పశువుల్లో బాక్టీరియాల కలిగే వివిధ వ్యాధులు..
గొంతువాపు:
పాస్టురెల్లా మల్టోసైడా అనే బ్యాక్టీరియా వల్ల గొంతువాపు వస్తుంది. ఒక్కసారిగా జ్వరం రావడం, నోటి చొంగ, ఊపిరి కష్టంగా ఉండటం లాంటివి చూపిస్తుంది. 24 గంటల్లో పశువు చనిపోతుంది. చలికాలంలో పశువులు దగ్గర దగ్గరగా ఉంటుంటాయి. అందువల్ల చొంగ ద్వారా ఈ వ్యాధి త్వరగా వ్యాపించవచ్చు. ఇంతకుముందే టీకాలు వేయించుకొని ఉంటే గొంతువ్యాపు రాదు. ఇప్పుడు కూడా టీకా వేయించుకోవచ్చు. వైద్యము ఖరీదు కాబట్టి నివారణ మేలు.
పింక్ ఐ:
ఇన్‌ఫెచ్యువస్ బొవైన్ కెరెటో కంజెక్టువైటిస్ అనే వ్యాధికి పింక్ ఐ అని కూడా పేరు. దీని తీవ్రత వర్షాకాలంలో ఎక్కువైనప్పటికీ శీతాకాలంలోనూ వ్యాపిస్తుంది. మోరాక్సెల్లా బోవిస్ అనే బ్యాక్టీరియా వల్ల పింక్ ఐ సోకుతుంది. వ్యాధి బారిన పడి తేరుకున్న పశువుల ముక్కు రంధ్రాల ద్వారా ఈ బాక్టీరియా బయటకు వ్యాప్తి చెందుతుంది. త్వరగా వైద్యం మొదలు పెట్టడం, పశువైద్యుని సలహా మేరకు టెట్రాసైక్లిన్స్ గల ఆంటీబయోటిక్స్ ని వాడాలి.
ఫుట్ రాట్:
దీనినే వాడుక భాషలో కుంట్లు అంటారు. గిట్టల మధ్య వాచి, నొప్పిగా ఉండి, పశువులు కుంటుతూ ఉంటాయి. ఫ్యూసోబ్యాక్టీరియమ్ నెక్రోఫోగమ్ అనే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. చిత్తడి నేలల్లో పశువులను ఉంచినట్లయితే ఈ పరిస్థితి వస్తుంది. కాళ్ల మీద బరువు మోపలేకపోవడం, నొప్పి కనబరచడం, వాసన కలిగి ఉండడం, మేత మేయలేకపోవడం లాంటి లక్షణాలను పశువు చూపిస్తుంది. పశువులను పొడి నేలల్లో ఉండడం, పెన్సిలిన్, సెప్టియోఫర్, టెట్రాసైక్లిన్ లాంటి యాంటీ బయోటిక్స్‌ను వాడాలి.
కాఫ్ దిప్తీరియా/లారిన్‌జైటిస్:
ఇది కూడా ఫూసోబ్యాక్టీరియమ్ నెక్రోఫోరమ్ వల్లనే కలుగుతుంది. 3 నుంచి 18 నెలల వయసున్న దూడల్లో ఎక్కువగా కనబడుతుంది. జ్వరం, దగ్గు, రొప్పడం వంటి లక్షణాలు కనబడతాయి. పక్కపక్కనే ఉన్న పశువులకు సోకుతుంది. పశువైద్యుని సలహా మేరకు యాంటిబయోటిక్స్‌ను వాడాలి.
కంటేజియస్ బొవైన్ ఫ్లూగో నిమోనియా:
No comments:
Post a Comment