వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కిస్తూ తక్కువ ఖర్చుతో లాభసాటిగా ఉండే వ్యవసాయాల్లో పుట్టగొడుగుల పెంపకం కూడా ఒకటి. అయితే ఈ పుట్టగొడుగుల్ని ఇంటి వద్దే పెంచుకోవచ్చు. వరిసాగు చేసే రైతులకు ఇది లాభసాటిగా కూడా ఉంటుంది. ఎందుకంటే వరి గడ్డి ఉపయోగించి కూడా వీటి పంపకం చేపట్టవచ్చు. 4టన్నుల వరిగడ్డితో 1200 కిలోల పుట్టగొడుగులను పెంచుకోవచ్చు. అధిక దిగిబడితో పాటు ఆదాయాన్నీ పొందవచ్చు. ఆదాయమే కాదు తిన్నవారికి చక్కటి ఆరోగ్యం కూడా లభిస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ పుట్టగొడుగుల పెంపకం ఎలా చేపట్టాలో తెలుసుకుందామా..?
స్థలం:
పుట్టగొడుగులు పెంచాలంటే ప్రారంభ దశలో 20-25 చదరపు అడుగుల షెడ్ గానీ పూరీ పాక గానీ నిర్మించుకోవాలి. అయితే ఈ షెడ్‌ను లేదా పాకను రెండుగా విభజించుకోవాలి. ఒక గదిని విత్తుకోవడానికి వినియోగించాలి. మరొక గదిని పుట్టగొడుగుల పెంపకానికి వినియోగించాలి. ఈ రెండు గదులకూ కూడా గాలి, వెలుతురూ సక్రమంగా వెళ్ళేలా ఏర్పాటు చేసుకోవాలి.
ఉష్ణోగ్రతలు:
ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ పుట్టగొడుగుల పెంపకం చేపట్టవచ్చు. అయితే పుట్టగొడుగుల పెంపకం చేపట్టే గదుల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉండాలో తెలుసుకుందాం. విత్తుకొనే గదిలో 25-300 సెంటిగ్రేడుల ఉష్ణొగ్రత, పెంపకానికి ఏర్పాటు చేసిన గదిలో 23 -250 సెంటిగ్రేడుల ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. పెంపకం గదిలో తేమ శాతం మాత్రం 75- 80% కన్నా ఎక్కువ ఉండేలా జాగ్రత్త పడాలి.
పెంపకానికి ఏవేం కావాలి??
వరి గడ్డి, చెరకు పిప్పి, విత్తనాలు వలిచిన మొక్కజొన్న కండెలు, డేటల్, పర్మాలిన్ మొదలగునవి
మంచి పరిశోధనా కేంద్రం నుండి తెప్పించిన శిలీంద్రము
గోధుమ, శనగలు, జొన్న, సజ్జ వంటి ధాన్యాలు
పాలిథిన్ సంచులు
థర్మామీటర్, హ్యుమిడిటీ మీటర్
పెంపకం విధానం …
ముందుగా పైన చెప్పిన ధాన్యాలను సగం ఉడికేలా ఉడకబెట్టి గాలికి ఆరబెట్టాలి. దీనిలో 2% కాల్షియం కార్బొనేట్ పొడిని కలిపి ఖాళీ సీసాలో వేసి వేడి నీటిలో ఉడకబెట్టాలి.
పరిశోధనా శాల నుండి తెచ్చిన శిలీంద్రాన్ని 12-15 రోజులు పొదిగించాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న సీసాలో ఈ శిలీంద్రాన్ని నింపి విత్తుకోవాలి.
గడ్డిని తీసుకుని 5 నుండి 7సె.మీ. మేర ముక్కలుగా కత్తిరించుకుని వాటిని నీటిలో 5 నుండి 7 గం.ల మధ్యలో నానబెట్టాలి. తర్వాత వేడి చేసి, ఈ నీటిని పారబొయ్యాలి. తర్వాత గడ్డిని ఆరబెట్టి హ్యుమిడిటీ మీటర్‌తో పరీక్షిస్తూ 65-75% తేమ ఉండేలా చూసుకోవాలి.
రెండు వైపులా తెరచి ఉంచే పాలిధిన్ సంచులను తీసుకుని ఒక వైపు గట్టిగా ముడి వెయ్యాలి. సంచికి అక్కడక్కడా 2-3 రంద్రాలు చెయ్యాలి. ఇప్పుడు గడ్డిని తీసుకుని 5 సెం.మీఎత్తు వరకూ నింపాలి. ఆ తర్వాత విత్తిన శిలీంద్రాన్ని వేసుకోవాలి.
మళ్ళీ 5సెం.మీ మేర గడ్డిని వేసి దానిపై శిలీంద్రాన్ని వెయ్యాలీ. ఈ విధంగా 4 పొరలు వెయ్యాలి. సంచి రెండో మూతిని కూడా గట్టిగా కట్టెయ్యలి. ఇలా నింపిన పాలిధిన్ సంచులనువరుసగా పెట్టుకోవాలి.
కేసింగ్
బెడ్ కట్టిన
18 నుంచి 25 రోజుల తర్వాత ఈ సంచులను రెండో గదిలోకి(పెంపకం) మార్చి ఆ బెడ్ లను రెండు గా కత్తిరించి స్టెరిలీజ్ చేసిన మట్టిని బెడ్ పైన కప్పి తగినంత వెలుతురు ఉన్న రూమ్ లోకి వరుసగా పేర్చుకోవాలి.
ఈ సంచులపై రోజూ నీటిని చల్లుతూ ఉండాలి. ఇలా గదిలోకి మార్చిన 4 నుండి 6 రోజుల్లోనే కోతకి వచ్చేస్తాయి. ఒకసారి కోసిన తర్వాత మళ్ళీ 2 లేదా 3 పంటలను ఇస్తాయి. పరిస్థితులని, విత్తనాన్ని బట్టి రోజూ గానీ, రోజు విడిచి రోజు గానీ కొత్తకి వస్తాయి.
ఇలా కోత కోసిన పుట్టగొడుగులు 24 గంటలకంటే ఎక్కువ నిల్వ ఉండవు. జాగ్రత్తలు పాటిస్తే 7 రోజుల వరకు నిలువ ఉంటాయు త్వరగా మార్కెట్ చేసుకోవడం మంచిది. కృత్రిమంగా నిల్వ చేసుకోవాలంటే డ్రైయర్స్ సాయంతో గానీ, ఎండబెట్టిగాని నిల్వ చేసుకోవచ్చు. అవి కూడా కొంత కాలమే నిలుస్తాయి... 🙏
No comments:
Post a Comment