింగ్, పచ్చళ్ళ తయారీ. 
సువాసన మొక్కలు : కోతలు, సుగంధ తైలం తీయుట.

జ్యేష్ఠ కార్తె
వరి : దీర్ఘకాలిక రకాల కోతలు, రబీ నారుమళ్ళకు ఎరువులు వేయుట, సస్యరక్షణ. 
మొక్కజొన్న : అంతరకృషి, సస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట. 
గోధుమ : అంతరకృషి, సస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట. 
కాయధాన్యాలు : దీర్ఘకాలిక కంది రకాలు కోతకు వచ్చుట. 
మిరప : సస్యరక్షణ. 
పొగాకు : తలలు త్రుంచుట, సస్యరక్షణ. 
చెరకు : నరుకుట, బెల్లం తయారీ. 
పసుపు : ఆగష్టులో నాటిన పైరుకు రసాయనిక ఎరువులు వేయుట. అన్ని ఋతువుల్లో నాటిన పైర్లకు సస్యరక్షణ, ఎరువులు వేయుట. 
పూలు : గులాబీల్లో బడ్డింగ్ చేయుట, ఎరువులు వేయుట. 
ప్రత్తి : మాగాణి ప్రత్తికి భూమిని తయారు చేయుట. 
ఆముదం : దీర్ఘకాలిక రకాల కాయ తీయుట ప్రారంభించుట. 
పండ్లు : ఫాల్సా కత్తిరింపులు, ఉసిరిక, నిమ్మకాయ పచ్చళ్ల తయారీ. 
సువాసన మొక్కలు : కోతలు, తైలం తీయుట.

మూల కార్తె
వరి : నారుమడికి ఎరువులు వేయుట, దాళ్వా లేక తాబి వరినాట్లకు పొలం తయారు చేయుట. 
మొక్కజొన్న : అంతరకృషి, సస్యరక్షణ, ఎరువులు వేయుట. 
గోధుమ : సస్యరక్షణ, రసాయనిక ఎరువులు వేయుట. 
రాగులు : రాగి విత్తుట. 
కాయధాన్యాలు : పెసర, మినుములను వరి పండించిన భూముల్లో విత్తుట, కంది కోతలు, కంది మొడెం పంటగా సాగు చేయుట. 
మిరప : పండు కాయలు కోయుట. 
చెరకు : తెలంగాణా జిల్లాలో నాట్లు. 
ఉల్లి : వరి పండించిన నేలల్లో నాటుట. 
వేరుశనగ : వరి పండించిన చేలలో విత్తుట. 
పండ్లు : అరటికి పిలకలు తీయుట. నాటిన పిలకలకు ఎరువులు వేయుట.

పూర్వాషాడ - ఉత్తరాషాడ కార్తెలు
వరి : తాబీ లేక దాళ్వా వరి నాట్లు, నాటిన వరికి కలుపు తీయుట, సస్యరక్షణ. 
జొన్న : సంకర జొన్నకు నేలను తయారు చేయుట, విత్తనం వేయుట. 
సజ్జ : వేసవి పంటకు నేల తయారి - విత్తనం వేయుట. 
ప్రత్తి : మాగాణి ప్రత్తికి నేలను తయారు చేయుట. 
మొక్కజొన్న : ఎరువులు వేయుట, అంతరకృషి. 
పసుపు : మే నెలలో ఆర్మూర్, కొరుట్ల, మెట్టుపల్లి మరియు యితర ప్రాంతాలలో నాటిన కస్తూరి రకం పసుపు త్రవ్వుట, విత్తనం నిల్వ చేసుకొనుట. 
వేరుశనగ : డిశంబరులో విత్తిన వేరుశనగకు అంతరకృషి, తెలంగాణా ప్రాంతంలో నీటి వసతి క్రింద విత్తుట. 
ఆముదం : విత్తుట 
చెరకు : తెలంగాణా జిల్లాల్లో నాటిన పైరుకు, కార్శి తోటల్లో ఎరువులు వేయుట, సస్యరక్షణ, కోస్తా రాయలసీమల్లో క్రొత్త తోటలను నాటుట. 
పప్పు దినుసులు : వరి పొలాలందు (మాగాణిలో) నవంబరులో వేసిన మినుము, పెసర కోతలు. 
కూరగాయలు : బఠాణికాయ ఏరుట, ధనియాలు కోతలు 
పండ్లు : మామిడిపై తేనె మంచు పురుగు నివారణ చర్యలు, అరటి, ద్రాక్ష నాట్లకు గుంతలు త్రవ్వుట, ఉసిరి కాయలు అమ్ముట, నిల్వచేయుట. 
పువ్వులు : గులాబి, మల్లెల కత్తిరింపులు, ఎరువులు వేయుట, చామంతి పూల కోతలు. 
ధాన్య నిల్వలు : విత్తనాలు నిల్వ చేసుకొనుటలో జాగ్రత్తలు తీసుకొనుట, నిల్వ ఉంచిన ధాన్యానికి పురుగు పట్టకుండా శాస్త్రీయ పద్ధతులను పాటించుట. 
శ్రవణం కార్తె

ధనిష్ఠా కార్తె
వరి : ముందు మాసాల్లో నాటిన వరికి రెండవ దఫా ఎరువులు వేయుట, కలుపు తీయుట. 
జొన్న : రబీ జొన్న కోతలు, వేసవి పంటకు ఎరువులు వేయుట, అంతరకృషి. 
గోధుమ : కోస్తా జిల్లాల్లో కోతలు, తెలంగాణాలో నీరు పెట్టుట, సస్యరక్షణ, ఎలుకల నిర్మూలన. 
సజ్జ : వేసవి పంట విత్తుట, ఎరువులు వేయుట. 
ప్రత్తి : మొక్కలు పలచన చేయుట. ఎరువులు వేయుట, సస్యరక్షణ 
చెరకు : మూలకార్తెలో (ముందు మాసాలలో) నాటిన పంటకు, కార్శి తోటలకు ఎరువులు వేయుట. 
వేరుశనగ : వరి పొలాల్లో వేసిన పంటకు సస్యరక్షణ 
కుసుమ : కోతలు మార్కెట్‍కు పంపుట 
ఆముదం : ముందు మాసాలలో విత్తిన పంటకు సస్యరక్షణ 
పొగాకు : ఆకు కోత, క్యూరింగ్ చేయుట. 
మిరప : కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో పండు కాయ ఏరుట, అమ్ముట 
పండ్లు : ద్రాక్ష గుత్తులు కత్తిరించుట - మార్కెట్‍కు సస్యరక్షణ, పండ్లను నిల్వ చేయుట.

శతభిషా కార్తె
మినుము : వరి మాగాణుల్లో వేసిన మినుము కోతలు. 
వేరుశనగ : వేసవి పంటకు సస్యరక్షణ, తెలంగాణా జిల్లాల్లో విత్తిన పంటకు ఎరువులు వేయుట. 
ఆముదం : సస్యరక్షణ, తెలంగాణాలో విత్తిన పంటకు అంతరకృషి. 
పసుపు : సస్యరక్షణ, తెలంగాణాలో విత్తిన పంటకు అంతరకృషి. 
కూరగాయలు : బెండ విత్తుట, బీర, సొర పాదులు వేయుట, టమాట, వంగ విత్తనం తీయుట. 
మెంతులు : కోతలు - విత్తనం తీయుట. 
జీలకర్ర : కోతలు - విత్తనం తీయుట. 
పండ్లు : ద్రాక్ష గుత్తులు కోయుట - అమ్ముట, పండ్ల పానీయాలు తయారు చేయుట. 
మిరప : ఏరుట, మార్కెట్‍కు పంపుట.

పూర్వాబాధ్ర కార్తె
వరి : రెండవ పంటకు ఎరువులు వేయుట, సస్యరక్షణ 
గోధుమ : తెలంగాణా రాయలసీమ జిల్లాల్లో కోతలు. 
జొన్న : వేసవి పంటకు సస్యరక్షణ. 
ప్రత్తి : ఎరువులు వేయుట - సస్యరక్షణ, ఎడ సేద్యం. 
రాగి : రబీ రాగి కోతలు 
సజ్జ : సస్యరక్షణ 
వేరుశనగ : ఎరువులు - సస్యరక్షణ 
పసుపు : జూలైలో నాటిన పసుపు త్రవ్వుట. 
మిరప : ఎండు కాయలు అమ్ముట, విత్తనం తయారు చేయుట. 
పొగాకు : ఆకు కోయుట, క్యూరింగ్ 
చెరకు : జనవరిలో నాటిన పైరుకు ఎరువులు వేయుట, సస్యరక్షణ 
పప్పుదినుసులు : మాగాణిలో విత్తిన పెసర, మినుము పంటకు వచ్చుట. 
ఆకుకూరలు : పాల, తోట, చుక్క కూరలు విత్తుట. 
అల్లం : పంట త్రవ్వకాలు 
పువ్వులు : చామంతి పూలు ఏరుట.

ఉత్తరబాధ్రా కార్తె
పసుపు : పంటకాలు మార్కెట్‍కు పంపుట, విత్తనం సేకరించుట. 
ఆముదం : సస్యరక్షణ 
అల్లం : త్రవ్వకాలు, అమ్మకాలు, శొంటి తయారీ. 
గోధుమ : ఆలస్యంగా విత్తిన పంట కోతలు 
వేరుశనగ : డిశెంబర్‍లో విత్తిన పంట నుండి కాయ త్రవ్వుట. 
పండ్లు : ద్రాక్ష పండ్ల ఎగుమతి, నిల్వలు పానీయాలు తయారు చేయుట. 
కూరగాయలు : వేసవి కూరగాయల పెంపకం. 
పప్పు దినుసులు : పెసర, మినుము కోతలు 
ఖర్భూజ తర్బూజ : సస్యరక్షణ, తొందరగా విత్తిన పంటలు కోతలకు తయారగుట. 
ఉల్లిగడ్డ : డిశంబర్‍లో నాటిన ఉల్లి త్రవ్వకాలు 
వరి : అశ్వని కార్తెలో వేయబోయే వరిని విత్తుట

రేవతి కార్తె
వరి : స్వల్పకాలిక రకాల కోతకు తయారి, అశ్వనీ కార్తె వరికి పొలం తయారి. 
జొన్న : జనవరి మొదటి వారంలో విత్తిన జొన్న కంకులకు పురుగుల నుండి రక్షణ. 
వేరుశనగ : డిశంబర్ ఆఖరులో విత్తిన పంట త్రవ్వకాలు. 
ప్రత్తి : మాగాణి ప్రత్తిలో కాయ తొలిచే పురుగు నివారణకు మందులు చల్లుట 
చెరకు : అంతరకృషి, నీరు పెట్టుట, బోదె సవరింపులు 
పసుపు : ఆగష్టులో నాటిన పంట త్రవ్వకాలు, వండుట, మార్కెట్‍కు పంపుట. 
పొగాకు : అమ్మకాలు. 
పండ్లు : నిమ్మ, నారింజలో ఎండు కొమ్మల కత్తిరింపు, బోర్డో మిశ్రమం పూయుట, గజ్జి రాకుండా మందులు చల్లుట, ద్రాక్ష అమ్మకాలు పూర్తి చేయుట, అరటికి అంతరకృషి. 
కూరగాయలు : ఉల్లిగడ్డల త్రవ్వకం, ఆకు కూరలకు ఎరువులు వేయుట, కాకర పాదులు తయారు చేయుట. 
అల్లం : త్రవ్వకాలు పూర్తి చేయుట, దుక్కులు తయారు చేయుట.

ముద్రణలు
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతి సంవత్సరం ఏ కార్తెలో ఏ పంటలు వేయాలి, ఏ పంటలు వేస్తే అధిక దిగుబడులు వస్తాయి, ఏ నేలలో ఏ పంటలు వేయాలి, ఏ పంటలు వేస్తే అధిక లాభాలు వస్తాయి వంటి అనేక విషయాలను కూలంకషంగా వివరించిన పుస్తకాన్ని ముద్రించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి అంకితమిస్తుంది.

Sunday, June 28, 2020

వేప నూనె సొంతంగా ఎలా చేసుకోవాలి ?

వేప నూనె సొంతంగా  ఎలా చేసుకోవాలి ?
వేపపండ్లను సేకరించుకోవాలి..

వేపపండ్లను తీసుకొని నీటిలో 24 గంటలు నానబెట్టి గింజలను వేరు చేయండి తరువాత నీడని ప్రదేశంలో 2 రోజులపాటు ఆరబెట్టండి..

ఆ గింజలను మిక్సీలో వేసి పౌడర్ చేయండి..

ఆ పౌడర్ లో 100గ్రాముల తీసుకొని కరక్ట్ గా ఒక లీటర్ నీటిలో 24 గంటలు మురగపెట్టండి..

24 గంటల తరువాత ఆ కషాయానికి ఇంకొక లీటర్ నీరు యాడ్ చేసి 3 ఫిల్టర్స్ చేసుకొని (ఎటువంటి పౌడర్ రాకుండా) కషాయం మాత్రమే సేకరించుకోవాలి... ఇది 50,000 PPM నూనె తో సమానం.. (సేంద్రీయ వ్యవసాయ నిపుణులు శ్రీ కొక్కు అశోక్ కుమార్ గారు ధ్రువీకరించారు)

50% జీవామృతం లేదా 50% వేస్ట్ ఢీకంపోజర్ తీసుకొని అందులోకి 5% వేప గింజల కషాయం మరియు ఇంట్లో తయారు చేసుకున్న పసుపు 150 గ్రాములు కలుపుకొని వ్యవసాయానికి వాడుకోవాలి.. 

ఉదాహరణకు : 100 లీటర్ల కషాయం అంటే 50 లీటర్ల జీవామృతం లేదా 50 లీటర్ల వేస్ట్ డీకంపోజర్ లకు 50 లీటర్ల నీరు చేర్చి మొత్తం 100 లీటర్ల కషాయం లోకి 5 లీటర్ల వేపగింజల కషాయం (NSKE) అలానే పసుపు కలుపుకోవాలి..

గమనిక : ఇందులోకి మజ్జిగ ద్రావణం (గోబాణం) కూడా కలుపుకోవచ్చు.. 24 గంటల వ్యవధిలో వాడుకోవడం ఉత్తమం..

లాభాలు : పురుగు నివారణ కు సహాయపడగలదు, తెగుళ్లు రావు, రోగనిరోధకశక్తి పెరుగును మరియు పంట దిగుబడికి దోహదపడగలదు..


తయారు చేసుకోవడం వీలు లేని వారు   క్రింద సైట్ లో దొరుకుతున్నయి
                              రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com
అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 

https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

టార్పాలిన్స్1099 మాత్రమే, 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com

అన్నదత మీకు వందనం రైతుల సంస్థ చార్విఇన్నోవేషన్స్

అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 

https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

టార్పాలిన్స్1099 మాత్రమే, 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com

సూర్యమండలం మోడల్ పెరటి తోట 365 రోజులు కూరగాయలు

సూర్యమండలం మోడల్ పెరటి తోట 365 రోజులు
సూర్యమండలం మోడల్ పెరటి తోట 365 రోజులు
 మనం కూరగాయలు, ఆకు కూరలు ప్రకృతి వ్యవసాయ పద్దతి లో పండించుకోవచ్చు.

మొక్కజొన్న కత్తెర పురుగు నివారణకు సహజ పద్దతి

మొక్కజొన్న కత్తెర పురుగు నివారణకు సహజ పరిస్కారం


వరి తౌడు, గోధుమ తౌడు మరియు కొద్దిగా వేపనూనె తీసుకొని బాగా కలుపుకొని సుడులలోకి వేసుకోండి.. పరిస్కారం లభిస్తుంది.

అదేవిధంగా మార్కెట్లో బవేరియా బాసియేన అనేటువంటి శీలింద్రం జాతి మరియు మెటారైజాం అనేటువంటి బాక్టీరియా దొరుకుతుంది.. ఇవి స్ప్రే చేయగలరు 🙏

దయచేసి కెమికల్స్ వాడకండి 🙏🙏🙏

బీటెక్‌ చదివి వ్యవసాయం వైపు మొగ్గు...దేశీ ఆవు పాల ఉత్పత్తిలో విజయం

ప్రకృతిలో సాగుబడి!

బీటెక్‌ చదివి వ్యవసాయం వైపు మొగ్గు...దేశీ ఆవు పాల ఉత్పత్తిలో విజయం...ప్రకృతి వ్యవసాయంపై జాగృతి....క్లిమామ్‌ వెల్‌నెస్‌ ఫామ్స్‌తో ముందడుగు...సంపూర్ణ ఆరోగ్యం కోసం దివ్యారెడ్డి కృషి

ఇంజినీరింగ్‌ పట్టా చేతికి రాకుండానే క్యాంపస్‌ ఇంటర్వ్యూలోఎంపికైపోయి నాలుగంకెల వేతనం అందుకోవాలి.. ఏడాది తిరక్కుండా కంపెనీ తరఫున ఫారిన్‌ వెళ్లి డాలర్లు సంపాదించాలి. మూడు పదుల వయసులు దాటకుండానే సొంత ఇల్లు,బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉండి తీరాలి.. సగటు బీటెక్‌ విద్యార్థి ఆలోచన ఇలాగే ఉంటుంది.ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారు వ్యవసాయం గురించి ఆలోచిస్తారా..!
అంటే అలాంటి వారు కూడా ఉంటారా? అని ఆశ్చర్యపోతారు. అలాంటప్పుడు దివ్యారెడ్డి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే.

ఆర్థికంగా ఉన్నత కుటుంబానికి చెందిన దివ్యారెడ్డి పుట్టి పెరిగిన వాతావరణం అంతా సిటీలోనే అయినా.. ఇంజినీరంగ్‌ పూర్తి చేసినా ఆమె ఆలోచనలు మాత్రం గ్రామాల వైపు సాగాయి. ముఖ్యంగా దేశీయ 'గో సంబంధ వ్యవసాయం'తో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని భావించిన ఆమె ఆ దిశగా అడుగులు వేశారు. ప్రస్తుతం ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో పిల్లల నుంచి పెద్దల వరకు తాగుతున్న పాలు కల్తీ అని గుర్తించిన దివ్యారెడ్డి.. స్వచ్ఛమైన దేశీయ ఆవు పాలు, పాల ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేసేందుకు 'క్లిమామ్‌ వెల్‌నెస్‌ ఫామ్స్‌'ను ప్రారంభించారు. దీని ద్వారా దేశీయ ఆవు పాలతో పాటు నెయ్యి, ఇతర పాల ఉత్పత్తులను తయారు చేస్తూ నగరవాసులకు అందిస్తున్నారు. ఈమె ప్రారంభించిన ఈ ఉద్యమానికి పదుల సంఖ్యలో అవార్డులు సైతం వరించాయి.

దివ్యారెడ్డి తన క్లిమామ్‌ ఫామ్‌ నుంచి నగరంలో రోజుకు 600 లీటర్ల పాలను సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, మియాపూర్‌ ప్రాంతాలతో పాటు బంజారాహిల్స్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌ వాసులు ఈ పాల గురించి తెలుసుకుని మరీ ఆర్డర్‌పై తెప్పించుకుంటున్నారు. దివ్యారెడ్డి నడుపుతున్న ఫామ్‌లో ఉత్పత్తి అయ్యే పాలు, పాల ఉత్పత్తుల కంటే డిమాండ్‌ అధికంగా ఉండంతో తనలా ఆలోచించే మరో 20 మందికి స్వచ్ఛమైన పాలపై అవగాహన కలిగించి ఫామ్స్‌ను ఏర్పాటుకు ప్రోత్సహించారు. అలాగే సేంద్రీయ పద్ధతిలో పండించించిన కొర్రలు, బియ్యం, సామలు, అరికెలు, ఊదలు, అండు కొర్రలతో పాటు ఆయిల్, డైఫ్రూట్స్‌ను జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు సమీపంలో 'క్లిమామ్‌ ఫామ్‌ కేఫ్‌'ను ప్రారంభించారు. అలాగే, ఈ కేఫ్‌లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులకు 'సేంద్రియ వ్యవసాయం'పై అవగాహన కల్పిస్తున్నారు.

ప్రస్తుతం గ్రామాల్లో కూడా చాలామంది హైబ్రీడ్‌ ఆవులవైపు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇవి దేశీయ ఆవులతో పోలిస్తే ఎక్కువగా పాలు ఇస్తాయని వాటినే పెంచేందుకు ఇష్టపడుతుంటారు. మరోపక్క గతంలో ఆవులను పాల కంటే వాటి పేడను ఎరువుగా వాడి సేంద్రియ వ్యవసాయం చేసేవారు. దాంతో దేశీయ ఆవులు సంతతి తగ్గిపోయింది. దాంతో పాటే ప్రజల ఆరోగ్య సమస్యలు సైతం పెరగనారంభించాయి. ఇలాంటి పరిస్థితితుల్లో సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే దేశీ ఆవు పాలు, సంబంధిత ఉత్పత్తులు ప్రజలకు అందించడంతో పాటు ఆవు మలమూత్రాలతో సేంద్రియ వ్యవసాయాన్ని చేయాలని 2015లో దివ్యారెడ్డి సంగారెడ్డి సమీపంలోని ఓల్డ్‌ ముంబై జాతీయ రహదారికి ఆనుకొని 'క్లిమామ్‌ వెల్‌నెస్‌ ఫామ్స్‌'ను ప్రారంభించారు. తొలుత 20 దేశీయ ఆవులతో మొదలైన ఈ ఫామ్స్‌లో ఇప్పుడు 200 ఆవులున్నాయి. ప్రారంభంలో కేవలం తమ ఇంటి అవసరాలు, బంధువులకు మాత్రమే సరఫరా చేసిన ఈ పాలు ఇప్పుడు సిటీలో వందల మందికి సరఫరా చేసే స్థాయికి తీసుకెళ్లారు.

ఒకప్పుడు గ్రామాల్లో పశువులను పాలకోసం కాకుండా వాటి మలమూత్రాలను ఎరువుగా వాడి వ్యవసాయం చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఆదాయం కోసం హైబ్రీడ్‌ వైపు పరుగులు తీస్తున్నారు. ఈ ఆలోచన తప్పు. పల్లెలకు గత వైభవం రావాలి. మళ్లీ సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు పడేలా నేనొక ప్రేరణగా నిలవాలన్న ఉద్దేశంతో క్లిమామ్‌ వెల్‌నెస్‌ ఫామ్స్‌ మొదలెట్టా. నేను చేస్తున్నది ఉత్తమమైన పద్ధతి అని అందరికీ ప్రాక్టికల్‌గా చూపిస్తున్నా. సేంద్రియ ఆహారం అందరికీ అందాలన్నది నా ఉద్దేశం.

- దివ్యారెడ్డి, క్లిమామ్‌ వెల్‌నెస్‌ ఫామ్స్

Saturday, June 27, 2020

ప్రకృతివ్యవసాయం లో మజ్జిగ ద్రావణం తయారీ విధానం ?

ప్రకృతివ్యవసాయం లో మజ్జిగ ద్రావణం తయారీ విధానం

ప్రకృతివ్యవసాయం లో మజ్జిగ ద్రావణం తయారీ విధానం.. మిత్రులు గుర్తించుకోవాలి,, ప్రకృతి వ్యవసాయం చేసేవారు వివిధ సందర్భాలలో మజ్జిగద్రావణం ఉపయోగిస్తాం.. యే సందర్భం అయినా కానివ్వండి, తెగుళ్లు నివారణ కోసమో లేకుంటే రోగనిరోధక శక్తి పెంచడం కోసమో లేదు అది యే సందర్భం అయినా కానివ్వండి,, ప్రకృతి వ్యవసాయం లో మజ్జిగ ద్రావణం అంటే 100 లీటర్ల నీటికి 6 లీటర్ల పెరుగు కలుపుకొని మజ్జిగ చేసుకోవాలి.. ఈ నిష్పత్తిలోనే చేసుకోవాలి..

మొదట 7 లీటర్ల దేశీ ఆవు పాలు లేదా 7 లీటర్ల గేదె పాలు తీసుకోవాలి..

చిన్న మంట పైన పాలను పై మీగడ మొత్తం తీసేసేవరకు 4 నుంచి 5 సార్లు కాచుకొంటు చల్లార్చుకోవాలి..

చల్లారిన పాలలో పెరుగు తోడు కలుపుకొని కనీసం 7 రోజులు పులియ బెట్టుకోవాలి..

పులిసిన పెరుగులో 6 లీటర్లు తీసుకొని పెరుగు వెన్నలు లేకుండా చిలక్కొట్టుకోవాలి..

చిలక్కొట్టుకొన్న ఈ ద్రావణాన్ని 100 లీటర్ల నీటికి కలుపుకోవాలి..

ఈ నిష్పత్తి లో చేసుకున్న ద్రావణాన్నే ప్రకృతి వ్యవసాయం లో మజ్జిగ ద్రావణం అంటారు..

కొన్ని సందర్భాలలో మాత్రమే 6 లీటర్ల పెరుగును 200 లీటర్ల నీటిలో కలుపుకొంటాం అనగా ఇంగువ ద్రావణం పిచికారి చేసినప్పుడో వేరే ఇతర కషాయాలు వాడినప్పుడు వాడిన మూడవ రోజు ఈ నిష్పత్తిలో మజ్జిగ ద్రావణం పిచికారి చేసుకొంటాం..

గుర్తుంచుకోండి 

మీ అభివృద్ధిని కోరుకునే 
రైతుల సంస్థ
చార్వి ఇన్నోవేషన్స్
www.chaarviinnovations.com

లాభసాటిగా నిలిచే పుట్టగొడుగుల పెంపకం…ఎలా ?

లాభసాటిగా నిలిచే పుట్టగొడుగుల పెంపకం…

వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కిస్తూ తక్కువ ఖర్చుతో లాభసాటిగా ఉండే వ్యవసాయాల్లో పుట్టగొడుగుల పెంపకం కూడా ఒకటి. అయితే ఈ పుట్టగొడుగుల్ని ఇంటి వద్దే పెంచుకోవచ్చు. వరిసాగు చేసే రైతులకు ఇది లాభసాటిగా కూడా ఉంటుంది. ఎందుకంటే వరి గడ్డి ఉపయోగించి కూడా వీటి పంపకం చేపట్టవచ్చు. 4టన్నుల వరిగడ్డితో 1200 కిలోల పుట్టగొడుగులను పెంచుకోవచ్చు. అధిక దిగిబడితో పాటు ఆదాయాన్నీ పొందవచ్చు. ఆదాయమే కాదు తిన్నవారికి చక్కటి ఆరోగ్యం కూడా లభిస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ పుట్టగొడుగుల పెంపకం ఎలా చేపట్టాలో తెలుసుకుందామా..?

స్థలం:
పుట్టగొడుగులు పెంచాలంటే ప్రారంభ దశలో 20-25 చదరపు అడుగుల షెడ్ గానీ పూరీ పాక గానీ నిర్మించుకోవాలి. అయితే ఈ షెడ్‌ను లేదా పాకను రెండుగా విభజించుకోవాలి. ఒక గదిని  విత్తుకోవడానికి వినియోగించాలి. మరొక గదిని పుట్టగొడుగుల పెంపకానికి వినియోగించాలి. ఈ రెండు గదులకూ కూడా గాలి, వెలుతురూ సక్రమంగా వెళ్ళేలా ఏర్పాటు చేసుకోవాలి.

ఉష్ణోగ్రతలు:
ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ పుట్టగొడుగుల పెంపకం చేపట్టవచ్చు. అయితే పుట్టగొడుగుల పెంపకం చేపట్టే గదుల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉండాలో తెలుసుకుందాం. విత్తుకొనే గదిలో 25-300 సెంటిగ్రేడుల ఉష్ణొగ్రత, పెంపకానికి ఏర్పాటు చేసిన గదిలో 23 -250 సెంటిగ్రేడుల ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. పెంపకం గదిలో తేమ శాతం మాత్రం 75- 80% కన్నా ఎక్కువ ఉండేలా జాగ్రత్త పడాలి.

పెంపకానికి ఏవేం కావాలి??
వరి గడ్డి, చెరకు పిప్పి, విత్తనాలు వలిచిన మొక్కజొన్న కండెలు, డేటల్, పర్మాలిన్ మొదలగునవి
మంచి పరిశోధనా కేంద్రం నుండి తెప్పించిన శిలీంద్రము
గోధుమ, శనగలు, జొన్న, సజ్జ వంటి ధాన్యాలు
పాలిథిన్ సంచులు
థర్మామీటర్, హ్యుమిడిటీ మీటర్
పెంపకం విధానం …

ముందుగా పైన చెప్పిన ధాన్యాలను సగం ఉడికేలా ఉడకబెట్టి గాలికి ఆరబెట్టాలి. దీనిలో 2% కాల్షియం కార్బొనేట్ పొడిని కలిపి ఖాళీ సీసాలో వేసి వేడి నీటిలో ఉడకబెట్టాలి.
పరిశోధనా శాల నుండి తెచ్చిన శిలీంద్రాన్ని 12-15 రోజులు పొదిగించాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న సీసాలో ఈ శిలీంద్రాన్ని నింపి విత్తుకోవాలి.
గడ్డిని తీసుకుని 5 నుండి 7సె.మీ. మేర ముక్కలుగా కత్తిరించుకుని వాటిని నీటిలో 5 నుండి 7 గం.ల మధ్యలో నానబెట్టాలి. తర్వాత వేడి చేసి, ఈ నీటిని పారబొయ్యాలి. తర్వాత గడ్డిని ఆరబెట్టి హ్యుమిడిటీ మీటర్‌తో పరీక్షిస్తూ 65-75% తేమ ఉండేలా చూసుకోవాలి.

రెండు వైపులా తెరచి ఉంచే పాలిధిన్ సంచులను తీసుకుని ఒక వైపు గట్టిగా ముడి వెయ్యాలి. సంచికి అక్కడక్కడా 2-3 రంద్రాలు చెయ్యాలి. ఇప్పుడు గడ్డిని తీసుకుని 5 సెం.మీఎత్తు వరకూ నింపాలి. ఆ తర్వాత విత్తిన శిలీంద్రాన్ని వేసుకోవాలి.
మళ్ళీ 5సెం.మీ మేర గడ్డిని వేసి దానిపై శిలీంద్రాన్ని వెయ్యాలీ. ఈ విధంగా 4 పొరలు వెయ్యాలి. సంచి రెండో మూతిని కూడా గట్టిగా కట్టెయ్యలి. ఇలా నింపిన పాలిధిన్ సంచులనువరుసగా పెట్టుకోవాలి.

కేసింగ్
బెడ్ కట్టిన
18 నుంచి 25 రోజుల తర్వాత ఈ సంచులను రెండో గదిలోకి(పెంపకం) మార్చి   ఆ బెడ్ లను రెండు గా కత్తిరించి స్టెరిలీజ్ చేసిన మట్టిని బెడ్ పైన కప్పి తగినంత వెలుతురు ఉన్న రూమ్ లోకి   వరుసగా పేర్చుకోవాలి.
ఈ సంచులపై రోజూ నీటిని చల్లుతూ ఉండాలి. ఇలా గదిలోకి మార్చిన 4 నుండి 6 రోజుల్లోనే కోతకి వచ్చేస్తాయి. ఒకసారి కోసిన తర్వాత మళ్ళీ 2 లేదా 3 పంటలను ఇస్తాయి. పరిస్థితులని, విత్తనాన్ని బట్టి రోజూ గానీ, రోజు విడిచి రోజు గానీ కొత్తకి వస్తాయి.
ఇలా కోత కోసిన పుట్టగొడుగులు 24 గంటలకంటే ఎక్కువ నిల్వ ఉండవు. జాగ్రత్తలు పాటిస్తే 7 రోజుల వరకు నిలువ ఉంటాయు  త్వరగా మార్కెట్ చేసుకోవడం మంచిది.  కృత్రిమంగా నిల్వ చేసుకోవాలంటే డ్రైయర్స్ సాయంతో గానీ,  ఎండబెట్టిగాని నిల్వ చేసుకోవచ్చు. అవి కూడా కొంత కాలమే నిలుస్తాయి... 🙏

పశువులకు మరియు గేదెలకు బ్యాలెన్సడ్ ఫీడ్ ఎలా తయారు చేసుకోవాలి ?

 పశువులకు మరియు గేదెలకు బ్యాలెన్సడ్ ఫీడ్ ఎలా తయారు చేసుకోవాలి  ?

 కావలసిన ముడిపదార్థాలు

మొక్కజొన్న - 20/-
సజ్జలు - 24/-
జొన్న - 24/-

వేరుశెనగ చెక్క - 28/-
కొబ్బరి చెక్క - 30/-
నువ్వుల చెక్క - 35/-

గోధుమ భూసా - 26/-
వరి తౌడు - 20/-

Formula for 100Kgs feed - 

30% Carbohydrates
మొక్కజొన్న 15 కేజీలు 15×20=300
జొన్న 5 కేజీలు 5×24=120
సజ్జలు 10 కేజీలు 10×24=240
Total 300+120+240="660"

25% Protiens
వేరుశెనగ చెక్క - 10 కేజీలు 10×28=280
కొబ్బరి చెక్క - 10 కేజీలు 10×30=300
నువ్వుల చెక్క - 5 కేజీలు 5×35=175
Total 280+300+175="755"

42% Bran
గోధుమ భూసా - 21 కేజీలు 21×26=546
వరి తౌడు - 21 కేజీలు 21×20=420
Total 546+420="966"

2% Minaral Mixture
Local Chelated Mineral Mixture 2 కేజీలు - 2×40=80

1% Salt
Local Brand 1 కేజీ - 1×10=10

Labour
2 Persons 2×300=600

Grand Total - 660+755+966+80+10+600=3100

One KG 3100/100=31

Per 20 liters yielder Cow 1 Kilo for body maintainence
0.300Kg for one liter milk production 0.300×20=6Kgs
I.e 6+1=7 Kgs => 7×31=220

For 10 liters yielder Buffaloes 1.5 Kg for body maintainence
0.450Kg for one liter milk production
0.450×10=4.5Kgs
I.e 1.5+4.5=6 Kgs => 6×31=190

పశువుల్లో బాక్టీరియాల కలిగే వివిధ వ్యాధులు..

పశువుల్లో బాక్టీరియాల కలిగే వివిధ వ్యాధులు..

గొంతువాపు:

పాస్టురెల్లా మల్టోసైడా అనే బ్యాక్టీరియా వల్ల గొంతువాపు వస్తుంది. ఒక్కసారిగా జ్వరం రావడం, నోటి చొంగ, ఊపిరి కష్టంగా ఉండటం లాంటివి చూపిస్తుంది. 24 గంటల్లో పశువు చనిపోతుంది. చలికాలంలో పశువులు దగ్గర దగ్గరగా ఉంటుంటాయి. అందువల్ల చొంగ ద్వారా ఈ వ్యాధి త్వరగా వ్యాపించవచ్చు. ఇంతకుముందే టీకాలు వేయించుకొని ఉంటే గొంతువ్యాపు రాదు. ఇప్పుడు కూడా టీకా వేయించుకోవచ్చు. వైద్యము ఖరీదు కాబట్టి నివారణ మేలు.

పింక్‌ ఐ:

ఇన్‌ఫెచ్యువస్‌ బొవైన్‌ కెరెటో కంజెక్టువైటిస్‌ అనే వ్యాధికి పింక్‌ ఐ అని కూడా పేరు. దీని తీవ్రత వర్షాకాలంలో ఎక్కువైనప్పటికీ శీతాకాలంలోనూ వ్యాపిస్తుంది. మోరాక్సెల్లా బోవిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల పింక్‌ ఐ సోకుతుంది. వ్యాధి బారిన పడి తేరుకున్న పశువుల ముక్కు రంధ్రాల ద్వారా ఈ బాక్టీరియా బయటకు వ్యాప్తి చెందుతుంది. త్వరగా వైద్యం మొదలు పెట్టడం, పశువైద్యుని సలహా మేరకు టెట్రాసైక్లిన్స్‌ గల ఆంటీబయోటిక్స్‌ ని వాడాలి.

ఫుట్‌ రాట్‌:

దీనినే వాడుక భాషలో కుంట్లు అంటారు. గిట్టల మధ్య వాచి, నొప్పిగా ఉండి, పశువులు కుంటుతూ ఉంటాయి. ఫ్యూసోబ్యాక్టీరియమ్‌ నెక్రోఫోగమ్‌ అనే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. చిత్తడి నేలల్లో పశువులను ఉంచినట్లయితే ఈ పరిస్థితి వస్తుంది. కాళ్ల మీద బరువు మోపలేకపోవడం, నొప్పి కనబరచడం, వాసన కలిగి ఉండడం, మేత మేయలేకపోవడం లాంటి లక్షణాలను పశువు చూపిస్తుంది. పశువులను పొడి నేలల్లో ఉండడం, పెన్సిలిన్, సెప్టియోఫర్, టెట్రాసైక్లిన్‌ లాంటి యాంటీ బయోటిక్స్‌ను వాడాలి.

కాఫ్‌ దిప్తీరియా/లారిన్‌జైటిస్‌:

ఇది కూడా ఫూసోబ్యాక్టీరియమ్‌ నెక్రోఫోరమ్‌ వల్లనే కలుగుతుంది. 3 నుంచి 18 నెలల వయసున్న దూడల్లో ఎక్కువగా కనబడుతుంది. జ్వరం, దగ్గు, రొప్పడం వంటి లక్షణాలు కనబడతాయి. పక్కపక్కనే ఉన్న పశువులకు సోకుతుంది. పశువైద్యుని సలహా మేరకు యాంటిబయోటిక్స్‌ను వాడాలి.

కంటేజియస్‌ బొవైన్‌ ఫ్లూగో నిమోనియా:

చలికాలంలో పశువుల ఊపిరితిత్తులు వాచి, 107 డిగ్రీల ఫారన్‌హీట్‌ వరకు జ్వరం రావడం, కళ్ల వెంబడి పుసులు రావడం, పశువు బాగా చిక్కిపోవడం, కష్టసాధ్యమైన ఊపిరి.. ఇవీ లక్షణాలు. పశువు 1–3 వారాల్లో చనిపోయే ప్రమాదం ఉంది. ఖచ్చితమైన పరిశుభ్రత పాటించాలి. టైలోసిస్‌ లాంటి యాంటిబయోటిక్స్‌ కొంత ఉపయోగకరం.

దశద్విజయ ద్రావణం తయారీ విధానం


దశద్విజయ ద్రావణం తయారీ విధానం
ఎకరా పంటకు పోషకాల కోసం

తయారీ విధానానికి మూడు జాతుల గింజలు రెండు కిలోలు కావాలి

నూనె జాతి గింజలు 400 గ్రాములు : సొయా 200 గ్రాముల, ఆవాలు 100 గ్రాములు మరియు నువ్వులు 100 గ్రాములు..

పప్పు జాతి గింజలు 800 గ్రాములు : పెసలు 200 గ్రాములు, వులవలు 200 గ్రాములు, అలసందలు 200 గ్రాములు, సెనగలు 200 గ్రాములు..

ధాన్యపు జాతి గింజలు 800 గ్రాములు : గోధుమలు 200 గ్రాములు, రాగులు 200 గ్రాములు, సద్దలు 200 గ్రాములు, జొన్నలు 200 గ్రాములు..

దేశీ గోమూత్రం 5 లీటర్లు, 6 రోజులపాటు పులిసిన మజ్జిగ 5 లీటర్లు, తాజా దేశీ ఆవు పేడ 5 కిలోలు

తయారీ విధానం
పైన తెలిపిన మూడు జాతుల గింజల రకాలను 10 గంటల సేపు నీటిలో రాత్రి సమయంలో నాన బెట్టుకోవాలి..

నీటిని పారివేయకుండా పక్కన ఉంచుకోవాలి..

గింజలను పూర్తిగా గ్రైండర్ లో రుబ్బుకోవాలి..

ఒక బకెట్ తీసుకొని రుబ్బుకున్న పేస్ట్ ను, పులిసిన మజ్జిగను ఆవు పేడ లో బాగా కలుపుకొని ఒక గంటసేపు పక్కన ఉంచుకోవాలి..

పక్కన ఉంచుకున్న నీరు ఎంత ఉందొ చూసుకొని 200 లీటర్ల డ్రమ్ లోకి పోసుకొని మాములు నీరు కలుపుకోవాలి ఈ మొత్తం నీరు 200 లీటర్లు ఉండాలి..

ఈ 200 లీటర్ల నీటిలోకి 5 లీటర్ల గోమూత్రం వేసుకుని ఒక గంట సేపు ఉంచాలి..

గంట తరువాత ఈ ద్రావణం లోకి పైన కలుపుకొన్న పేడ ను వేసుకొని 24 గంటలపాటు నీడలో ఉంచుకొని 3 సార్లు సవ్య దిశలో 2 నిమిషాల పాటు కలుపుకొని వడగట్టుకున్న తరువాత డ్రిప్ ద్వారా పంటలకు ప్రతి 15 రోజులకు ఒక్కసారి వదులుకోవాలి,, మిగిలిన పిప్పిని మన పేడ దిబ్బలోకి వేసుకోవచ్చు

నిల్వ సామర్థ్యం ఉండదు కావున త్వరగా వాడుకోవాలి..


అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

టార్పాలిన్స్1099 మాత్రమే, 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com

దయచేసి మీ వాల్స్ మీద షేర్ చేయగలరు

CVR మెథడ్ లో తెగుళ్ళ నాశనం మరియు అధిక దిగుబడి ?

CVR మెథడ్ లో తెగుళ్ళ నాశనం మరియు అధిక దిగుబడి
ఇటీవల కాలంలో, CVR పురుగుమందు సేంద్రీయ రైతులకు వైరల్ వార్తగా మారింది. ఎందుకంటే ఇది బియ్యం మరియు గోధుమలకు చాలా చావుకు ధరలలో తెగుళ్ళ నాశనం చేయటంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది, అంతేకాకుండా ఇది పంట దిగుబడిని పెంచే ఎరువుగా కూడా పనిచేస్తుంది. సివిఆర్ పద్ధతి పూర్తి రూపం చింతల వెంకట్ రెడ్డి పద్ధతి ఆవిష్కర్త పేరు పెట్టబడింది. ఇది ఎగువ నేల మరియు క్షీణించిన నేల మరియు బెల్లం, ఆవు పేడ మరియు మూత్రం యొక్క సమాన మిశ్రమం, ఒక 9 రోజుల నిల్వ ఉంచి ఉపయోగించాలి.

మిరపలో బొబ్బెర తెగులు, పత్తి, బొప్పాయి తోటలలో కింది ముడత పై ముడత, పిండి నల్లి, తామర పురుగు, పేనుబంక, రసం పీల్చు పురుగు, మక్కజొన్న లో కత్తెర పురుగుల నివారణకు CVR పధ్ధతి 100% మేలు

12 రోజుల్లో ప్రతి మూడు రోజులకొకసారి చొప్పున CVR పధ్ధతి పాటించండి 1 వ రోజు 10 కి. కంకర మిషన్ పౌడర్ 10 కి. అడుగు లోపలి మట్టి 2 వ సారి 20 కి. అడుగు లోపలి మట్టి 3 కి. గోధుమ మొలకల ద్రావణం 3 వ సారి 20 కి. అడుగు లోపలి మట్టి 3 కి. గోధుమ మొలకల ద్రావణం 4 వ సారి 20 కి. అడుగు లోపలి మట్టి 3 కి. గోధుమ మొలకల ద్రావణం పైన తెలిపిన ప్రకారం ప్రతి సారి ఇవి 200 లీటర్ల నీటిలో 10 – 15 నిమిషాల పాటు బాగా కలిపి వడగట్టి ఆకులు కింద పైన బాగా తడిచేలాగా పిచికారి చేయండి సబ్ సాయిల్ అంటే ఒక అడుగు తరువాత నుండి తీసే లోపల మట్టి. పంటలపై పిచికారీకి మూడు నాలుగు రోజులు ముందుగానే గోదుమలు నానబోసి మొలకలు వచ్చిన తరువాత రుబ్బుకొని వాడండి.

మక్క జొన్న లో కత్తెర పురుగు నివారణకు పాటించాల్సిన పధ్ధతి :-
ఒక అడుగు లోపలి మట్టి అది మీ చేలోది లేదా మరెక్కడిదైనా సరే మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా కలుపుకొని మక్క జొన్న సుడులలో పోయండి. రెండవ రోజు 20 కిలోల లోపల మట్టి 200 లీటర్లు నీటిలో కలుపుకొని పిచికారి చేయండి. గుడ్లు ఏమన్నా మిగిలిపోయి తిరిగి చిన్న పురుగులు ఎక్కడన్నా కనిపిస్తే తిరిగి మరియొక సారి మట్టి ద్రావణం మక్క జొన్న సుడులలో పోయండి. పురుగులు చనిపోతాయి. చేను బలంగా పెరగడానికి 2 కిలోల మక్క జొన్నలను మొలకలు వచ్చేలాగ నినబెట్టి మెత్తగా రుబ్బి 20 కిలోల మట్టితో పాటుగా 200 లీటర్ల నీటిలో 10 నిమిషాల పాటు బాగా కలిపి ప్రతి వారం చేనుపై పిచికారి చేయండి. నీటికి బదులుగా WDC వేస్ట్ డికంపోసర్ ద్రావణం కూడా కలుపుకుని పిచికారి చేసుకోవచ్చు

వరిలో మాత్రం గోదుమలు 2 కిలోలు, వడ్లు 2 కిలోలు నానబెట్టి మొలకలు వచ్చిన తరువాత రుబ్బుకొని వాడండి.. వీలైతే మట్టి ద్రావణం బదులుగా WDC ద్రావణం ఏ మోతాదులో వాడుతున్నారో అదే మోతాదు లో కూడా కలుపుకుని వాడవచ్చు ఈ పధ్ధతి పత్తి, మిరప, బొప్పాయి, దానిమ్మ, బత్తాయి, వంకాయ, బెండ పంటలలో పాటించినప్పుడు కింది ముడత, పై ముడత, పిండి నల్లి, పేను బంక, తామర పురుగు, రసం పీల్చు పురుగులు దాదాపు 100% నివారించబడ్డాయి. ఈ పంటలే కాకుండా వరి, పత్తి పండ్ల తోటలు మొదలగు అన్ని రకాల పంటలపై ఈ పధ్ధతి పాటించవచ్చు. 

ఈ మొలకల ద్రావణం ఒకసారి WDC తో మరియొకసారి CVR మట్టి ద్రావణంతో చేలలో క్రమం తప్పకుండా ప్రతి వారం పిచికారి ద్వారా పురుగులను తెగుల్లను నివారించడమే కాకుండా పంట చేలు ఆరోగ్యంగా పెరుగుతాయి


అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

టార్పాలిన్స్1099 మాత్రమే, 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com

జీవామృతం తయారీ లో అడివి మట్టి వాడుకోవచ్చు


జీవామృతం తయారీ లో అడివి మట్టి
200 లీటర్ల జీవామృతం తయారీ లో అడివి మట్టి లేదా పుట్టమట్టి బదులుగా కొత్తగా రిలీజ్ అయిన వేస్ట్ డీకంపోసర్ ను 5 ఎమ్ ఎల్ వాడుకోవచ్చు 

ప్రకృతి వ్యవసాయంలో మంచి ఫలితాలు రాబడుతున్న వరి విధానం ఇప్పుడు తెలుసుకుందాం

ప్రకృతి వ్యవసాయంలో  మంచి ఫలితాలు రాబడుతున్న & పండించిన వరి విధానం.

1) తొలకరి పడగానే, ఎలగడ దున్ని జీలుగ వేశాము. ఎకరాకు 15 kg చొప్పున చల్లాము. చల్లి గొర్రు తిప్పేసము. ఉన్న తడికి జీలుగ మొలిచింది

2) పూత దశలో జీలుగ ను తొక్కేసి దమ్ము చేసాము

3) దమ్ము చేసే ముందు ఎకరాకు ఒక ట్రాక్టర్ లోడ్ కొద్దీ  ఆకులు (కానుగా, ఉమ్మెత్త, వేప, లొట్టపీసాకు, బొమ్మేడ్డాకు, అత్త కోడళ్ల ఆకు మున్నగునవి) తెచ్చి చెల్లెసము

4) దానితో పాటు ఎకరాకు 750 kg చొప్పున కోడి పెంట చెళ్ళెము

5) దమ్ము చేసి ఒక వారం అలానే పెట్టసాము

6) నారు పీకి వేసే ముందు, కరిగట్టు చేసాము

7) కరిగట్టు చేసే రోజుననే ఏకరకి ఒక 50 kg చొప్పున వేప పిండి చెల్లించను. నాట్లు వేసేప్పుడు మొదలు తుంచి నాటాము. నారు రెండు మొక్కల చొప్పున పెట్టించాము

8) నాట్లు వేసిన అయిదవ రోజున అమృతసాని ఏకరకి 100 లీటర్ చొప్పున పారించము

9) 10 వ రోజు రాగి ముక్క వేసి 10 రోజులు పెట్టిన పెరుగును ఎకరాలకు 2 లీటర్ చొప్పున స్ప్రే చేసాము

10) అమృతసాని పోసిన తరువాత వారానికి ఒకసారి WDC ఏకరాకి 200 లీటర్ చొప్పున పారించాము

11) పెరుగు స్ప్రే తరువాతి వారము వేప నూనె 200 లీటర్ డ్రం నీటికి 1 లీటర్ వేప చొప్పున స్ప్రే చేయించాము

12) తరువాత 7 నుంచి 10 రోజులకి ఒక సారి లోపలి మట్టి 200 లీటర్ డ్రం కి 30kg చొప్పున కలిపి  స్ప్రే చేసాము

13) పొలం వెన్ను విడిచిన తరువాత ఉసతిరుగుడు రాకుండా ఒకసారి తూటాకు కషాయం స్ప్రే చేసాము

14) మాకు కలుపు కు మరియు కోతలకు ఎక్కువ ఖర్చు వచ్చింది. కలుపుకు ఏకరకి 4000 దాకా, కోతలు మున్నగు వాటికి ఒక 3500 దాకా ఖర్చు వచ్చింది

15) దిగుబడి ఏకరకి 3 పుట్ల పయిన వచ్చింది

అన్ని రకాల పంటలకు అవసరం అయిన ఆర్గానిక్ పురుగు మందులు క్రింది సైట్ లో దొరుకును
www.chaarviinnovations.com
అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

టార్పాలిన్స్1099 మాత్రమే, 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...