Saturday, October 10, 2020

దశపర్ణి కషాయం తయారు చేయడం ఎలా

దశపర్ణి  కషాయం  తయారు చేయడం ఎలా  , అన్ని రకాల పురుగుకి, కొన్ని తెగుళ్లకు ఇది బాగా పనిచేస్తది   కానీ, ఇది తయారవడానికి  మాత్రం 40 డేస్ పడుతుంది 
దశపర్ణి  కషాయానికి నేను వాడిన ఆకులు 
కలబంద 2kg
టేకు ఆకులు 2kg
కానుగ  ఆకులు 2kg
వేప 2kg
మునగ 2kg
జిల్లేడు 2kg
తులసి 1kg
జామ 2kg
బొప్పాయి 2kg
సీతాఫలం 2kg
పచ్చిమిర్చి 1కేజీ దంచినది 
అల్లం అరకేజీ  మెత్తగా దంచుకోవాలి 
వెల్లుల్లి 1kg, మెత్తగా దంచుకోవాలి 
పసుపు పొడి 200 గ్రాములు 
ఆవుపంచకం 20 లీటర్లు  
ఆవు పేడ  2 కేజీ లు 
ఇంకా కేజీ పొగాకు కూడా వేస్తారు కానీ మా ఊరిలో దొరకలేదు  రేపు  సిటీకి ఎవరైనా వెళ్తే తెప్పిస్తాను  
ఈ వస్తువులు అన్ని కూడా 200 లీటర్లు పట్టే డ్రమ్ములో వేసి అన్ని ఆకులు కూడా రోటిలో దంచుకోవడమో లేకపోతే ముక్కలుగా కట్ చేయడమో చేసి , డ్రమ్ములో అన్ని వేసి   డ్రమ్ముకి కొంచం వెలితిగా నీళ్లు నింపి 
రోజు  ఉదయం, సాయంత్రం  ఒక కర్రతో సవ్య దిశలో తిప్పుకోవాలి, ఒక నిమిషం పాటు, 
40 రోజులకు  ఒక మంచి కషాయం తయారు అవుతుంది, 
పురుగుకి  చాలా బాగా పని చేస్తుందని అనుభవజ్ఞులు చెప్పారు, నేను మొదటిసారి చేయడం ,  ప్రకృతి వ్యవసాయం  అంటే  చాలా శ్రమ చేయాలి, అన్ని సేకరించుకోవడం , తయారు చేసుకోడం, ఎప్పుడు ఎం చేయాలో ముందే చేసి పెట్టుకోవాలి,  అప్పటికప్పుడు ఏది రెడీ గా  అవ్వదు, 
ప్రకృతి వ్యవసాయానికి మన శ్రమ, మన ఆలోచనే నిజమయిన పెట్టుబడి,

No comments:

Post a Comment

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...