మృగశిరకార్తె గురించి ఇప్పటి తరానికి
సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించిన నాటి నుండి మృగశిరకార్తె ఏర్పడుతుంది. ఈ కార్తె నుండి వర్షాలు పడతాయని మనవారి భావన. ఇదే సమయంలో మన ప్రాంతంలోకి నైఋతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి.
భారతీయ జ్యోతిష సాంప్రదాయ ప్రకారం ఒక్కోక్క కార్తెలో ప్రకృతిలోని మార్పు, దాని వలన జరిగే ప్రత్యేకాంశలను సవివరంగా వివరించింది. ఈ కార్తెల ఆధారంగా వ్యవసాయ దారులు, జానపదులు ( గ్రామీన ప్రాంతం వారు) ఎక్కువగా వీటిపై ఆధారపడి చేయువృత్తులు, వ్యవసాయ సాగు. ఈ కాలగణనతో కార్తెల అధారంగా వారి పంటల నిర్ణయం, సాగు చేసుకుంటారు. సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించిన నాటి నుండి మృగశిర కార్తె ఏర్పడుతుంది. ఈ కార్తె నుండి వర్షాలు పడతాయని మనవారి భావన. ఇదే సమయంలో మన ప్రాంతంలోకి నైఋతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి.
పంచాగ ప్రకారం:- ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్క వర్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయదారులకు నిత్య జీవనోపయోగిగా వ్యవసాయ పనులకు మార్గదర్శకంగా ఈ కార్తెలు ఉపయోగపడుతున్నాయి.
పురాణగాధ ప్రకారం:- మృగ శిరస్సు కలిగిన మృగ వ్యాధుడు అను వృతాసురుడు వర ప్రభావంచే పశువులను, పంటలను హరించివేయడం ప్రకృతి భీభత్సాలాను సృష్టించడం, వర్షాలకు అడ్డు పడటం జరుగుతూ ఉండేడిది. వీడు చనిపోకుండా అనేక వరాలు కలిగి ఉండటంచేత ఇంద్రుడు సముద్ర అలల నుండి వచ్చే నురుగును ఆయుధంగా చేసి చంపివేస్తాడు.
మృగశిర కార్తెకు మన ఆచార సాంప్రదాయంలో విశేష ప్రాధాన్యత ఉంది. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలతో సతమతమయ్యే జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతువపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. ఈ కార్తెను రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. ఏరువాక అంటే నాగటి చాలు ఈ కాలంలో రుతు పవనాలు విస్తరించి తొలకరి జల్లులు పడగానే పొలాలు దున్ని పంటలు వేయడం మొదలు పెడతారు.
కార్తె ప్రారంభం :- చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. ఏ నక్షత్రం సమీపంలో ఉంటే.. ఆ కార్తెకు ఆ పేరు పెడతారు... అశ్వినితో ప్రారంభమై రేవతితో ముగిసే వరకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల పేర్లతో కార్తెలు ఉన్నాయి. ప్రస్తుతం మృగశిర నక్షత్రానికి చేరువలో చంద్రుడు ఉండటం వల్ల దీనికి మృగశిర కార్తె అనే పేరు వచ్చింది.
మృగశిర కార్తెను ఎలా జరుపుకోవాలి:- మృగశిర కార్తె మొదటి రోజును దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర , మృగం , మిరుగు , మిర్గం పేర్లతో వ్యవహరిస్తారు. ఈ రోజు ప్రజలు బెల్లంలో ఇంగువను కలుపుకుని సేవిస్తారు. ఇంగువ శరీరంలో ఉష్ణాన్ని ప్రేరేపించి.. వర్షా కాలంలో సోకే వ్యాధులను నియంత్రిస్తుందని పెద్దలు చెబుతారు. అలాగే మృగశిర కార్తె ప్రారంభం రోజున చేపలు / ఇతర మాంసాహారం తింటే వ్యాధులు దరిచేరవని మాంసాహార ప్రియుల ప్రజల నమ్మకం.
మృగశిరా కార్తె ఫలములు:- జ్యేష్ట బహుళ తదియ తేదీ 8 జూన్ 2020 సోమవారం రోజున ఉదయం 6:39 నిమిషాలకు రవి నిరయన మృగశిరా కార్తె ప్రవేశము. ప్రవేశ సమయమునకు పూర్వాషాడ నక్షత్రం, మిధున లగ్నం, వరుణ మండలం , పాద జలరాశి ,నపుం-స్త్రీ యోగం, మహిష వాహనము, రవ్వాది గ్రహములు దహ, సౌమ్య , రస, సౌమ్య, రస, వాయు, జలనాడీచారము మొదలగు శుభాశుభ యోగములచే
సరాసరి ఈ కార్తెలో వర్ష భంగములు ఎక్కువగా ఉన్నందున దేశ భేదమున స్వల్ప తుంపురు వర్షములు కురియును.
No comments:
Post a Comment