ప్రకృతివ్యవసాయం లో మజ్జిగ ద్రావణం తయారీ విధానం
ప్రకృతివ్యవసాయం లో మజ్జిగ ద్రావణం తయారీ విధానం.. మిత్రులు గుర్తించుకోవాలి,, ప్రకృతి వ్యవసాయం చేసేవారు వివిధ సందర్భాలలో మజ్జిగద్రావణం ఉపయోగిస్తాం.. యే సందర్భం అయినా కానివ్వండి, తెగుళ్లు నివారణ కోసమో లేకుంటే రోగనిరోధక శక్తి పెంచడం కోసమో లేదు అది యే సందర్భం అయినా కానివ్వండి,, ప్రకృతి వ్యవసాయం లో మజ్జిగ ద్రావణం అంటే 100 లీటర్ల నీటికి 6 లీటర్ల పెరుగు కలుపుకొని మజ్జిగ చేసుకోవాలి.. ఈ నిష్పత్తిలోనే చేసుకోవాలి..
మొదట 7 లీటర్ల దేశీ ఆవు పాలు లేదా 7 లీటర్ల గేదె పాలు తీసుకోవాలి..
చిన్న మంట పైన పాలను పై మీగడ మొత్తం తీసేసేవరకు 4 నుంచి 5 సార్లు కాచుకొంటు చల్లార్చుకోవాలి..
చల్లారిన పాలలో పెరుగు తోడు కలుపుకొని కనీసం 7 రోజులు పులియ బెట్టుకోవాలి..
పులిసిన పెరుగులో 6 లీటర్లు తీసుకొని పెరుగు వెన్నలు లేకుండా చిలక్కొట్టుకోవాలి..
చిలక్కొట్టుకొన్న ఈ ద్రావణాన్ని 100 లీటర్ల నీటికి కలుపుకోవాలి..
ఈ నిష్పత్తి లో చేసుకున్న ద్రావణాన్నే ప్రకృతి వ్యవసాయం లో మజ్జిగ ద్రావణం అంటారు..
కొన్ని సందర్భాలలో మాత్రమే 6 లీటర్ల పెరుగును 200 లీటర్ల నీటిలో కలుపుకొంటాం అనగా ఇంగువ ద్రావణం పిచికారి చేసినప్పుడో వేరే ఇతర కషాయాలు వాడినప్పుడు వాడిన మూడవ రోజు ఈ నిష్పత్తిలో మజ్జిగ ద్రావణం పిచికారి చేసుకొంటాం..
గుర్తుంచుకోండి
మీ అభివృద్ధిని కోరుకునే
రైతుల సంస్థ
చార్వి ఇన్నోవేషన్స్
No comments:
Post a Comment