CVR మెథడ్ లో తెగుళ్ళ నాశనం మరియు అధిక దిగుబడి
ఇటీవల కాలంలో, CVR పురుగుమందు సేంద్రీయ రైతులకు వైరల్ వార్తగా మారింది. ఎందుకంటే ఇది బియ్యం మరియు గోధుమలకు చాలా చావుకు ధరలలో తెగుళ్ళ నాశనం చేయటంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది, అంతేకాకుండా ఇది పంట దిగుబడిని పెంచే ఎరువుగా కూడా పనిచేస్తుంది. సివిఆర్ పద్ధతి పూర్తి రూపం చింతల వెంకట్ రెడ్డి పద్ధతి ఆవిష్కర్త పేరు పెట్టబడింది. ఇది ఎగువ నేల మరియు క్షీణించిన నేల మరియు బెల్లం, ఆవు పేడ మరియు మూత్రం యొక్క సమాన మిశ్రమం, ఒక 9 రోజుల నిల్వ ఉంచి ఉపయోగించాలి.
మిరపలో బొబ్బెర తెగులు, పత్తి, బొప్పాయి తోటలలో కింది ముడత పై ముడత, పిండి నల్లి, తామర పురుగు, పేనుబంక, రసం పీల్చు పురుగు, మక్కజొన్న లో కత్తెర పురుగుల నివారణకు CVR పధ్ధతి 100% మేలు
12 రోజుల్లో ప్రతి మూడు రోజులకొకసారి చొప్పున CVR పధ్ధతి పాటించండి 1 వ రోజు 10 కి. కంకర మిషన్ పౌడర్ 10 కి. అడుగు లోపలి మట్టి 2 వ సారి 20 కి. అడుగు లోపలి మట్టి 3 కి. గోధుమ మొలకల ద్రావణం 3 వ సారి 20 కి. అడుగు లోపలి మట్టి 3 కి. గోధుమ మొలకల ద్రావణం 4 వ సారి 20 కి. అడుగు లోపలి మట్టి 3 కి. గోధుమ మొలకల ద్రావణం పైన తెలిపిన ప్రకారం ప్రతి సారి ఇవి 200 లీటర్ల నీటిలో 10 – 15 నిమిషాల పాటు బాగా కలిపి వడగట్టి ఆకులు కింద పైన బాగా తడిచేలాగా పిచికారి చేయండి సబ్ సాయిల్ అంటే ఒక అడుగు తరువాత నుండి తీసే లోపల మట్టి. పంటలపై పిచికారీకి మూడు నాలుగు రోజులు ముందుగానే గోదుమలు నానబోసి మొలకలు వచ్చిన తరువాత రుబ్బుకొని వాడండి.
మక్క జొన్న లో కత్తెర పురుగు నివారణకు పాటించాల్సిన పధ్ధతి :-
ఒక అడుగు లోపలి మట్టి అది మీ చేలోది లేదా మరెక్కడిదైనా సరే మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా కలుపుకొని మక్క జొన్న సుడులలో పోయండి. రెండవ రోజు 20 కిలోల లోపల మట్టి 200 లీటర్లు నీటిలో కలుపుకొని పిచికారి చేయండి. గుడ్లు ఏమన్నా మిగిలిపోయి తిరిగి చిన్న పురుగులు ఎక్కడన్నా కనిపిస్తే తిరిగి మరియొక సారి మట్టి ద్రావణం మక్క జొన్న సుడులలో పోయండి. పురుగులు చనిపోతాయి. చేను బలంగా పెరగడానికి 2 కిలోల మక్క జొన్నలను మొలకలు వచ్చేలాగ నినబెట్టి మెత్తగా రుబ్బి 20 కిలోల మట్టితో పాటుగా 200 లీటర్ల నీటిలో 10 నిమిషాల పాటు బాగా కలిపి ప్రతి వారం చేనుపై పిచికారి చేయండి. నీటికి బదులుగా WDC వేస్ట్ డికంపోసర్ ద్రావణం కూడా కలుపుకుని పిచికారి చేసుకోవచ్చు
వరిలో మాత్రం గోదుమలు 2 కిలోలు, వడ్లు 2 కిలోలు నానబెట్టి మొలకలు వచ్చిన తరువాత రుబ్బుకొని వాడండి.. వీలైతే మట్టి ద్రావణం బదులుగా WDC ద్రావణం ఏ మోతాదులో వాడుతున్నారో అదే మోతాదు లో కూడా కలుపుకుని వాడవచ్చు ఈ పధ్ధతి పత్తి, మిరప, బొప్పాయి, దానిమ్మ, బత్తాయి, వంకాయ, బెండ పంటలలో పాటించినప్పుడు కింది ముడత, పై ముడత, పిండి నల్లి, పేను బంక, తామర పురుగు, రసం పీల్చు పురుగులు దాదాపు 100% నివారించబడ్డాయి. ఈ పంటలే కాకుండా వరి, పత్తి పండ్ల తోటలు మొదలగు అన్ని రకాల పంటలపై ఈ పధ్ధతి పాటించవచ్చు.
ఈ మొలకల ద్రావణం ఒకసారి WDC తో మరియొకసారి CVR మట్టి ద్రావణంతో చేలలో క్రమం తప్పకుండా ప్రతి వారం పిచికారి ద్వారా పురుగులను తెగుల్లను నివారించడమే కాకుండా పంట చేలు ఆరోగ్యంగా పెరుగుతాయి
అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations
టార్పాలిన్స్1099 మాత్రమే,
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్,
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D బ్యాక్టీరియా
ఇంకా ఎన్నో సేవలు
అందిస్తుంది
రైతుల సంస్థ
చార్వి ఇన్నోవేషన్స్
www.chaarviinnovations.com
No comments:
Post a Comment