Saturday, June 27, 2020

ప్రకృతి వ్యవసాయంలో మంచి ఫలితాలు రాబడుతున్న వరి విధానం ఇప్పుడు తెలుసుకుందాం

ప్రకృతి వ్యవసాయంలో  మంచి ఫలితాలు రాబడుతున్న & పండించిన వరి విధానం.

1) తొలకరి పడగానే, ఎలగడ దున్ని జీలుగ వేశాము. ఎకరాకు 15 kg చొప్పున చల్లాము. చల్లి గొర్రు తిప్పేసము. ఉన్న తడికి జీలుగ మొలిచింది

2) పూత దశలో జీలుగ ను తొక్కేసి దమ్ము చేసాము

3) దమ్ము చేసే ముందు ఎకరాకు ఒక ట్రాక్టర్ లోడ్ కొద్దీ  ఆకులు (కానుగా, ఉమ్మెత్త, వేప, లొట్టపీసాకు, బొమ్మేడ్డాకు, అత్త కోడళ్ల ఆకు మున్నగునవి) తెచ్చి చెల్లెసము

4) దానితో పాటు ఎకరాకు 750 kg చొప్పున కోడి పెంట చెళ్ళెము

5) దమ్ము చేసి ఒక వారం అలానే పెట్టసాము

6) నారు పీకి వేసే ముందు, కరిగట్టు చేసాము

7) కరిగట్టు చేసే రోజుననే ఏకరకి ఒక 50 kg చొప్పున వేప పిండి చెల్లించను. నాట్లు వేసేప్పుడు మొదలు తుంచి నాటాము. నారు రెండు మొక్కల చొప్పున పెట్టించాము

8) నాట్లు వేసిన అయిదవ రోజున అమృతసాని ఏకరకి 100 లీటర్ చొప్పున పారించము

9) 10 వ రోజు రాగి ముక్క వేసి 10 రోజులు పెట్టిన పెరుగును ఎకరాలకు 2 లీటర్ చొప్పున స్ప్రే చేసాము

10) అమృతసాని పోసిన తరువాత వారానికి ఒకసారి WDC ఏకరాకి 200 లీటర్ చొప్పున పారించాము

11) పెరుగు స్ప్రే తరువాతి వారము వేప నూనె 200 లీటర్ డ్రం నీటికి 1 లీటర్ వేప చొప్పున స్ప్రే చేయించాము

12) తరువాత 7 నుంచి 10 రోజులకి ఒక సారి లోపలి మట్టి 200 లీటర్ డ్రం కి 30kg చొప్పున కలిపి  స్ప్రే చేసాము

13) పొలం వెన్ను విడిచిన తరువాత ఉసతిరుగుడు రాకుండా ఒకసారి తూటాకు కషాయం స్ప్రే చేసాము

14) మాకు కలుపు కు మరియు కోతలకు ఎక్కువ ఖర్చు వచ్చింది. కలుపుకు ఏకరకి 4000 దాకా, కోతలు మున్నగు వాటికి ఒక 3500 దాకా ఖర్చు వచ్చింది

15) దిగుబడి ఏకరకి 3 పుట్ల పయిన వచ్చింది

అన్ని రకాల పంటలకు అవసరం అయిన ఆర్గానిక్ పురుగు మందులు క్రింది సైట్ లో దొరుకును
www.chaarviinnovations.com
అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

టార్పాలిన్స్1099 మాత్రమే, 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com

No comments:

Post a Comment

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...