పంటలకు నూనె గింజలతో మజ్జిగ ద్రావణం చేసుకోవటం ఎలా,, కావలసిన పదార్థాలు
నువ్వులు 100 గ్రాములు
వేరుశెనగ 1 కిలో
సోయాబీన్ 1 కిలో
బలిసిన పచ్చి కొబ్బరి 1 కిలో
తయారీ విధానం
నువ్వులు, వేరుశెనగ, సోయాబీన్ మరియు కొబ్బరి ప్రత్యేక పాత్రలలో 10 గంటల సేపు నానబెట్టుకోవాలి.
నానా బెట్టిన నీటిని తీసివేసి పక్కన ఉంచుకోవాలి పారబ్రోయరాదు.
గింజలను మిక్సీ లో వేసుకొని పేస్ట్ తయారు చేసుకోవాలి.
పేస్ట్ ను గ్రైండర్ లో వేసుకొని రుబ్బుకొంటు పక్కన ఉంచుకున్న నీటిని వేసుకొంటు చిక్కగా పాలు చేసుకోవాలి.
పక్కన ఉంచుకున్న నీరు చాలకపోతే వేరే నీరు కొద్దిగా పోసుకొంటు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
గ్రైండ్ అయిన మిశ్రమాన్ని కాటన్ బట్టలో వడగట్టుకోవాలి.. ఆ పిప్పిలో ఇంకా పోషక పదార్థం ఉంటుంది కావున మిక్సీలో వేసుకొని నీరు పోసుకొంటూ గ్రైండ్ చేసుకోవాలి.
కాటన్ బట్టలో వడగట్టుకొని ఈసారి వచ్చిన పిప్పిని పేడ దిబ్బలో వేసేయాలి.
ఇప్పుడు ఆ పాలను డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి, డబుల్ బాయిలింగ్ అంటే ఒక పెద్ద పాత్రలో ముందే నీరు పోసుకొని మంట పెట్టుకోవాలి మారుగుతున్న నీటిలో స్టాండ్ పెట్టుకొని పాలు పోసుకున్న పాత్రను అందులో ఉంచుకోవాలి.
4 నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
జాగ్రత్తగా పాల పాత్రను బయటకుతీసి చల్లార్చుకొని మట్టికుండ లో పోసుకోవాలి.
చల్లారిన పాలల్లో లీటరు ఆవు పెరుగు వేసుకొని 6 రోజులు నీడని ప్రాంతంలో లో ఉంచుకొన్నట్టయితే నూనె గింజల పులిసిన పెరుగు సిద్ధం అవుతుంది.
సిద్ధం అయిన పెరుగు 6 లీటర్లు ఉంది అని అనుకుంటే 20 లీటర్ల నీటిలో పెరుగు వెన్నెలు లేకుండా నీళ్లగా చిలక్కొట్టుకొని మజ్జిగ చేసుకోవాలి.
ఈ మజ్జిగను 200 లీటర్ల నీటికి కలుపుకొని పంటలకు స్ప్రే చేసుకోవాలి..
ఉపయోగాలు : పంటకు 12 నుంచి 16 రకాల పోషకాల అందడంతో పాటు మొక్కలలోని జిబ్బర్లిన్ హార్మోన్స్ ప్రేరేపితం అవుతాయి మరియు మొక్కలకు ప్రోబయోటిక్స్ అందుతాయి, తెగుళ్లు నివారణ జరుగుతుంది..
అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations
టార్పాలిన్స్1099 మాత్రమే,
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్,
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D బ్యాక్టీరియా
ఇంకా ఎన్నో సేవలు
అందిస్తుంది
రైతుల సంస్థ
చార్వి ఇన్నోవేషన్స్
www.chaarviinnovations.com
No comments:
Post a Comment