Saturday, June 27, 2020

దశద్విజయ ద్రావణం తయారీ విధానం


దశద్విజయ ద్రావణం తయారీ విధానం
ఎకరా పంటకు పోషకాల కోసం

తయారీ విధానానికి మూడు జాతుల గింజలు రెండు కిలోలు కావాలి

నూనె జాతి గింజలు 400 గ్రాములు : సొయా 200 గ్రాముల, ఆవాలు 100 గ్రాములు మరియు నువ్వులు 100 గ్రాములు..

పప్పు జాతి గింజలు 800 గ్రాములు : పెసలు 200 గ్రాములు, వులవలు 200 గ్రాములు, అలసందలు 200 గ్రాములు, సెనగలు 200 గ్రాములు..

ధాన్యపు జాతి గింజలు 800 గ్రాములు : గోధుమలు 200 గ్రాములు, రాగులు 200 గ్రాములు, సద్దలు 200 గ్రాములు, జొన్నలు 200 గ్రాములు..

దేశీ గోమూత్రం 5 లీటర్లు, 6 రోజులపాటు పులిసిన మజ్జిగ 5 లీటర్లు, తాజా దేశీ ఆవు పేడ 5 కిలోలు

తయారీ విధానం
పైన తెలిపిన మూడు జాతుల గింజల రకాలను 10 గంటల సేపు నీటిలో రాత్రి సమయంలో నాన బెట్టుకోవాలి..

నీటిని పారివేయకుండా పక్కన ఉంచుకోవాలి..

గింజలను పూర్తిగా గ్రైండర్ లో రుబ్బుకోవాలి..

ఒక బకెట్ తీసుకొని రుబ్బుకున్న పేస్ట్ ను, పులిసిన మజ్జిగను ఆవు పేడ లో బాగా కలుపుకొని ఒక గంటసేపు పక్కన ఉంచుకోవాలి..

పక్కన ఉంచుకున్న నీరు ఎంత ఉందొ చూసుకొని 200 లీటర్ల డ్రమ్ లోకి పోసుకొని మాములు నీరు కలుపుకోవాలి ఈ మొత్తం నీరు 200 లీటర్లు ఉండాలి..

ఈ 200 లీటర్ల నీటిలోకి 5 లీటర్ల గోమూత్రం వేసుకుని ఒక గంట సేపు ఉంచాలి..

గంట తరువాత ఈ ద్రావణం లోకి పైన కలుపుకొన్న పేడ ను వేసుకొని 24 గంటలపాటు నీడలో ఉంచుకొని 3 సార్లు సవ్య దిశలో 2 నిమిషాల పాటు కలుపుకొని వడగట్టుకున్న తరువాత డ్రిప్ ద్వారా పంటలకు ప్రతి 15 రోజులకు ఒక్కసారి వదులుకోవాలి,, మిగిలిన పిప్పిని మన పేడ దిబ్బలోకి వేసుకోవచ్చు

నిల్వ సామర్థ్యం ఉండదు కావున త్వరగా వాడుకోవాలి..


అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

టార్పాలిన్స్1099 మాత్రమే, 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com

దయచేసి మీ వాల్స్ మీద షేర్ చేయగలరు

No comments:

Post a Comment

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...