అరటితో అద్బుతలు..
లాక్డౌన్_వేళ_ఓ_రైతు_అద్భుతమే_సృష్టించాడు.
కర్ణాటకలో తాను సాగు చేసిన అరటిపండ్లు అమ్ముడుపోలేదని చెత్తకుప్పలో_పారేయకుండా.. వాటిని శ్రద్ధగా ఎండబెట్టాడు. అరటి పండ్లను పోషకాలు నిండిన డ్రైఫ్రూట్గా మార్చేసి లాభాలు ఆర్జిస్తున్నాడు.
డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి_ఎంత_మేలు_చేస్తాయో_వైద్యులు చెబుతూనే ఉంటారు. అయితే ఇన్నాళ్లు... ఎండు ద్రాక్షా.. ఎండిన అప్రికాట్.. ఎండబెట్టిన_అంజీరా.. కాజూ,బాదం.. ఇలా డ్రైఫ్రూట్స్‌లో చాలా రకాలే తిని ఉంటాం. కానీ, ఇప్పుడు మన దేశంలో ఉత్పత్తవుతున్న ఎండు అరటిపండును ఈ జాబితాలోకి చేర్చేశాడు #కర్ణాటకకు_చెందిన_ఓ_రైతు.
కష్టం నుంచి ఆలోచన!
బళ్లారి, కంపిలి తాలూకా, రామసాగర గ్రామానికి చెందిన K.గంగాధర్ ఓ_సాధారణ_రైతు. లాక్డౌన్ వేళ సుగంధి రకం అరటిని సాగు చేశాడు గంగాధర్. కానీ, కరోనా కారణంగా మార్కెట్ పడిపోయి గిట్టుబాటు ధర రాలేదు. దీంతో పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరైందని బాధపడ్డాడు.
కానీ, మనిషి_తలచుకుంటే_ఎంతటి_విపత్తులోనైనా ఓ మార్గాన్ని వెతకొచ్చని గుర్తించాడు. వెంటనే, అరటిపళ్లు #పాడవ్వకుండా వాటిని ఏం చేయొచ్చని ఆలోచించాడు.
విదేశాల్లో ఎండు అరటిపండ్లకున్న డిమాండ్ గురించి తెలుసుకున్నాడు గంగాధర్.
భారత్‌లో తనలాంటి_రైతులను_సంప్రదించాడు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో.. నెల రోజులకు పైగా అరటి పండ్లను ఎండబెట్టి ఓ డబ్బాలో ప్యాక్ చేసి జిల్లాలోని హోల్సేస్, రిటైల్ దుకాణాలకు విక్రయించి లాభాలు పొందుతున్నాడు.
ఎండబెట్టిన అరటిపండ్లలో పోషకాలు_పుష్కలంగా ఉంటాయని..
ఈ డ్రైఫ్రూట్ను తింటే ఆరోగ్యానికెన్నో లాభాలున్నాయని రాయ్‌చూర్ వ్యవసాయ వర్సిటీ ధ్రువీకరించింది. దీంతో ప్రభుత్వం సహకరిస్తే... ఈ డ్రై_బనానా ఉత్పత్తిని మరింత
వృద్ధి చేస్తానంటున్నాడు గంగాధర్.
రైతు చిరునామా
బళ్లారి జిల్లా,
కంపిలి తాలూకా,
రామసాగర గ్రామానికి చెందిన
K.గంగాధర్
Cell: 9986328071
No comments:
Post a Comment