Monday, June 29, 2020

కిసాన్ క్రెడిట్ కార్డ్ వివరాలు & కార్డుకి ఎవరు అర్హులు?

కిసాన్ క్రెడిట్ కార్డ్ వివరాలుఈ కార్డుకి ఎవరు అర్హులు?

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి నుండి   రైతు భరోసా లో కేంద్ర ప్రభుత్యం నుండి రూ. 6000/- పొందిన రైతులు అందరూ ఈ పథకానికి అర్హులు. 

👉🏼 *ఈ వివరాలు ఎక్కడ లభిస్తాయి ?*
https://pmkisan.gov.in  వెబ్సైట్ లో లభిస్తాయి.  ఈ లిస్టులో ఉన్నవాళ్లు అందరూ అర్హులే. కానీ క్షేత్రస్థాయిలో కొంతమంది లబ్దిదారులే మనకు అర్హతకు వస్తారు. ఉదాహరణకు ఒక గ్రామాన్ని తీసుకొన్నట్లయితే 100 రైతులకు అర్హత ఉంటే 40-50% మంది పట్టణాల్లో లో వుంటారు(కౌలికి ఇచ్చి వుంటారు). 10 % మంది రైతులకు పాడి పశువులు ఉండవు.కాబట్టి లిస్టులో మనకు 40 - 50 శాతం మంది రైతులు క్రెడిట్ కార్డ్ పొందేందుకు అర్హులుగా వుంటారు. వాళ్ళను మనం లిస్ట్ చేసుకొని పెట్టుకోవాలి.
ఆ లిస్టులో ఉన్న  18 నుండి 75 సంవత్సరాల వయస్సు గల రైతులు అందరూ అర్హులు. 
👉🏼 *ఉండవలసిన పత్రాలు*
రైతు ఫోటో,
 పాన్ కార్డ్,
 ఆధార్ కార్డ్.
👉🏼 *ఎంత మొత్తం రుణం ఇస్తారు?*
రూ.1,60,000/- ఎటువంటి భూమికి సంబందించిన పత్రాలు లేకుండా ఇస్తారు.ఆ పై దాటితే భూమికి సంభందించిన పత్రాలు ఉండాలి.2 ఎకరాల 50 సెంట్స్ కు రూ.2,50,000/-  రుణం ఇస్తారు. గరిష్ట పరిమితి 3 లక్షలు.
👉🏼 ఈ రుణం బ్యాంక్ వారి (మండలాలలో పరిధి లోని బ్యాంక్ ) సూచనల మేరకు 1 సంవత్సరం లో కట్టాలి.
👉🏼 వడ్డీ 7% పడుతుంది.(సుమారుగా 25 పైసలు) .రైతు బ్యాంకు వారు సూచించినట్లు 1 సంవత్సరం లో లోను కట్టినట్లు అయితే *ఇంటరెస్ట్ సబ్వెన్షన్ స్కీం ( ISS)* కింద నాబార్డ్ లేదా RBI 3% రైతు ఖాతాలోకి వడ్డీ అమౌంట్ తిరిగి జమ చేస్తుంది.అలాగే రీ పేమెంట్ prompt గా చేస్తే *prompt repayment incentive*  కింద ప్రభుత్యం వడ్డీ అమౌంట్ లో 3% మరల రైతు ఖాతాలోకి డబ్బు జమ చేస్తుంది.అంటే రైతు తీసుకొన్న లోన్ సక్రమంగా చెల్లిస్తే మొత్తంగా 1% వడ్డినే కడతారు (5 - 10 పైసలు వడ్డీ) .
👉🏼 ఈ కార్డ్ కాలపరిమితి 5 సంవత్సరాలు.దీనిలో ఇంకా నెలకు 12 రూపాయలు కడితే (5 సంవత్సరాలు) ప్రైమినిస్టర్ స్వంవృద్ది బీమా యోజన క్రింద  ₹2,00,000 ప్రమాద భీమా వర్తిస్తుంది.(మరణానికి మరియు శాశ్వత వైకల్యానికి). అలాగే  సంవత్సరంనకు ₹ 330/- కడితే (5 సంవత్సరాలు) ప్రైమినిస్టర్ జ్యోతి భీమా క్రింద జీవితకాలం ₹2,00,000/-  ప్రమాద భీమా( మరణానికి మరియు 
శాశ్వత వైకల్యానికి) వర్తిస్తుంది. 

కాబట్టి రైతు భరోసా కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న పారా సిబ్బంది AHA లు మరియు గోపాలమిత్రులు ఒక్కో RBK కి 10 కార్డ్స్ ను ప్రాధమికంగా మంజూరు చేయించండి. ఈ కార్డులో లోన్ తీసుకొన్న రైతుకు చాలా తక్కువగా వడ్డీ పడుతుంది. ఆర్ధికంగా మనం తోడ్పాటు చేసినవాళ్ళం అవుతాము. మన ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించిన వాళ్ళం అవుతాం. మనము చేయవలసినదంతా రైతును గుర్తించడం, అప్లికేషన్ నింపడానికి కావలసిన పత్రాలను గూర్చి చెప్పడం మరియు ఆ అప్లికేషన్ ఆ రైతు బ్యాంకులో సమర్పించేటట్లు చేయడం తో మన పని ముగుస్తుంది. ఆ రైతుకి ఉన్న అర్హత బట్టి, ఇంతకు ముందు ఏమైనా అప్పులు ఉన్నవా ,ఇతరత్రా విషయాలు బాంక్ వారు చూసి లోన్ మంజూరు చేస్తారు. అప్లికేషన్లో మన AH డిపార్ట్మెంట్ దగ్గర టిక్ చేయాలి లేదా పైన రాయాలి. పై లోన్ మొత్తం గేదేలు  మరియు ఆవులు కొనేందుకు కాదు. దాణా, పశుగ్రాసం పెంపకం మరియు ఇతర యాజమాన్య ఖర్చులకు అని తెలుపగలరు. 

*గమనిక*: పాడి పశువులు ఎన్ని ఉన్నా, రైతు భరోసా  అర్హులకు మాత్రమే వర్తి స్తుంది. కాబట్టి గమనించ గలరు.

అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

టార్పాలిన్స్1099 మాత్రమే, 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com

No comments:

Post a Comment

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...