Thursday, June 25, 2020

పచ్చని వ్యవసాయనికి 12 సూత్రాలు ( 12 best agriculture practices from Chaarviinnovations

*పచ్చని వ్యవసాయనికి  పన్నెండు సూచనలు*

1) ఎండ తక్కువ ఉన్న సమయంలో స్ప్రే చెయ్యడం ఉత్తమము.

2) మీకున్న భూమిలో 10 శాతం అన్ని రకాల కూరగాయలు వెయ్యండి మీ ఇంటి పోషణ కు మరియు ఇతర ఖర్చులకు సహకారం అవుతాయి.

3) కొత్తగా వ్యవసాయము చేసే వారు 1 లేదా 2 ఎకరాల పొలముతో మొదలుపెట్టండి.

4) మిశ్రమ పంటలు వెయ్యండి (వ్యాధుల వ్యాప్తిని   తగ్గించవచ్చు)

5) మిత్ర పూరుగులు పెరిగేలా చర్యలు తీసుకోండి (రసాయనలు  వాడటం తగ్గించండి) సగం వ్యాధులు రావు.

6) ముల్చింగ్ షీట్  రెండు లేదా మూడు  సంవత్సరాలు వాడటం వల్ల కలుపును పూర్తిగా నిర్ములించవచ్చు దాదాపుగా.

7) ఎక్కువగా కూలీల పైన      
  ఆధారపడొద్దు సాధ్యమైనంత వరకు.

8) సొంతంగా ఎరువులుతయారు చేసుకోండి (పాడి ని పెట్టుకోండి) విలున్నంతవరకు. 

9) కోళ్లను పొలములో తిప్పితే ఎటువంటి మిడతాలైన అడ్డుకోవచ్చు.(గ్రామాల్లో మళ్ళీ కోళ్లను పెంచండి)

10) ఆకుకూరలు కొంత భూమిలో ఎప్పుడు సాగు చెయ్యండి పెట్టుబడి తక్కువ ఖచ్చితమైన ఆదాయం.

11) పంట మార్పిడి పాటించండి & భూసార పరీక్షలు నిర్వహించండి(ఎంత ఎరువులు వేయాలో తెలుస్తుంది).

12) పంట క్యాలెండర్ ను పాటించండి.

No comments:

Post a Comment

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...