Tuesday, August 25, 2020

రైతుల జీవితాలు మారిపోయే జిరా & నీరా చెట్ల పెంపకం

  రైతుల జీవితాలు మారిపోయే జిరా & నీరా చెట్ల పెంపకం

తాటి బెల్లం ద్వారా ఒనగూడే ఔషధ గుణాలు, పోషక విలువలు ఎన్నో. అనాదిగా మన పెద్దలు వాడుతున్న ఆరోగ్యదాయకమైనది తాటి బెల్లం. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో తాటి బెల్లానికి, ఆరోగ్య పానీయంగా తాటి నీరా వాడకానికి మళ్లీ ఆదరణ పెరుగుతోంది. తాటి బెల్లాన్ని సాధారణ పంచదార, బెల్లానికి బదులుగా వాడటం ఎంతో ఆరోగ్యదాయకమని వైద్యులు చెబుతున్నారు. అందువల్లే మధుమేహ రోగులు సైతం తాటి బెల్లాన్ని నిక్షేపంగా వాడుతున్నట్లు చెబుతున్నారు.
అయితే, ఈ బెల్లం తయారీకి అవసరమైన నీరా ఉత్పత్తి తాటి చెట్టుకు రోజుకు 5–6 లీటర్లకు మాత్రమే పరిమితం. తాటి నీరా కన్నా జీరిక నీరా రుచికరమైనది. తాటి బెల్లానికి దీటుగా ఔషధగుణాలు, పోషకాలు కలిగి ఉండే ‘జీరిక’ బెల్లాన్ని భారీ ఎత్తున ఉత్పత్తి చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు ఇటీవల వేలాది జీరిక మొక్కలను నర్సరీల నుంచి సేకరించి తమ నియోజకవర్గాల్లో పంపిణీ చేస్తున్నారు.

భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఇటీవల నల్లగొండ జిల్లా మల్లేపల్లిలో తాటి పరిశోధనా స్థానాన్ని మంజూరు చేసింది. ఈ కేంద్రంలో జీరిక చెట్లపై కూడా పరిశోధన ప్రారంభించటం మేలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఈ జీరిక చెట్ల మాదిరిగానే కనిపించే అలంకారప్రాయమైన మరో జాతి చెట్లు కూడా ఉన్నాయని, వీటిని కేవలం అందం కోసం లాండ్‌స్కేపింగ్‌లో వాడుతున్నారని.. నీరా కోసం జీరిక మొక్కలను నాటుకునే రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గిరిజనుల కల్పవృక్షం.. జీరిక
జీరిక చెట్టును సుల్ఫి లేదా ఫిష్‌టైల్‌ పామ్‌ అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో గిరిజనులు సాంప్రదాయకంగా జీరిక నీరాను, కల్లును ఆరోగ్యపానీయంగా వాడుతున్నారు. తాటి చెట్ల నీరా/కల్లు కన్నా రుచికరమైనది కావడంతో జీరిక నీరా/కల్లుకు జగదల్‌పూర్, బస్తర్‌ ప్రాంతాల్లో గిరాకీ ఎక్కువగా ఉంది. ఇది గిరిజనులకు ముఖ్యమైన ఆదాయ వనరుగా కూడా ఉంది.

నాటిన ఆరేళ్ల నుంచే నీరా దిగుబడి..
జీరిక మొక్క నాటిన ఆరేళ్ల నుంచి 25 ఏళ్ల వరకు.. ఒక్కో జీరిక చెట్టు నుంచి సగటున 30–40 లీటర్ల నీరాను సేకరిస్తున్నారు. భూసారం తదితర సానుకూలతల వల్ల కొన్ని చెట్ల నుంచి రోజుకు 50–60 లీటర్ల వరకు నీరాను సేకరిస్తూ, ఆరోగ్య పానీయంగా వినియోగిస్తున్నారు. బియ్యాన్ని ఉడికించి అన్నం వండుకోవడానికి నీటికి బదులు జీరిక నీరాను గిరిజనులు వినియోగిస్తుంటారు. తద్వారా కేన్సర్, తదితర జబ్బులు నయమవుతున్నాయని కూడా గిరిజన సంప్రదాయ వైద్యులు విశ్వసిస్తున్నారు.

ఆ విధంగా జీరిక నీరా/కల్లు ఛత్తీస్‌గఢ్‌ – ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు జగదల్‌పూర్, మారేడుమిల్లి ప్రాంతాల్లో గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరుగానే కాకుండా.. వారి ఆహార సంస్కృతిలో ప్రధాన భూమికను నిర్వహిస్తున్నది. అందువల్లనే గిరిజనులు జీరిక చెట్టును కల్పవృక్షంగా కొలుస్తారు. ఆడ పిల్లకు ఒక్కో చెట్టు చొప్పున పుట్టింటి వాళ్లు కానుకగా ఇచ్చే అలవాటు కూడా అక్కడ అనాదిగా ఉన్నది. ఈ కారణంగా ఒక్కో చెట్టు నుంచి ఏటా రూ. 30 వేల నుంచి 40 వేల వరకు గిరిజనులు ఆదాయం పొందుతుండటం విశేషం.

మైదాన ప్రాంతాలకు జీరిక అనువైనదేనా?
జీరిక చెట్లు ప్రస్తుతం ఆంధ్ర–ఒడిశా– ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లోని ఎత్తయిన గిరిజన ప్రాంతాల్లో సహజసిద్ధంగా పెరుగుతున్నాయి. తాటి చెట్ల కన్నా 6–7 రెట్ల నీరా దిగుబడినిస్తున్నాయి. అయితే, మైదాన ప్రాంతాల్లో ఈ చెట్లు ఇదే మాదిరిగా అధికంగా నీరా దిగుబడిని ఇస్తాయా? లేదా? అన్నది వేచి చూడాలని డా. వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా పందిరిమామిడిలోని తాటి పరిశోధనా స్థానం సీనియర్‌ ఆహార శుద్ధి శాస్త్రవేత్త పి. సి. వెంగయ్య ‘సాగుబడి’ తో చెప్పారు.

అనాదిగా జీరిక పెరుగుతున్న మారేడుమిల్లి తదితర ప్రాంతాలు సముద్ర తలం నుంచి 250 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ విధంగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు వీటి కన్నా ఎత్తయినవే. కాబట్టి, సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మినహా ఎత్తయిన మైదాన ప్రాంతాల్లో కూడా జీరిక సాగు లాభదాయకంగానే ఉండొచ్చని ఆయన చెబుతున్నారు. అయితే, జీరిక నీరా దిగుబడిపై వాతావరణం, భూములు.. ఇంకా ఇతర అంశాల ప్రభావం ఏమేరకు ఉంటుందో శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సి ఉంది.

జగదల్‌పూర్‌లో రెండేళ్ల క్రితమే జీరికపై ప్రత్యేక పరిశోధనా స్థానం ఏర్పాటైంది. దీనిలో పరిశోధనలు ప్రస్తుతం శైశవ దశలోనే ఉన్నాయి. వెంగయ్య తమ పరిశోధనా స్థానంలో గత ఏడాది గిరిజనుల నుంచి సేకరించిన జీరిక మొక్కలను నాటారు. మైదాన ప్రాంతాల్లో కూడా నీరా దిగుబడి బాగా ఉందని రుజువైతే.. ఆరోగ్యదాయకమైన పానీయం నీరాతో పాటు ఔషధగుణాలుండే సహజ జీరిక బెల్లాన్ని కూడా భారీ మొత్తంలో ఉత్పత్తి చేసి, అశేష ప్రజానీకానికి అందుబాటులోకి తేవటం సాధ్యమవుతుందని వెంగయ్య అన్నారు. తాటి బెల్లంలో మాదిరిగా జీరిక బెల్లంలో కూడా గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువ కాబట్టి.. సాధారణ పంచదార/బెల్లానికి బదులు తాటి/జీరిక బెల్లాన్ని ఏ వయస్సు వారైనా, మధుమేహ రోగులు సైతం వాడొచ్చని ఆయన తెలిపారు.

100 లీటర్ల జీరిక నీరాతో 15 కిలోల బెల్లం
తాటి నీరా కన్నా జీరిక నీరా రుచికరమైనది కూడా. జీరిక నీరాతో తాటి నీరాతో మాదిరిగానే 12–15% బెల్లం రికవరీ(100 లీటర్ల నీరాను ఉడికించితే 12–15 కిలోల బెల్లం ఉత్పత్తి) వస్తున్నదని వెంగయ్య జరిపిన ప్రాధమిక అధ్యయనంలో తేలింది. అయితే, ఔషధగుణాలు, ఖనిజలవణాలు, పోషకాల విషయంలో కూడా తాటి, జీరిక నీరాల మధ్య తేడా ఏమైనా ఉందా అనేది పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉన్నప్పటికీ.. పెద్దగా తేడా ఉండకపోవచ్చు అని వెంగయ్య (9493128932) తెలిపారు.

జీరిక చెట్ల వద్ద రాలిపడిన కాయల ద్వారా మొక్కలు మొలుస్తుంటాయి. గిరిజనులు వాటిని తెచ్చి మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతాల్లో వారపు సంతల్లో విక్రయిస్తుంటారు. జీరిక చెట్ల కాయలు పెద్ద రేగు కాయల సైజులో ఉంటాయి. జీరిక చెట్లలో వైవిధ్యం, అవి పెరుగుతున్న భూములను బట్టి వాటి కాయల రంగులో తేడా కనిపిస్తోంది. ఈ కాయల నుంచి విత్తనాలను సేకరించి.. నర్సరీలో మొక్కలను పెంచుకొని నాటుకోవటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.


Wednesday, August 19, 2020

దేశీఆవు (నాటుఆవు) పాలు,నెయ్యి ఉపయోగించడం వ‌ల్ల ప్రయోజనాలు

దేశీఆవు (నాటుఆవు) పాలు,నెయ్యి ఉపయోగించడం వ‌ల్ల ప్రయోజనాలు.
1. ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం - పిల్లల్లో మెదడు పనితీరును చురుకుగాను, జ్ఞాపకశక్తిని పెంపొంచేదిగానూ ఉపకరిస్తుంది.

2.తల్లి పాల తరువాత పిల్లలకు ఆవు పాలే శక్తిని, రక్షణను ఇస్తూ సులభంగా జీర్ణమవుతుంది.

3.దేశీ ఆవు పాలల్లో ఉండే అమినో యాసిడ్లు - ప్రోటీన్లు సులభంగా జీర్ణమవుతాయి. 

4.ఆవు పాలు ప్రతిరోజు త్రాగడంవల్ల శరీరానికి అవసరమయ్యే హైడెన్సటీ కొలెస్ట్రాల్ (హెచ్డడిఎల్) అధికమవుతుంది. (శరీరానికి కీడు చేసే లో డెన్సటీ కొలెస్ట్రాల్ కాదు) .

5. రక్తం గడ్డకట్టి,ఆతర్వాత ఏర్పడే సీరం కొలెస్ట్రాల్ తయారవకుండా నిరోధిస్తుంది. 

6. దేశీ ఆవు పాలల్లో ఉండే సైటోకైన్లు, ఖనిజలవణాలు వంటి సూక్ష పోషకాల కారణంగా మానవ సరీరంలో రోగనిరోధక శక్తిని అధికం చేస్తూ మరింత ప్రయోజనకరముగా పనిచేస్తుంది.

7.దేశీ ఆవు పాలల్లో  ఉండే మెగ్నీషియం,జీర్ణశక్తిని వృద్ధి చేయడంలో,రక్తం ఇంకా కణజాలనికి సహాయపడుతుంది. కండరాలు బిగుసుకు పోకుండా నియంత్రిస్తుంది.దేశీ ఆవు పాలల్లో ఉండే మెగ్నీషియం ఎముకలకు కీలకమైన కాల్షియం అందేలా చేస్తుంది. మానవ శరీరం నిర్వహించే 300 కు పైగా వేరు వేరు ప్రక్రియల్లో ఉపయోగపడే గొప్ప అణువు మేగ్నీషియం  జీవప్రక్రియకు ఉత్త్రేరకంగా పనిచేస్తుంది. 

జై గోమాత జై విశ్వమాత ..🙏🙏🙏

Monday, August 17, 2020

తాటి_చెట్టు గురించి తెలుసుకుందాం

తాటి_చెట్టు గురించి తెలుసుకుందాం

తాటి చెట్టు పామే కుటుంబానికి చెందిన ఒక చెట్టు. దీనిలో ఆరు జాతులు ఆఫ్రికా, ఆసియా, న్యూగినియాలలో విస్తరించి ఉన్నాయి. ఇవి పొడవుగా 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆకులు హస్తాకారంలో 2-3 మీటర్ల పొడవు ఉంటాయి. 
తాటిచెట్టు వివిధ భాగాలు ఆంధ్రుల నిత్యజీవితంలో చాలా రకాలుగా ఉపయోగపడుతుండడం వల్ల దీనిని #ఆంధ్ర_కల్పవృక్షం అంటారు.

_తాటి_లక్షణాలు 

నలుపు బూడిదరంగు కాండంతో శాఖారహితంగా పెరిగే పొడుగాటి వృక్షం.
వింజామరాకార సరళ పత్రాలు.
స్పాడిక్స్ పుష్పవిన్యాసంలో అమరి ఉన్న పుష్పాలు.
ఇంచుమించు గుండ్రంగా ఉన్న పెద్ద టెంకలు గల ఫలాలు.
ఒక తాటిపండులో మూడు టెంకలు ఉంటాయి.

_తాటి_జాతులు 

బొరాసస్ aethiopium - ఆఫ్రికా తాటి (ఆఫ్రికా)
బొరాసస్ akeassii - Ake Assi's తాటి (పడమర ఆఫ్రికా)
బొరాసస్ ఫ్లాబెల్లిఫర్ - ఆసియా తాటి (దక్షిణ, ఆగ్నేయ ఆసియా)
బొరాసస్ heineanus - న్యూగినియా తాటి (న్యూగినియా)
బొరాసస్ madagascariensis - మడగాస్కర్ తాటి (మడగాస్కర్)
బొరాసస్ sambiranensis - Sambirano తాటి (మడగాస్కర్)

తాటి_ఉపయోగాలు 

తాటి చెట్టు బాగా ఆర్థిక ప్రాముఖ్యత కలిగినది. పురాతన కాలం నుండి దీని వివిధ భాగాలు భారతదేశం, కాంబోడియాలలో చాలా విధాలుగా ఉపయోగంలో ఉన్నాయి.

తాటాకులు పాకలు వేసుకోవడానికి, చాపలు, బుట్టలు, సంచులు, విసనకర్రలు, టోపీలు, గొడుగులు తయారుచేసుకోవడానికి ఉపయోగపడతాయి. 
తాటాకులు కాగితం ఉపయోగానికి రాకమునుపు ముఖ్యమైన వ్రాత పరికరం.
తాటిచెట్టు కలప గట్టిగా ఉండి ఇల్లు కట్టుకోవడంలో దూలాలుగా, స్తంభాలుగా ఉపయోగపడతాయి.
తాటి మానును కాలువల మీద అడ్డంగా వేసి వంతెనగా ఉపయోగిస్తారు.
తాటి మానును మధ్యలోవున్న కలపను తీసేసి గొట్టం లాగ చేసి దాన్నే నీళ్ళు పారే పైపు లాగ వుపయోగిస్తారు.
తాటి బెల్లం కూడా తయారు చేస్తారు. ఇది ఆయుర్వేద వైద్య విధానంలో చాల ఉపయోగాలున్నాయి.
తాటి పండ్లు, ముంజెలు, కంజి మంచి ఆహార పదార్ధాలు. 
తాటి కల్లు ఒకరకమైన మధ్యం. 
తాటిపండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు.

Friday, August 14, 2020

డైరీ ఫార్మ్ లో నష్టపోవడానికి మేము గమనించిన కొన్ని కారణాలు

డైరీ ఫార్మ్ లో నష్టపోవడానికి మేము గమనించిన కొన్ని కారణాలు:
1. పశువులపై పూర్తి అవగాహన లేకపోవడం. అవగాహన లేని అనుభవం కూడా వ్యర్థమే.
2. డైరీ ఫార్మ్ ని ఒక పార్ట్ టైం జాబ్ లాగ చేసుకుంటూ పని వారికి మొత్తం అప్పగించడం
3. డైరీ ఫార్మ్ కి తగినంత సమయం కేటాయించక పోవడం. మెదలు పెట్టినప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ తర్వాత ఉండకపోవడం
4. అవగాహన లేకుండా ఎక్కువ పశువులతో మొదలు పెట్టడం
5. పని వారిపై పూర్తిగ ఆధారపడడం
6. పని వారితో ఎలా మెలగాలో తెలియక పోవడం. ఫలితంగ పనివారు మధ్యలో వదిలేసి వెళ్లడం. మనకు మొత్తం చేసుకోవడం కష్టమై డైరీ ఫార్మ్ మూసివేయటం
7. మన ప్రాంత పరిస్థితులని తెలుసుకోకుండా గేదెల ఆవులలో మనకు నచ్చిన దానికి పోవడం
8. షెడ్ పై ఎక్కువ ఖర్చు పెట్టి పశువుల దగ్గరికి వచ్చే సరికి ఖర్చు కి వెనకాడడం. నాణ్యమైన పశువుల బదులు తక్కువ లో దొరికే పశువులకు వెళ్లడం
9. పశువులు కొనేటప్పుడు రాజి పడడం
10. పచ్చ గడ్డి కూడా బయట నుండి కొనుకోవడం
11. దాణా సొంతంగ తయారు చేసుకోకుండా బయట దొరికే రెడీమేడ్ ది కొనుకోవడం
12. దాణా లో మినరల్ మిక్చర్ మరియు ఉప్పు వాడకపోవడం
13. దాణా పై ఖర్చు తగ్గించుకునే ఆలోచన చేయకపోవడం. దాణా అంటే సమీకృత దాణా.
14. మీకు తక్కువ ధరలో దొరికినది మాత్రమే పెట్టి సమీకృత దాణా పెట్టకపోవడం. ఫలితంగా పాలు శక్తి మేర తీసుకోకపోవడం
15. పాలను సొంతంగ మార్కెట్ చేసుకోకుండా పాల సెంటర్ కి పోయడం
16. పాలను రిటైల్ గ కాకుండా హోల్సేల్ గ అమ్మడం. ఫలితంగ తక్కువ రేట్ కి పాలను అమ్ముకోవడం
17. పచ్చ గడ్డి లో పప్పు జాతి మరియు గడ్డి జాతి రెండు పండించుకోకుండా కేవలం గడ్డి జాతి అయిన సూపర్ నేపియర్ ఒక్కటే పెంచడం
18. ఒక పశువు నుండి దాని శక్తి మేర పాలు ఎలా తీసుకోవాలో తెలియక పోవడం
19. సరైన సమయం లో యద ని గుర్తించక పోవడం
20. కృత్రిమ గర్భధారణ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం
21. ఈనిన పశువుని తిరిగి 2 నుండి 3 నెలలలో కట్టించకపోవడం
22. కొన్న పశువుని పూర్తిగా పాలు తీసుకొని కట్టించకుండా అమ్మడం
23. దూడలను పోషించకుండా అమ్ముకోవడం లేదా చంపేయడం
24. మంచి జాతి లక్షణాలున్న దున్నపోతు లేదా ఆంబోతు తో క్రాస్ చేయించకపోవడం. AI అయితే మంచి సెమెన్ వాడకపోవడం. మంచి బ్రీడ్ మనమే డెవలప్ చేసుకోకపోవడం
25. ప్రతి సంవత్సరం ఒక దూడ ని తీసుకోకపోవడం
26. పశువులకు 24 గంటలు నీళ్లు అందుబాటులో ఉంచకుండా మనం నచ్చినవుడు నీళ్లు పెట్టడం. ఫలితంగా పాలు తగ్గిపోవడం
27. రికార్డ్స్ మైంటైన్ చేసుకోకపోవడం. ఇది మన దగ్గర ఉన్న మంచి పశువులను గుర్తించడానికి ఉపయోగపడుతుంది
28. ప్రతి దూడలకు, పశువులకు సమయానికి టీకా మరియు నట్టల నివారణ చేయించకపోవడం
29. పశువులకు వచ్చే రోగాలను సరైన సమయంలో గుర్తించకుండా ఆలస్యం చేయడం. ముఖ్యంగ పొదుగు వాపు లాంటివి గుర్తిచడం లో ఆలస్యం చేస్తే చాలా నష్టపోవాల్సి వస్తుంది
30. డైరీ ఫార్మ్ లో ఆధునాతన సాంకేతిక ను జోడించకపోవడం అంటే పాలు పితికే యంత్రాలు, ఛాఫ్ కట్టర్, బ్రష్ కట్టర్, మిల్క్ చిల్లర్స్, Pulverizer మొదలగునవి
My next post will be on ఆవులా, గేదెలా లేదా దేశి ఆవులా ?
ఇట్లు,
ఓ రైతు అనుభవం

Friday, August 7, 2020

కరోనా వచ్చాక పాత విధానాలే గొప్పవి అని మళ్ళీ గుర్తించారు


మనిషి మారిపోయాడు ?

సేకరించిన వాస్తవ పరిస్థితుల సమాచారం

*నేను* చుట్టూ గోడకట్టిన కాలనీలో (గేటెడ్ కమ్యూనిటీ) నివాసం ఉంటున్నాను. చేరి నెల రోజులయ్యింది. బయటకు పోవడానికీ, లోపలికి రావడానికి ఒక్కటే గేటు ఉంది. గేటు మూస్తూ తెరుస్తూ గేటు దగ్గర ఒక కాపలాదారుడు ఉన్నాడు. ఆ గేటు పక్కన ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టుకొమ్మ ఒకటి ఇంటి ప్రహరీ గోడ దాటి కాలనీ రోడ్డు మీదికి వచ్చింది. ఆ కొమ్మకు రెండు మామిడి పిందెలు పుట్టాయి. ఆ కొమ్మకింద ఒక ఎర్రటి రబ్బరుబంతి ఉంది.

        నేను రోజూ ఆ దారిన పోతూ ఆ బంతిని, మామిడి పిందెలను గమనిస్తూ ఉండేవాడిని. పది రోజులు గడిచాయి. ఆ మామాడి పిందెలు పెద్దవవుతూ ఉన్నాయి. ఆ బంతి కదలకుండా అక్కడే వుంది. రెండు నెలలు గడిచాయి. కాయలు బాగా బరువెక్కి కొమ్మ వంగింది. ఆ బంతి అటూ ఇటూ కదలకుండా అక్కడే ఉంది. నాకు ఆ దృశ్యాన్ని చూసి నప్పుడల్లా అసహజంగానూ, అసహనంగానూ ఉండేది. మరోవైపు ఆశ్చర్యమూ కల్గింది.

       ఈ కాలనీలో ఇంత నిజాయితీగా మనుషులున్నారా? బంతిని ఆ కాయల్ని ముట్టుకోనీయకుండా పిల్లల్ని నిజాయితీపరులుగా పెంచుతున్నారా? అసలు ఆ కాలనీలో ఒకరూ,  ఇద్దరూ తప్ప పిల్లలు ఎప్పుడూ సందడిచేస్తూ కనిపించడం లేదు ఎందుకని?

        ఆ ఇంటికి రెండిళ్ల ఇవతల ఒక ఇంటిముందు అరుగు ఉంది. ఆ అరుగు మీద ఎప్పుడూ తెల్లటి బట్టలు ధరించిన ఒక వృద్దుడు కూర్చుని ఉంటాడు. ఎల్లప్పుడూ అతను చేతిలో ఒక పుస్తకం వుంటుంది. ఒక రోజు ఆ వృద్దుడిని పలకరించాను. “ఏమండీ ఈ కాలనీలో దొంగతనాలు జరగవనుకొంటాను” అని అన్నాను.
“అలా.అని. ఎందుకనుకొంటున్నారు?” ఎదురు ప్రశ్నించాడు.
“అదిగో ఆ బంతిని రెండు నెలలుగా ఏ పిల్లవాడు తీయలేదు. ఆ మామిడికాయలను ఎవరూ తుంచలేదు."

“దానికి మీరు సంతోషిస్తున్నారా? ”
“సంతోషించడం లేదు. కాని విచిత్రంగా ఉంది. పిల్లలు కూడా ఒకరూ  ఇద్దరూ తప్ప ఎవరూ కనిపించడంలేదు”.
“మీరు సంతోషించినట్లు చెప్పి ఉంటే నేను బాధపడి ఉండే వాడిని. మీరు వాటిని గమనిస్తూ. ఉండడం, వాటిగురించి ఆలోచిస్తూ ఉండడం మంచి విషయం. అవి రెండూ ఇంతకాలం అక్కడ ఉండడం చాలా విచారించదగ్గ విషయం. పిల్లలు బాల్యాన్ని కోల్పోయారు. ఇది కాలనీ వాసుల నీతి నిజాయితీలకు సంబంధించిన విషయం గాదు. ఇక్కడున్నవాళ్లు ఎక్కువమంది వ్యాపారస్థులు, ప్రభుత్వ ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు వీళ్లంతా పిల్లలకు ఏ నీతులు చెబుతారు. వీరి జీవితాలు చూస్తూ పిల్లలు వీరినుండి ఏమి నేర్చుకుంటారు.

         పిల్లలు ఉదయం లేస్తూనే ట్యూషన్లకెళ్తారు. ట్యూషన్ల తర్వాత బడికి వెళ్తారు. బడినుండి రాగానే మళ్లీ ట్యూషన్, సెలవు రోజుల్లో జిమ్ములు, స్విమ్మింగ్లు, డ్యాన్సు క్లాసులు ఇంకా ఏమైనా మిగిలి ఉంటే టీవీ, సెల్ ఫోన్లు ఉన్నాయి గదా! వారికంటూ స్వంత ఆలోచనలు ఇష్టాయిష్టాలు ఎక్కడున్నాయి? మీకు తెలుసా ఒకప్పుడు పిల్లలు నడవడానికి ముందు మోకాళ్లతో దోగాడేవాళ్ల, మోకాళ్లదగ్గర చర్మం నల్లగా గట్టిపడి ఉండేది. ఇప్పుడు దోగాడనీయడం లేదు. నేరుగా నడిపించడమే. కిందపడనీయడం లేదు. పడి లేచి నడవడంలో వున్న అనుభూతిని పొందనీయడం లేదు. అసలు పిల్లల్ని పదేళ్ల వరకు వాళ్లు తినే ఆహారాన్ని కూడా వాళ్ల చేతుల్తో తిననీయడం లేదు. వాళ్లకంటూ స్వంత ఆటలు స్వంత అభిప్రాయాలు ఏమీ లేవు.

         ఊరినుంచి నేనొచ్చి మూడు నెలలయింది. మనవళ్లతో మనవ రాళ్లతో ఆడుకోవాలని ఉండదా? కొడుక్కి ఒక కూతురూ ఒక కొడుకు. ఐదేళ్లలోపు పిల్లలు. కార్లో ఎక్కడం కాన్వెంట్లకు వెళ్లడం - సాయంకాలం కార్లో నుండి దిగడం బాత్ రూంకో బెడ్ రూంకో వెళ్లడం. ఏదైనా తీరికవుంటే టీవీ ముందు కూర్చోవడం - నాతో మాట్లాడానికి టైం ఎక్కడుంది. ఇక నాకు పుస్తకాలే స్నేహితు లయ్యారు. 🙋‍♂

      ఇలా ఎందుకు జరుగుతున్నదో ఇప్పుడిప్పుడే నాకు అర్ధమవుతూ ఉంది. నీ రబ్బరు బంతిని మామిడికాయల్ని వాళ్లు చూసికూడా ఉండరు. బయట ప్రపంచ మీద పిల్లలకున్న ఆసక్తిని ఇష్టాన్ని చంపేసారు. “ఆ బిడ్డల్ని చూస్తే నాకు ఏడుపు వస్తున్నది” అంటూ - కన్నీళ్లు పెట్టుకొన్నాడు.
   “ఇంతకూ మీరేమి చేస్తుంటారు” అడిగాను.
  
 “నేనొక పెద్ద రైతుని. డిగ్రీవరకు చదువుకొని వ్యవసాయంలోకి దిగాను. బాగా డబ్బు సంపాదించాను. నా కొడుకుని బాగా చదివించాలని కాన్వెంట్లో ఇంగ్లీషు మీడియంలో చదివించాను. 

👉నేను అజ్ఞానంతో చేసిన పని, వాడికి అలవాటుగా మారిపోయింది, ఒకతరం వారి అజ్ఞానం ఆశబోతు తనం ఎన్ని తరాల్ని నాశనం చేస్తుందో? 

👉ఏమైతేనేమి పిల్లల బాల్యాన్ని దొంగలించాం” బాధగా అన్నాడు. నాకు ఆయన మాటల్లో ఈనాటి పిల్లల గురించి మరింత స్పష్టత నిచ్చింది. 

👉రేపటితరం మనుషులు-మనుషులుగా ఉండరేమోనని భయం వేసింది.🍁

కరోనా వచ్చాక పాత విధానాలే గొప్పవి అని మళ్ళీ గుర్తించారు

Wednesday, August 5, 2020

స్థలాలు లేదా ఇల్లు కొన్నప్పుడు లేదా అమ్మినప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు

స్థలాలు లేదా ఇల్లు కొని లేదా అమ్మినప్పుడు Brokers, Banks నమ్మకంగా మన పక్కనే ఉండే వాళ్ళు చేసే మోసాలు. చాలా మంది తెలియక మోసపోతూ ఉంటారు వారికోసం ఇది. ( కొంత మంది  మాత్రమే) 
ముందుగా Brokers చేసే మోసాలు గురించి తెలుసుకుందాం

1) Brokers స్థలం కొనేటప్పుడు తప్పుడు వివరాలు ఇస్తారు. 100% వాళ్ళ మాటలు నమ్మవద్దు. సంపాదించడం చేతకాని వాళ్ళు ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి సంపాదిస్తారు. ఎంగిలి మెతుకులు కోసం ఆశ పడే వారు ( కొంత మంది కి మాత్రమే)

 2) 2% broker commision తీసుకుంటారు. బేరం మాట్లాడేటప్పుడు ఎక్కువ brokers వస్తారు. మనలని రెచ్చ కొట్టి ఎక్కువ రేట్ కి కొనే విధముగా చేస్తారు. 

3)నిజ యజమానిని తీసుకురాకుండా నకిలీ వాళ్ళని తీసుకొచ్చి బేరం చేస్తారు.

4) ఆస్తి ఎవరి పేరు మీద ఉందొ తెలుసుకోవాలి అంటే registration office లో EC  తెస్తే తెలుస్తుంది. 300 అవుతుంది EC కి.

5) కొనే ముందు original #sale deed (Original document) లో ఉండే యజమాని photo చూడండి. అన్ని links documents history చూడాలి.

6) ఎట్టి పరిస్థితుల్లో Sale agreement ( contract) min 3months ఉండేలా చూడండి. మీ దగ్గర డబ్బు ఉన్న 3Months తక్కువ వెయ్యవద్దు. ఈరోజు ఏమి జరుగుతుందో తెలియదు. Agreement amount 5-10% కన్నా ఎక్కువ ఇవ్వవద్దు. Agrement cancel చేస్తే తిరిగి ఇవ్వకుండా బాగా తిప్పుకుంటారు.

7) మీ సొంత మనుషులు, మీ స్నేహితులు చెప్పే మాటలు నమ్మవద్దు. వల్లే commission కోసం కకృతి పడతారు.

8.) A, B brokers ఉన్నారు అనుకుందాం. A broker నీకు తెలుసు, వీడు B broker దగ్గరకి బేరం కోసం తీసుకొని వెళ్తాడు. యజమాని B broker కి agrement వేసాడు అని అబద్ధం చెపుతారు. స్థలం రేట్ 1Lakh అనుకుందాం, స్థలం యజమానికి తో ఈ brokers  1Lakh కన్నా ఎక్కువ వస్తే మేము తీసుకుంటాము అని deal చేసుకుంటారు. అప్పుడు B broker 1,10,000 కి కొనే వారి దగ్గర బేరం కుదుర్చుకుంటాడు. 

9) ఎట్టి పరిస్థితుల్లో బేరం మాట్లాడే తప్పుడు నిజమైన యజమానితోనే మాట్లాడండి. ఈ brokers యజమాని busy గా ఉన్నాడు, వేరే దేశాలలో ఉన్నాడు అని అబద్దాలు చెపుతారు. కనీసం video call లో ఇన మాట్లాడండి. యజమాని ఏదయినా ID proof చూపించమనాలి.

10) మీరు కొనే స్థలం , వాటి డాకుమెంట్స్ address నిజమో కాదో తెలుసుకోండి. ఎక్కడో ఉన్న స్థలం డాకుమెంట్స్ తో  మంచి area లో ఉన్న స్థలం చూపించి మోసం చేస్తారు. 
మీరు అనుకున్న స్థలం orginal స్థలాలు వేరుగా ఉంటాయి.

11) original స్థలం size, document స్థలం size లో తేడాలు ఉంటాయి.

 Documents required for Property
1) Main Owner Sale Deed document original, ఒరిజినల్ పేపర్స్ మీద stamp చూడాలి. 
2) All Linked Documents
3)  అన్ని డాకుమెంట్స్ లో కొనేవారు, అమ్మేవారు ఒక్కరు కాకపోతే అమ్మేవాడి Family tree certificate ( తండ్రి చనిపోతే పిల్లలు స్థలం ఆమ్మితె లేదా వరాసత్వముగా వచ్చే ఆస్తి ఐతే)
4) Documents front page లో ఏదయినా court seal, sign ఉంటే property మీద case ఉన్నది అని అర్థం.
5) EC - Encumbrance certificate (EC)
6) Mother deed certificate
7) RTC - Record of Rights, Tenancy and Crops (For Agriculture Land)
8.) Survey Sketch
9) Layout Approval
10) Katha Certificate
11) DC Conversion certificate ( agriculture to Non-Agriculture land conversion) 
12) Property Tax Certificate

13) SC, ST సోదరులకు ప్రభుత్వామ్ ఉచితముగా స్థలాలు ఇచ్చినది. అటువంటి స్థలాలు కొన్న మళ్ళీ వారికే వెళ్తాయి, రిజిస్ట్రేషన్ చెల్లదు.

14) పేద వారికి ప్రభుత్వామ్ ఉచితముగా స్థలాలు ఇచ్చినది, అటువంటి స్థలాలు కొనకూడదు.

14) apartments ఐతే plan approval, OC, CC ఉండాలి. 3Floors కి plan approval తీసుకొని 4 or 5 floors కడతారు. వాళ్ళు బ్యాంక్ వాడితో link పెట్టుకొని మీ లోన్ easy గా చేపిస్తారు resale అప్పుడు problem అవుతుంది.

15) మనతో మంచిగా నటిస్తూ మనం అనుకునే మాటలని brokers చెప్తూ commission తీసుకుంటారు. వాళ్ళతో జాగ్రత్త.

16) స్థలం కాగితాల copys ఎట్టి పరిస్థితులలో ఎవరికి ఇవ్వకండి. ఆ copy paper ఇతరుల దగ్గర ఉండటం వల్ల మనకి చెడు చేసే అవకాశం ఎక్కువ.

17) ఇల్లు కట్టి ఉంటే building Plan Approval ఉండాలి.

18)Agrement రోజు, Registration ముందు రోజు  EC తీయండి. కొంత మంది వేరే వాళ్ళకి అమ్మి మన దగ్గర Agrement వేస్తారు. EC లో స్థల యజమాని ఎవరో , ఎప్పుడు కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు ఉంటాయి.

19) ఆ ల్యాండ్ పైన ఎమైనా విద్యుత్ lines ఉన్నాయా, ల్యాండ్ క్రింద ఎమైనా 
underground drainage ఉన్నదా. 
Land govt ప్రజా అవసరాలకు తీసుకుంటున్న కోనకూడదు.

20) ఇప్పుడు Online Registration process ఉన్నది. 15Years back online లేదు ఆ time లో ఒకే property ని ఎక్కువ మంది పేరుతో రిజిస్టర్ చేశారు మోసం చేసి.

 21) మీరే నెను కింద ఇచ్చిన గవర్నమెంట్ వెబ్ సైట్ లో స్వయంగా మీరే చూసి తెలుసుకోండి. మీరు కోనాలనుకున్న, లేదా కోనుకున్న స్థలం, ప్లాట్ భూమి ఎదైనా కావచ్చు. దానికి సంబంధిత ఈసి, అది ప్రబుత్వ స్థలమా పోరంబోకు స్థలమా పట్టా ఉన్న స్థలమా అనేవి ఇందులో పోందుపరచిఉంటాయి. మీ ప్లాట్, భూమి కి సంబంధిత రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోవచ్చు లింక్ డాక్యుమెంట్స్ తో సహా. మీ ప్లాట్ కోలతలు హద్దులు ఎవరి నుంచి ఎవరికి హక్కుగా సంక్రమించింది తదితర వివరాలు ప్రింటుతో సహా ఉచితంగా తిసుకోవచ్చు. మీరుకోనే భూమి, ప్లాట్ రిజిస్ట్రేషన్ విలువ ఎంత తదితర వివరాలకు సైతం ఈ వెబ్ సైట్ చాలా చాలా ఉపయోగం. మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధిత రిజిస్ట్రేషన్ సైట్స్.

http://registration.ap.gov.in/

http://registration.telangana.gov.in/
.
.
.
.

 Loan తీసుకొనేఅప్పుడు బ్యాంక్ వాళ్ళు చేసే మోసాలు

1) ఎట్టి పరిస్థితుల్లోనూ Broker లేదా  యజమాని Refer చేసిన బ్యాంక్ లో Loan తీసుకోవద్దు. వాళ్ళు బ్యాంక్ వాడికి కమిషన్ ఇచ్చి వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉన్నది. Agrement time period లో మీకు loan sanction కాకుండా చేసి agreement డబ్బులు brokers, bank, owner పంచుకుంటారు.

2) బ్యాంక్ Loan రావాలి అంటే పైన చెప్పిన documents compulsary ఉండాలి. అవి లేకుండా బ్యాంక్ loan ఇవ్వదు. 

3) బ్యాంక్ loan 70% నుంచి 80% వరకు ఇస్తారు. అది కూడా మీరు Registration Document లో చూపించిన Property value లో. Property government value 5Lak అనుకోండి. Actual market price 30Lak అనుకోండి. మీకు loan 15Lak కావాలి అనుకోండి. అప్పుడు మీరు registration document లో 20L చూపించి Register చేసుకోవాలి. మీకు 20L లో 75% అంటే 15L బ్యాంక్ లోన్ ఇష్టది. 

4) మీరు 20Lks registration document లో చూపిస్తే మీకు registration charges పెరుగుతాయి. స్థల యజమానికి TAX పడుతుంది. INDEX based Tax యజమాని Govt కి కట్టాలి.  అందువల్ల యజమాని ఒప్పుకొడు.

5) బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు processing fee ఉంటది min 10,000. 1.5%  loan amount లో Insurance తీసుకోవాలి . కొన్ని Banks (DHFL)  5% కన్నా ఎక్కువ insurance charge చేస్తాయి మనకి తెలియకుండా Enable చేస్తారు. Mortage(తాకట్టు) registration బదులు 0.3% value లో Revenue stamp మీద లోన్ agrement వేస్తే సరిపోతుంది.

6) Registration అప్పుడు Bank agent వచ్చి check యజమానికి ఇచ్చి, అన్ని Original documents తీసుకొనిపోతారు. అందువల్ల వాటి zerox తీసుకోండి.

7) పైన చెప్పిన process బ్యాంక్ లో చేసేది. అవి అవసరం లేదు మేము Loan ఇప్పిస్తాము , Sale agreement వేసుకొండి అని బ్యాంక్స్ చెపుతాను. 1Week లో Loan process complete అవుతుంది అని చెపుతారు.  Agreement వేసుకొని వెళ్లిన తరువాత చుక్కలు చూపిస్తారు. 

8) బ్యాంక్ లోన్ process min 20days పడుతుంది. బ్యాంక్ వెదవలు ( కొంత మందికి మాత్రమే) చెప్పే మాటలు నమ్మి  sale agrement తక్కువ రోజుల్లో వేసుకోవద్దు. Min 3months agreement వేసుకోవాలి.

9) personalLoan తీసుకుంటే Processing fee ఉంటది, Insurance optional.  ముందే Insurance వద్దు అని చెప్పాలి.

10) బ్యాంక్ Loan కి రెండు రకాల వడ్డీలు ఉంటాయి fixed, variable. Fixed interest ఐతే future లో వడ్డీ rates మారవు. Variable interest ఐతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వడ్డీ rates మారుస్తూ ఉంటారు.

11) pre Closing charges, pre Closing ఎన్ని నెలలు తరువాత చెయ్య వచ్చు. Parshial closing charges వంటి వివరాలు తెలుసుకోవాలి.

12) బ్యాంక్ వాళ్లు చెప్పిన ప్రతి మాటని record చేసుకోండి. వాడు చెప్పిన దానిని official mail నుంచి మీ mail కి పంపమని చెప్పండి.

13) ఇప్పుడు కొంత మంది Bank వాళ్లే పెద్ద దొంగలు, వారితో జాగ్రత్త

14) బ్యాంక్ EMI లో  .. వడ్డీ + అసలు . ఉండాలి. కొన్ని దొంగ బ్యాంక్స్ వడ్డీ మాత్రమే తీసుకుంటాయి. Principle మనం బ్యాంక్ కి వెళ్లి కట్టాలి. దొంగ rules ఇవి.

15) Land కొంటె Income Tax Exception క్రింద రాదు. 


డైరీ ఫార్మ్ కొత్తగా పెట్టాలనుకునే వారికి కొన్ని సలహాలు.

డైరీ ఫార్మ్ కొత్తగా పెట్టాలనుకునే వారికి మేము కొన్ని సలహాలు. 
మీరు సమయం కేటాయించకుండా ఫలితం రాదు. 

1. సొంతంగా భూమి ఉండాలి ఒకవేళ లేనిచో భూమి కౌలు కి తీసుకొని చేయాలనుకుంటే తక్కువ కౌలు ధర లో చూసుకోవాలి.

2. సంవత్సరం మొత్తం నీళ్ల సౌకర్యం ఖచ్చితంగా ఉండాలి.

3. పచ్చ గడ్డి మొత్తం మనమే పండించుకోవాలి.

4. పచ్చ గడ్డి లో పప్పు జాతి మరియు గడ్డి జాతి రెండు పెంచుకోవాలి. అధిక పాల ఉత్త్పత్తి కి ఇది దోహదపడుతుంది. గడ్డి జాతి లో సూపర్ నేపియర్ మరియు పప్పు జాతి లో దశరథ గడ్డి ఉండేలాగా చూసుకోండి.

5. షెడ్ పై ఖర్చు తక్కువ పెట్టి మంచి నాణ్యమైన పశువుల పై డబ్బు ఖర్చు చేయాలి.

6. షెడ్ నిర్మాణంలో పైకప్పు కంటే ఫ్లోర్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి.

7. మీరు ఎంచుకొనే జాతి (గేదెలు లేదా ఆవులు) పై పూర్తి అవగాహన ఉండాలి.

8. పశువులు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఏమేమి అవసరం ఉంటాయో అన్నింటి పై అవగాహన ఉండాలి.

9. పశువులకు ప్రాథమిక చికిత్స తెలిసి ఉండాలి.

10. పశువుల ని కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. మంచి అనుభవం ఉన్నవాళ్ళని తీసుకెళ్లాలి.

11. పాల కి మార్కెట్ లేకుండా దేశి ఆవు జోలికి వెళ్ళకూడదు

12. మీరు సంవత్సరం మొత్తం లో ప్రతి రోజు పాల ఉత్పత్తి ఒకేవిధంగ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి

13. మీ పాలు మొత్తం మీరే మార్కెట్ చేసుకోవాలి

14. మీ ఏరియా లో పాలకు సరైన ధర లేకపోతే పాల ఉత్పత్తుల పై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు నెయ్యి, పనీర్, బట్టర్, బట్టర్ మిల్క్ మొదలగునవి. ఇంకా చాలా ఉంటాయి
15. పాల కి మార్కెట్ లేకపోతే పాల సెంటర్ కి పోయాలి అనుకుంటే HF క్రాస్ బ్రీడ్ లేదా Jersey క్రాస్ బ్రీడ్ ఎంచుకోవాలి. ఫారిన్ బ్లడ్ 60 to 70% ఉండేలా చూసుకుంటే మన ప్రాంతం కి సెట్ అవుతాయి. ఈ జాతులలో ప్యూర్ బ్లడ్ కి అనుభవం లేకుండా వెళ్ళకూడదు.

16. మీ ఏరియాలో మంచి సెమెన్ ఎక్కడ దొరుకుతదో కనుక్కోవాలి లేదా ఒక మంచి జాతి లక్షణాలున్న దున్నపోతు లేదా ఆంబోతు ని పోషించాలి.

17. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక పశువు నుండి ఒక దూడ వచ్చేలా చూసుకోవాలి.

18. పశువు ఈనిన మూడు నుంచి నాలుగు నెలల లోపు మల్లి తిరిగి కట్టించాలి.

19. ప్రతి ఆడ దూడ ని తిరిగి పాలిచ్చే పాడి పశువుల తయారు చేసుకోవాలి.

20. దాణా ని మనమే తయారు చేసుకోవాలి.

21. సమీకృత దాణా కోసం మీ దగ్గరలో ఉన్న వెటర్నరీ డాక్టర్ ని సంప్రదించాలి
22. సమీకృత దాణా లో తగు పాళ్లల్లో పిండి పదార్థాలు(కార్బోహైడ్రేట్స్), మాంస కృత్తులు(ప్రోటీన్), పీచు పదార్థాలు(ఫైబర్), కాల్షియమ్, మినరల్ మిక్సర్ మరియు ఉప్పు ఉండేలా చూసుకోవాలి

23. దాణా ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అంటే అజోల్లా లాంటి వాటిని పెంచాలి.

24. బయో గ్యాస్ ప్లాంట్ పెట్టుకోవాలి. పని వారికి మరియు మీకు గ్యాస్ ఖర్చు తగ్గుతుంది.

25. పశువుల పేడ ని విడిగా అమ్మకుండా వర్మి కంపోస్టు తయారు చేసుకొని లేదా బయో గ్యాస్ నుండి వచ్చె slurry ని అమ్ముకుంటే ఎక్కువ లాభంగ ఉంటుంది

Tuesday, August 4, 2020

నువ్వులు - ఖర్జూరలతో కమ్మని లడ్డు

నువ్వులు - ఖర్జూరలతో కమ్మని లడ్డు

కిలో ఖర్జూరపండ్లను గింజతీసి పెట్టుకోవాలి!
కిలో నువ్వులను దోరగా వేయించి పెట్టుకోవాలి!
ముందుగా ఖర్జూరపండ్లను ,గుప్పెడు గుప్పెడు  రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి.గుజ్జును విడిగా పెట్టుకోవాలి. తరువాత నువ్వులను కూడా మెత్తగా రోకలితో దంచుకోవాలి.తరువాత రెండింటినీ కలిపి బాగా కలిసేలా దంచుకోవాలి. తరువాత ముద్దలు కట్టుకోవాలి! రెండు కిలోల ప్రమాణానికి, ముప్పయి ముద్దలు అవుతాయి! అంతా కలిపి గంట పని!
కిలో ఖర్జూర, వంద రూపాయలు.
కిలో నువ్వులు, వంద రూపాయలు!
(మొన్న మార్కెట్ ధరలు)

ముప్పయి లడ్డూలంటే,ఒకరికి రోజుకు ఒకటి చొప్పున నెల రోజులకు సరిపోతాయి!
నెలకు రెండు వందల రూపాయల ఖర్చు!

***
నువ్వుల్లో ఏముంటాయే చూద్దాం!

నువ్వులు, జీర్ణశక్తిని పెంచుతాయి.
రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
కేన్సర్ నిరోధకంగా పని చేసే ఫైటిక్ యాసిడ్ - మెగ్నీషియం ఫైటో స్టెరాల్స్ కూడా నువ్వుల్లో ఎక్కువ ఉంటాయి. శరీరవ్యవస్ధను నిదానింపచేసే ధయామిన్ -ట్రిప్టోఫాన్ విటమిన్లు ఉంటాయి.
ఒంటినోప్పుల్ని తగ్గించి, మనసును ఉత్తేజితం చేసి గాఢ నిద్రకు దోహదం చేసే సెరొటోనిన్ కూడా నువ్వుల్లో ఎక్కువే ఉంటుంది.
నువ్వులు ఎముకలను పటిష్ఠపరుస్తాయి.తద్వారా ఎముకలను గుళ్లబార్చే ఆస్టియోఫోరోసిస్ వ్యాధి రాకుండా కాపాడతాయి.
***

ఖర్జూరాల వల్ల ఉపయోగాలు!

ఖర్జూరాలను ప్రొటీన్ పవర్ హౌజులు అంటారు!
ఖర్జూరాలలో అధికమోతాదులలో కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి.
ఖర్జూరాలను తినడం వల్ల, కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు దూరం అవుతాయి!
ఖర్జూరాలు రక్తపోటును నియంత్రిస్తాయి!ఎముకల పటిష్ఠతకు ఉపయోగ పడతాయి!
ఉదర సంబంధ వ్యాధులకు ఈ పండ్లు ఉపయోగ పడతాయి!
అన్ని రకాల పండ్లలో కంటే,ఖర్జూరాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది.కనుక మలబద్ధకానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది!
***

వృద్ధులకు పిల్లలకు అమృతాహారం, నువ్వులు-ఖర్జూరలడ్డు! వారికి ప్రతిరోజు ఒక లడ్డు ఇవ్వాలి. స్కూలు ఫంక్షన్లలో పిల్లలకు ఆయిల్ స్వీట్స్ కంటే, నువ్వులు-ఖర్జూరలడ్డును చేయించి ఇవ్వచ్చు!
ఇందులో ఎండుకొబ్బెరి జీడిపప్పు వేరుశెనగ , వేయించి పొడికొట్టిన తృణధాన్యాలు (రాగులు సజ్జలు రొన్నలు గోధుమలు)వేయించి పొడుకొట్టిన పప్పుధాన్యాలు(మినుములు పెసలు శెనగలు కందులు) వంటివి కూడా చేర్చుకుని మరింత బలవర్ధక లడ్డును, సంపూర్ణ ఆరోగ్యకర లడ్డును చేసుకోవచ్చు. సువాసన కోసం, యాలకుల పొడిని కలపొచ్చు. ముద్ద కట్టేపుడు సరిగా ముద్దకు రాకపోతే తగినంత తేనె కలిపి ముద్దలు చేసుకోవచ్చు.
అన్ని రకాల ఎండు పండ్లను కూడా ఇందులో చేర్చుకోవచ్చు! మిగతా పదార్దాలకు సమానంగా, అన్నిరకాల ఎండుపండ్లను ఉండేట్టు చూసుకోవాలి.

***
నువ్వులు-ఖర్జూరలడ్డులో నూనె చక్కెర కలపనక్కరలేదు!
నీరు కలపాల్సిన అవసరం లేదు!
పదార్ధాలను ఉడికించాల్సిన అవసరం లేదు.
పదార్ధాల్లోని జీవపదార్ధం,సజీవంగా మన శరీరానికి అందుతుంది.
ఎక్కువ కాలం నిలవ ఉంటాయి.
***

నువ్వులు - ఖర్జూరలడ్డు  నిజమైన అమృతాహారం!

తెలివిగా వ్యవసాయము చెయ్యాలి ఇక నుండైన

తెలివిగా వ్యవసాయము చెయ్యాలి ఇక నుండైన
లాభసాటి సాగుకు మార్గాలెన్నో...
రైతుల ఆలోచనా ధోరణి మారాలి
లాభసాటి సాగు పద్ధతులపై విస్తృత అవగాహన లోపించడంతో రైతుల్ని నష్టభయం వెంటాడుతోంది. 85శాతం చిన్న, సన్నకారు రైతులున్న దేశంలో పంటలసాగు వారికి ఆశావహంగా కనిపించడం లేదు. అవకాశాలు కళ్లముందే ఉన్నా, వాటిని అందిపుచ్చుకోవడంలో వైఫల్యమే అసలు సమస్య. నిరక్షరాస్యులు అధికంగా ఉండటం వల్ల సేద్యం దండగమారి వ్యాపకంగా ముద్రపడుతోంది. సాంకేతిక అవకాశాల గురించి విస్తరణ యంత్రాంగం అవగాహన కల్పించగలిగితే రైతులకు భరోసా ఏర్పడుతుంది. వాణిజ్య సరళిలో సాగు చేపట్టడం ద్వారా లాభసాటి ధరలు పొంది స్థిరమైన ఆదాయాలు దక్కించుకునే అవకాశముంది.

వ్యాపార దృక్పథం అవసరం - కాలం మారుతుంది
స్వాతంత్య్రానంతరం సాగుకు దశ దిశ కల్పించలేకపోవడం పాలకుల తప్పయితే, సాగుతప్ప మరో వ్యాపకం ఎరుగని రైతుల తీరుతో ఆ రంగంపై ఆధారపడినవారి భవిత అగమ్యగోచరమవుతోంది. పరిశీలన, చొరవ లోపిస్తుండటంతో అధిక శాతం రైతులు మూస పద్ధతికి అలవాటుపడ్డారు. వైవిధ్యాన్ని, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, ఆదాయ మార్గాలను పెంచుకునేలా పంటల సరళి మార్పు చేసుకోవడం రైతుల్లో లోపిస్తోంది. కాస్త నీరుంటే చాలు వరి తప్ప మరో ఆలోచన చేయని రైతుల సంఖ్య అత్యధికం. వారి ఆలోచనా దృక్పథం మారాలి. రైతులు వ్యాపారుల్లా మారాలి. పండించే పంటకు ఏయే నెలల్లో మంచి ధరలు వస్తున్నాయో పరిశీలించాలి. ఉదాహరణకు జూన్‌, జులై నెలల్లో సరఫరా తగ్గి కూరగాయల ధరలు మండిపోతుంటాయి. కృత్రిమ కొరత అంశాన్ని పక్కనపెడితే- ఇలాంటి సందర్భాలను పసిగట్టి, ఆ సమయంలో పంట చేతికందేలా చూసుకోవాలి. మార్కెట్‌ గిరాకీకి తగ్గట్లు మార్పు ఉండాలి. ఊరంతా ఒకే పంట వేసే బదులు సమీప మార్కెట్లను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. అర ఎకరంలోనే ఇంటికి కావలసినవన్నీ పండించే ‘అన్నపూర్ణ పద్ధతి’ని ఆచరించి చూపిన పార్వతీపురం జట్టు ట్రస్టు విజయగాథ మనకు తెలిసిందే. పండించే రైతుకు పాలు, ధాన్యం, పప్పులు, కాయగూరలను మార్కెట్లో కొనే పరిస్థితి రాకూడదు. ఎకరా రెండెకరాల్లో చీకూచింతా లేకుండా సేద్యం సాగించే పద్ధతులను ఆచరించాలి. అందుకు ఎన్నో నమూనా పద్ధతులు ఉన్నాయి. వీటిపై రైతులు, రైతుబిడ్డలు స్వయంగా అవగాహన ఏర్పరచుకోవాలి.
సాగు కోసం తెచ్చిన రుణాలను వెంటనే తీర్చేయాలనే ఆత్రుతలో చిన్న రైతులు ఉంటారు. సంస్థాగత రుణాలు అందరికీ అందవు కాబట్టి అధిక వడ్డీల భారం పడకుండా కల్లాలలోనే పంటను అమ్మేస్తుండటం పరిపాటి అయింది. వారికి సంస్థాగత రుణాలు అందించగలిగితే ఈ దుస్థితి తప్పుతుంది. ధర లేనప్పుడు ఉత్పత్తిని నిల్వ చేసుకుని సమయం వచ్చేదాకా ఆగే అవకాశం రైతుకు ఉంటుంది. రుణ సమస్యలు లేనివారు మంచి ధర పొందేందుకు యత్నిస్తున్నారు. అలానే గ్రామం దాటి పంట తరలించే పరిస్థితులు మెరుగుపడాలి. ఒక ఉత్పత్తికి ఇతర విపణుల్లో ఉన్న ధరలు నేడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. వాటి ఆధారంగా పంట తరలింపుతో మెరుగైన ధరలు పొందే వీలుంది. ప్రభుత్వమూ ఆయాప్రాంతాల్లో ఆహారశుద్ధి రంగాన్ని విస్తరిస్తే ఉత్పత్తులకు మార్కెట్‌ సమస్యలు తీరి, స్థిరమైన ఆదాయాలు అందుతాయి. సేంద్రియ సేద్య విధానాలను అనుసరిస్తే కాలనీ, గేటెడ్‌కమ్యూనిటీ సంఘాల వారి ఆదరణా పొందవచ్ఛు కరోనా ప్రభావంతో ప్రజల ఆలోచనా ధోరణుల్లో వచ్చిన సానుకూల మార్పుల దృష్ట్యా రసాయనాలు లేని ఆహారోత్పత్తుల సాధనకు ఉపక్రమించాలి. దీనివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. రైతులూ లాభపడతారు. సేంద్రియ ఉత్పత్తులు విక్రయించే దుకాణాలు, సూపర్‌ మార్కెట్లను సంప్రతించి వారితో ఒప్పందాలు చేసుకుంటే మద్దతు ధర కంటే మంచి ధర లభిస్తుంది. సేంద్రియ సేద్యం వల్ల భూసారం పెరిగి నాణ్యమైన దిగుబడులూ అందుతాయి. పర్యావరణ పరిరక్షణా సాకారమవుతుంది. సేద్యం గురించి ఓనమాలు తెలియని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఉద్యోగాలు మానేసి వినూత్న రీతిలో వ్యవసాయ వాణిజ్యాన్ని కొత్తపుంతలు తొక్కిస్తుంటే- అన్నీ తెలిసిన రైతులు చిన్నపాటి చొరవ చూపితే మంచి ఫలితాలు వస్తాయని గ్రహించాలి.

నైపుణ్యాల సాధనతో... కొత్త ప్రయత్నలు
మార్కెట్‌ నైపుణ్యాల సాధన, మిశ్రమ పంటల సాగు, పంటల సరళిలో మార్పులు తదితర ఆలోచనలు రైతుకు మంచి ఫలితాలను అందిస్తాయి. శాస్త్రీయంగా తరచూ పంట మార్పిడి చేపట్టాలి. సీజన్ల విరామ సమయంలో స్వల్పకాల దిగుబడులిచ్చే కూరగాయ పంటలు సాగు చేయాలి. ఖర్చు తగ్గించుకుంటూ నికరాదాయం పెంచుకునే ఆలోచనలు అవసరం. నాణ్యమైన పంట, విలువు జోడింపు, మెరుగైన ధర తరహా ఆలోచనలు సాగాలి. రోజులు మారుతున్నాయి. సమీప వ్యవసాయ పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలను సంప్రతిస్తే మెరుగైన సాగు పద్ధతుల గురించి అవగాహన కల్పిస్తారు. అధిక దిగుబడినిచ్చే వంగడాలు, సమగ్ర సస్యరక్షణ, సమగ్ర పోషక యాజమాన్యం తదితరాల గురించి రైతులు తెలుసుకోవచ్ఛు మేలు రకం వంగడాలు, పంట నాణ్యత, అత్యాధునిక సాగు పద్ధతులు, సాంకేతిక మెలకువల గురించి అవగాహన పెంచుకోవచ్ఛు ప్రభుత్వమూ సాగుదారులందరికీ రుణాలు అందించాలి. మార్కెట్లలో మౌలిక వసతులు పెంచాలి. ఉత్పాదకత పెంచేలా విస్తరణ సేవలు పెంపొందించాలి. కూలీల సమస్యను అధిగమించేందుకు మహిళా సంఘాలకు యంత్రాలు, పనిముట్లను ప్రతి గ్రామంలో అందుబాటులో ఉంచాలి. రైతుకు ఆదాయ భద్రత కల్పించాలి. రైతుల చొరవ, ప్రభుత్వ చేయూత, అవగాహన పెంచేలా యంత్రాంగం కృషిచేస్తే నైపుణ్యాలను అందిపుచ్చుకొని రైతులు సేద్యాన్ని లాభసాటిగా మార్చుకోగలుగుతారు!

అధిక ధరకు వ్యూహాలు కొత్త దారులు

పంటను అదే రూపంలో అమ్మితే వచ్చేది మద్దతు ధరే. విలువ జోడించడం లేదా నేరుగా వినియోగదారులకు విక్రయించే ఆలోచన చేయగలిగేలా రైతుల్లోని నైపుణ్యాలకు పదును పెట్టాలి. అపార్టుమెంట్లు, కాలనీలు, గేటెడ్‌కమ్యూనిటీ సంఘాలు కూడా ఈ దిశగా ఆలోచించాలి. కుటుంబాలకు కావలసిన ధాన్యం, పూలు, పండ్లు, పప్పులను సరఫరా చేసే బాధ్యతను రైతులకే అప్పగించాలి. పెద్ద పట్టణాలకు సమీపంలోని రైతులూ వీరిని కలిసి తమ పంటకు విలువ చేకూర్చి వారికి సరఫరా చేయాలి. ఉదాహరణకు రైతులు సాంబమసూరి/ సోనా/తెలంగాణ సోనా బియ్యం తింటారనుకుంటే రైతులు తమ పంటను మరపట్టించి ఈ సంఘాలకు సరఫరా చేయాలి. ధాన్యాన్ని బియ్యంగా మార్చి సరఫరా చేస్తే వ్యాపారులకు దక్కే కమిషన్‌ మిగిలి, వినియోగదారులు, రైతుకు లాభసాటిగా ఉంటుంది. ఇలా ఎక్కడికక్కడ స్థానికంగా పండించే అన్ని రకాల పండ్లు, కూరగాయలను వినియోగదారులకు నేరుగా సరఫరా చేసేందుకు రైతులు మరికొంత చొరవ చూపితే చక్కని ఫలితాలు అందివస్తాయని గ్రహించాలి. మైసూరు తదితర ప్రాంతాల్లో రైతులు ఏటా ఆరేడు స్వల్పకాలిక పంటలు తీస్తున్నారు. వర్షాధార భూముల్లో నేలను విభజించుకుని ఒక పంట మార్కెట్‌కు వెళ్లే సమయంలో మరో పంట పూత దశలో ఇంకోటి నాటే దశలో ఉండేలా ఏడాది పొడవునా ఆదాయం పొందడంలో వారు సఫలమయ్యారు.

Monday, August 3, 2020

నింగిని తాకిన ఇడ్లీ సాంబార్ విలువ 600 కోట్లు

నింగిని తాకిన ఇడ్లీ సాంబార్

జీవితంలో అన్నింటా ఓడిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుందామని ఓ బహుళ అంతస్తుల భవనం ఎక్కాడు. 26వ అంతస్తు నుండి దూకడానికి సిద్ధమైన అతనికి ఎదురుగా మరో భవనంపై వేలాడుతూ ఓ వ్యక్తి భవనానికి రంగులు వేయడం కనిపించింది. అతనికి జీవితం ప్రతి రోజు రిస్కే. రిస్కునే జీవితంగా గడుపుతున్నప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం పిరికితనమే, జీవితం జీవించడానికే అని గ్రహించి, తన ఎదుగుదలకు కృషి చేశాడు. స్టార్ హోటల్స్ నిర్మించాడు. అంతర్జాతీయ అవార్డులు సాధించాడు. ఇది సినిమా కథ కాదు.. విజయం సాధించిన ఒక వ్యక్తి జీవితం.

కామత్ హోటల్ పేరు విన్నదే కదా? ఆ హోటల్‌లో పదార్థాలు నాలుకపై కలిగించే ప్రభావం కన్నా ఆ హోటల్ యజమాని జీవిత కథ మనసుపై చూపించే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆత్మహత్య చేసుకుందామనుకున్న స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి హోటల్ నిర్మించే స్థాయికి ఎదిగిన వ్యక్తి విఠల్ వెంకటేష్ కామత్. 
భార‌తీయ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబంలోంచి వ‌చ్చిన కామ‌త్ ఇపుడు ప్ర‌పంచంలోనే గ‌ర్వించ‌ద‌గిన హోట‌ల్స్ య‌జ‌మానిగా చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని స్వంతం చేసుకున్నారు. ఇదో ప్ర‌పంచ రికార్డు. ఒకప్పుడు డ‌బ్బుల కోసం నానా ఇబ్బందులు ప‌డిన కామ‌త్ కుటుంబం ఇపుడు వేలాది మందికి ప్ర‌త్య‌క్షంగా..ప‌రోక్షంగా ఉపాధి చూపిస్తోంది. కోట్లాది రూపాయ‌లు రోజూ హోట‌ల్స్ ద్వారా స‌మ‌కూరుతున్నాయి. కొన్నేళ్లు గ‌డిచినా ఎలాంటి మార్పులు లేవు. క‌ష్ట‌మ‌ర్ల అభిరుచుల‌కు అనుగుణంగా హోట‌ల్స్‌ను ఏర్పాటు చేసుకుంటూ పోయారే త‌ప్పా ..నాణ్య‌త విష‌యంలో..సేవ‌లు అందించ‌డంలో కించిత్ తేడా క‌నిపించకుండా కాపాడుకుంటూ వ‌స్తోంది కామ‌త్ హోట‌ల్స్ యాజ‌మాన్యం. ఒక‌ప్పుడు చిన్న వీధి సందులో ఏర్పాటైన కామ‌త్ హోట‌ల్ ఇపుడు ప్ర‌పంచవ్యాప్తంగా విస్త‌రించింది. త‌న బ్రాండ్‌ను కాపాడుకుంటూ వ‌స్తోంది. డ‌బ్బున్న వాళ్లు గొప్ప వాళ్లు అనుకునే స్థాయికి దిగ‌జారిన మ‌న‌కు విఠ‌ల్ కామ‌త్ క‌ళ్లు తెరిపించారు.
భార‌తీయుల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా.. సంస్కృతి సాంప్ర‌దాయాల‌ను ప‌రిర‌క్షిస్తూ కామ‌త్ హోట‌ల్స్ న‌డుస్తున్నాయి. ఇది ఒక ర‌కంగా పాఠంగా నేర్చుకోవాల్సిన అవ‌స‌రం వున్న‌ది. కాలే క‌డుపుల‌తో ..ప‌స్తులు ఉంటూ ఇడ్లి త‌యారీతో ప్రారంభ‌మైన కామ‌త్ ప్ర‌తి న‌గ‌రానికి విస్త‌రించింది. కామ‌త్‌లో టిఫిన్ల‌తో పాటు రుచిక‌ర‌మైన భోజ‌నాల‌ను వ‌డ్డిస్తారు. ఇండియ‌న్స్ తో పాటు ఇత‌ర దేశాల‌కు చెందిన వారంతా కామ‌త్ హోట‌ల్స్ కు రావ‌డం ప‌రిపాటిగా మారింది. ఇప్ప‌టికీ ఇడ్లి, సాంబారు, చెట్నీ ఈ మూడు కామ‌త్ కు పెట్టింది పేరు. ఏ దేశానికి వెళ్లినా కామ‌త్ హోట‌ల్ వుందా అని అడ‌గ‌టం మామూలే. అంత‌లా పాపుల‌ర్ అయ్యిందీ ఈ హోట‌ల్.

కామ‌త్ కుటుంబం ప్ర‌తి రోజు త‌ప్ప‌కుండా వారి హోట‌ల్స్ ల‌లో త‌యార‌య్యే ప్ర‌తి వంట‌కాన్ని రుచి చూస్తారు. ఏ మాత్రం రుచిలో..నాణ్య‌త‌లో తేడా వ‌చ్చినా వారు స‌హించ‌రు. డ‌బ్బుల కంటే రుచికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తారు. ఆయా హోట‌ళ్ల‌లో ప‌నిచేసే ప్ర‌తి ఒక్క‌రికి ప్ర‌త్యేకంగా డ్రెస్ కోడ్ ఉంటుంది. ఇందులో ప‌నిచేసిన వారిని త‌మ ఇంటి వారికంటే ఎక్కువ‌గా చూసుకుంటారు. ప్ర‌భుత్వ స‌ర్వీసుల‌లో ప‌నిచేసే వారికి ఎలాంటి సౌల‌భ్యాలు వున్నాయో ఇక్క‌డ ప‌నిచేసే వారి ప‌ట్ల అంతే ర‌కంగా చూస్తారు. జీతాల‌తో పాటు ఇత‌ర సౌక‌ర్యాలు క‌ల్పిస్తారు. దీంతో కామ‌త్ లో ప‌నిచేయ‌డం అంటే ప్ర‌తి ఒక్క‌రు గౌర‌వంగా భావిస్తారు. ఒక‌ప్పుడు హోట‌ల్స్ అంటే పూట‌కూళ్లుగా భావించే వారు. ఇపుడు సీన్ మారింది. ఫ్ల‌యిట్ ఎక్కినా..కోట్లు సంపాదించినా..ఎవ్వ‌రైనా స‌రే ..ఎక్క‌డ వున్నా..ఎంత దూరంలో వున్నా ..స‌రే తినేందుకు అక్క‌డికి ప‌రుగులు తీస్తున్నారు. డ‌బ్బులు ఎంతైనా చెల్లించేందుకు వెనుకాడ‌టం లేదు.

డాక్ట‌ర్ విఠ‌ల్ కామ‌త్ కు 54 ఏళ్లు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మ‌న్ గా..మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా కామ‌త్ హోట‌ల్స్ గ్రూపున‌కు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇండియాలో ఎన్నో హోట‌ల్స్ త‌మ‌కు పోటీగా ఉన్నా ..కామ‌త్ మాత్రం త‌న స్థానాన్ని కోల్పోలేదు. ముంబై కేంద్రంగా న‌డుస్తున్న ఈ సంస్థను ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రించేలా చేశారు కామ‌త్. 112 కోట్ల ఆదాయం కేవ‌లం ఈ హోట‌ల్స్ ద్వారా స‌మ‌కూరుతోంది. చిల్లి గ‌వ్వ లేకుండానే ..కేవ‌లం భార్య పుస్తెల‌తాడును అమ్మి ప్రారంభించిన కామ‌త్ ఇవాళ వ‌ర‌ల్డ్‌లోనే టాప్ టెన్ హోట‌ల్స్‌లో ఒక‌టిగా పేరు తెచ్చుకుంది. ఎలాంటి పైర‌వీలు..ఇంకెలాంటి సిఫార‌సులు లేకుండానే కామ‌త్ అగ్ర స్థానానికి ఎగ‌బాకింది. కామ‌త్ జీవిత‌మే ఓ సందేశంగా భావించ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం ఏకంగా 22 రాష్ట్రాల‌లో పిల్ల‌లకు స్ఫూర్తిదాయ‌కంగా ఉంటుందనే ఉద్ధేశంతో నాన్ డిటైల్డ్ పుస్త‌కంగా పంపిణీ చేశారు. ఇది కూడా ఓ చ‌రిత్రే. ఒక సామాన్య‌మైన వ్య‌క్తి కోట్లాది రూపాయ‌ల హోట‌ల్స్ కు అధిప‌తి కావ‌డం విశేష‌మే. 

ఎంద‌రో భార‌తీయులు ..ఎన్నో విజ‌యాలు స్వంతం చేసుకున్నారు. కానీ విఠ‌ల్ కామ‌త్ ది మాత్రం ప్ర‌త్యేక‌మైన క‌న్నీటి క‌థ‌. మ‌న‌క‌ళ్ల ముందే జ‌రిగిన గాథ‌. విఠ‌ల్ కామ‌త్ హోట‌ల్స్ య‌జ‌మానే కాకుండా మెంటార్‌గా, ఆంట్ర ప్రెన్యూర్‌గా, ట్రైన‌ర్ గా , స‌క్సెస్ ఫుల్ వ్యాపారవేత్త‌గా పేరు పొందారు. ఒకే ఒక్క గ‌దిలో ఉన్న కామ‌త్ ఇపుడు కోట్లాది రూపాయ‌లు క‌లిగిన భ‌వంతులు సంపాదించారు. అయినా త‌న మూలాలు మ‌రిచి పోలేదు. ఏ గ‌దిలో నుండి కామ‌త్ హోట‌ల్ ను ప్రారంభించారో అదే గ‌దిని అలాగే పెట్టుకున్నారు. అపురూపంగా చూసుకుంటున్నారు కామ‌త్. మొత్తం కామ‌త్ కుటుంబంలో ఎనిమిది మంది. ముగ్గురు అన్న‌ద‌మ్ములు, ముగ్గురు చెల్లెల్లు ..త‌ల్లిదండ్రులు. ఇంత మందితోనే ఆ ఒక్క గ‌దిలో నివ‌సించారు. ఆ జ్ఞాప‌కాలు ఇప్ప‌టికీ త‌న‌ను హెచ్చ‌రిస్తూనే వుంటాయంటారు కామ‌త్.

నేను పుట్టిన‌ప్పుడు మాకంటూ ఇల్లు వుండేది. మా నాయిన వెంకటేశ్ రెస్టారెంట్ న‌డిపించేవారు. ఎనిమిదేళ్ల వ‌య‌సులోనే మా తండ్రి ప‌నికి కుదిరాడు. క్ర‌మ‌శిక్ష‌ణ‌, నిబ‌ద్ధ‌త‌, స్వ‌యంశ‌క్తి ఇవ్వ‌న్నీ నాకు స్ఫూర్తి. మా అమ్మ ఆ రోజుల్లో ఇంత‌మందిని మ్యానేజ్ చేసేది. ప్ర‌తి ఒక్క‌రికి తానే వండి పెట్టేది. 1950లో మా నాయిన రెస్టారెంట్‌ను స్టార్ట్ చేశారు. వెంక‌టేశ్ కామ‌త్ ఈ పేరు కామ‌త్ హోట‌ల్స్ కు ప్రేర‌ణ‌. ఆయ‌న అందించిన ప్రోత్సాహ‌మే.. క‌ష్ట‌ప‌డ‌ట‌మే ఇవాళ ఈ స్థాయికి చేరేందుకు దోహ‌ద‌ప‌డిందంటారు విఠ‌ల్ కామ‌త్. త‌న‌కు పోటీగా ఉన్న ఒబేరాయ్ హోట‌ల్స్ య‌జ‌మాని ఒబేరాయ్ ను క‌లిసేందుక‌ని వెళ్లారు. సెక్యూరిటీ అడ్డు చెప్పారు. చివ‌ర‌కు ఒబేరాయ్‌తో క‌లిసాక ..ఎట్టి ప‌రిస్థితుల్లోను ఒబేరాయ్ కు పోటీగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు కామ‌త్.

ఏదో ఒక‌రోజు మీకంటే గొప్ప‌గా..మీతో పోటీ ప‌డేలా నా కామ‌త్ హోట‌ల్స్‌ను తీర్చిదిద్దుతాన‌ని ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేశారు. మోసానికి గురైనా..చేతిలో చిల్లి గ‌వ్వ‌లేక పోయినా..కామ‌త్‌ను నిల‌బెట్టారు. తండ్రిని పోగొట్టుకున్నా..కుటుంబాన్ని కోల్పోలేదు విఠ‌ల్ కామ‌త్. ఒబేరాయ్ అప్ప‌టికే ఇండియాలో ఫేమ‌స్ హోట‌ల్స్ కు అధినేత‌. ముంబ‌యిలో ప్ర‌ధాన స్థ‌లంలో పూర్తిగా పచ్చ‌ద‌నంతో..ప‌ర్యావ‌ర‌ణం ఉట్టి ప‌డేలా కామ‌త్ భారీ ఎత్తున ఆర్చిడ్ హోట‌ల్‌ను నిర్మించారు. ఈ హోట‌ల్ ప్రారంభోత్స‌వానికి మొద‌టి ఆహ్వాన ప‌త్రిక‌ను ఒబేరాయ్‌కు అంద‌జేశారు డాక్ట‌ర్ విఠ‌ల్ కామ‌త్. ఒక‌ప్పుడు త‌న‌కు సాయం చేయండి అంటూ వ‌చ్చిన ఈ కుర్రాడు..ఇపుడు ప్ర‌పంచంలోనే అత్యున్న‌త‌మైన హోట‌ల్‌కు అధిప‌తి అంటే న‌మ్మ‌లేక పోయారు ఒబేరాయ్.

నా జీవితంలో ఎంతో మందిని చూశాను.. క‌లిశాను..
కానీ విఠ‌ల్ నీలాంటి వ్య‌క్తి నాకు ఇంత‌వ‌ర‌కు తార‌స ప‌డ‌లేదు. నీ విజ‌యం కంటే నీకు నీమీదున్న న‌మ్మ‌కం గొప్ప‌ది. నేను మిమ్మ‌ల్ని ప్ర‌త్యేకంగా అభినందిస్తున్నానంటూ ఓ సుదీర్ఘ‌మైన లేఖ రాశారు ఒబేరాయ్. హోట‌ల్ ప‌రిశ్ర‌మ‌ల్లో దిగ్గ‌జాల స‌ర‌స‌న కామ‌త్ నిలిచింది. కామ‌త్ హోట‌ల్స్ ప్ర‌పంచ వ్యాప్తంగా 18 మిలియ‌న్ల ఆదాయాన్ని పొందాయి. ఈ విష‌యాన్ని కామ‌త్ బోర్డ్ ఆఫ్ మీటింగ్స్ లో ప్ర‌క‌టించారు. 

ఇదే కాకుండా ఆయన 60 లక్షలకు పైగా చెట్లను నాటారు. అటవీ సంరక్షణ కోసం 100 ఎకరాల కొండను ఔషధ మొక్కలుగా, చెట్లుగా మార్చారు. ముంబైలో మొట్టమొదటి సీతాకోకచిలుక ఉద్యానవనం మరియు ముంబై మరియు నావీ ముంబై అంతటా తోటలను నిర్మించిన ఘనత కూడా ఆయనది.

ఎంతో ఎత్తుకు ఎదిగిన విఠ‌ల్ కామ‌త్ సాధించిన ఈ విజ‌యం కోట్లాది భార‌తీయుల‌కే కాదు ప్ర‌పంచానికి కూడా ఒక పాఠంగా మిగిలారు. కామ‌త్ జీ ..జీతే ర‌హో..కామ‌త్ మీ ఒక్క‌రిదే కాదు..కోట్లాది భార‌తీయుల కుటుంబానికి చెందింది..కాదంటారా..!

- విజయకుమార్ 
------------------------------------------------------------------

కామత్ ఆత్మకథను యండమూరి వీరేంద్రనాథ్  తెలుగులో అనువదించారు. అతి కొన్ని ఆత్మకథలకు మాత్రమే జనాదరణ పొందుతాయి. అటువంటి ఆత్మకథ ఈ ఇడ్లీ ఆర్కిడ్ ఆకాశం .. వినడానికే వింతగా ఉన్న టైటిల్. కవర్ పేజీమీద ఇడ్లి ప్లేటు నుంచి ఆకాశానాకి నిచ్చెన. కొత్తగా ఉన్నా ఔచిత్యం ఉన్న ఆలోచన. ఎందుకంటే ఇది ఒక హోటల్ అధినేత ఆత్మకథ కనుక.

ఒక యువకుడు చిన్న కాకా హోటల్ నుంచి ప్రపంచ ప్రసిధ్ధ హోటల్ యజమానిగా ఎదిగిన వైనం, అణువణువునా ఆశావాదంతో ఆకాశానికి నిచ్చెన వేసి అనుకున్న స్వర్గాన్ని అందుకున్న విన్యాసం ఈ ఆత్మకథలో హీరోని చూపిస్తే ....సమాజాన్ని అర్థంచేసుకునే పధ్ధతి, తన గుణపాఠాలు మనకు పాఠాలుగా చెప్పే నైపుణ్యం మొదలైన గుణాలు మనకొక గురువును చూపిస్తాయి.

తొలుత ఇంగ్లీషులో వచ్చిన ఈ పుస్తకం ఎంత గొప్పగా కదిలించిందంటే మన సుప్రసిధ్ధ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సైతం కదిలేంత. ఆయన ఏకంగా ఈ పుస్తకాన్నితెలుగించడానికే పూనకున్నారంటే ఇక అర్థం చేసుకోండి. పైగా ఇది తన తొలి అనువాద రచన అని గర్వంగా చెప్పుకున్నారు కూడా. అంతే కాదు ఈ పుస్తకం 14 భాషల్లోకి అనువాదమైపోయింది. రెండు యూనివర్సిటీలకి నాన్ డిటైల్డ్ కూడా చేశారు. ప్రపంచ ప్రతిష్టాత్మకమైన హోటల్‌గా ప్రథమ బహుమతి పొందిన ఆర్కిడ్ హోటల్ అధినేత విఠల్ కామత్ ఆత్మకథ.

ఇందులో మార్క్ చేసుకుంటూ పోతే ఎన్నో సూక్తులు కనిపిస్తాయి.

ఆత్మహత్య చేసుకోవాలని నా స్నేహితుడి ఆఫీసు 26వ అంతస్తుకి చేరుకున్నాను. అతణ్ణి బయటకి పంపి, కిటికీలోంచి బయటకు దూకబోతుండగా ఒక సంఘటన నన్ను మార్చింది. 600 కోట్ల హోటల్‌కి అధిపతిగా చేసింది.

ఇడ్లీ ఒక ప్లేట్లో, చట్నీలు మరొక ప్లేట్లో, సాంబార్ సెపరేట్‌గా గిన్నెలో సర్వ్ చేసేవాళ్ళం. మూడూ ఒకే దానిలోఇచ్చేలా ‘దొప్ప’లున్న “కామత్” ప్లేట్లు తయారు చేయించాను. దానితో అంట్లు తొమే వారి ఖర్చు నెలకి పాతికవేలు తగ్గింది.

“నీ జీవితాయశం ఏమిటి?” అని ఒబెరాయ్ నన్ను అడిగారు. “మీ హోటల్ కన్నా పెద్దది కట్టడం” అన్నాను. పన్నెండేళ్ళ వయసులో అది నా అహంభావం కాదు – కల.

"భారత రాష్ట్రపతికి లస్సీ కావాలని మా హోటల్‍కి కబురొచ్చింది. అందమైన ఫ్లాస్క్ మీద “కామత్” అని ప్రింట్ చేయించి లస్సీ పోసి పంపాను. పదిలక్షలు వెచ్చించినా ఇంత వ్యాపార ప్రకటన దొరకదు."

"రాజకీయాల మీదా, లంచగొండితనం మీదా నెపం వేయొద్దు. గెలుపు రాలేదంటే అది మన చేతకాని తనం".

"చాలా దేశాల్లో మనుషులు బధ్ధకస్తులు. అమెరికా వంటి దేశంలో మాత్రం కాదు. అయినా వారు పనిచేయగలరు గానీ, వ్యక్తులుగా భారతీయులంత తెలివైనవారు కాదు. కానీ వారికున్న సాంకేతిక పరిజ్ఞానం వారిని గొప్పవారిగా చూపిస్తోంది".

"సంపాదన పెరిగాక కొందరు విరాళాలు ఇస్తారు, కొందరు గుళ్లు గోపురాలు కడతారు...నేను మాత్రం మరో కొత్త పెట్టుబడి పెడతాను. దాని వల్ల మరో వెయ్యి మందికి ఉపాధి కలుగుతుంది. ఇది నా థియరీ".

ఇలాంటి సూటైన అభిప్రాయలు ఎన్నో. ఇక పుస్తకంలో కథానాయకుడు హోటల్ యజమాని కనుక సాంబారు రుచి పోకుండా ఉండాలంటే హోటల్లో ఏమి చేస్తారు, ఏమి చెయ్యడం వల్ల అంట్లు తోమే వాళ్ల ఖర్చు తగ్గించొచ్చు వంటి సూత్రాలు చెప్పారు. ఇవి అందరికీ అర్థమయ్యే విషయాలు కనుక (ముఖ్యంగా గృహిణులకి), ఎక్కడా బోర్ కొట్టదు.

జీవితంలో బాగా ఎదిగి, కిందకు పడి మళ్లీ లేవడానికి నీరసపడే వాళ్లకి ఈ పుస్తకం ఒక టానిక్. 176 పేజీలే కనుక తలచుకుంటే ఒక్క రోజులో పూర్తి చేయవచ్చు. అందులోనూ యండమూరివారి శైలి కనుక, తెలుగు పాఠకులకి పర రాష్ట్రానికి చెందిన కథ చదువుతున్న ఫీలింగ్ రాదు.

#KamatHotels
#TheOrchidHotel
#VithalVenkateshKamat
#IdlyOrchidAkasam

మొక్కలకు నీరు ఇవ్వడములో చేస్తున్న కొన్ని తప్పులు

మొక్కలకు నీరు ఇవ్వడము లో చేస్తున్న కొన్ని తప్పులు
ఎక్కువ మంది రైతులకు తెలియని విషయం డ్రిప్ పద్ధతిలో మొక్కలకు నీరు ఇచ్చే విధానం నీరు కాలువల ద్వారా పారించే విధానం పూర్తి బిన్నంగా ఉంటుంది

 అది ఎలా అంటే మనం ఒక్కసారి కాలువల ద్వారా నీరు పారించినప్పిడు తేమశాతం మన భూముల్లో 4-5 అంగుళాలు మాత్రమే మట్టిపొర లోకి వెళ్తుంది 

అదే మనం డ్రిప్ ద్వారా నీరు ఇచ్చినప్పుడు ఒక గంటలోనే మినిమం 10-12 అంగుళాలు నెమ్ము మట్టిపొరల లోపలికి వెళ్తుంది 


కాబ్బటి మనం తెలుసుకోవాల్సిన విషయం మొక్క వేరువ్యవస్థ కు మాత్రమే నీరు ఇవ్వాలి అలాకాకుండా కరెంట్ ఉన్నంత సమయం నీరు ఇచ్చినట్లయితే 

1. మొక్క ఎప్పుడు చూసిన కళాహీనంగా ఉంటుంది 

2 మొక్కలో ఎలాంటి ఎదుగుదల ఉండదు 

3 చివర ఆకులు పసుపురంగు లోకి వస్తుంటాయి 

కాబ్బటి మీరు గమనించవల్సింది డ్రిప్ పద్ధతిలో మీరు 24 గంటలపాటు నీరు ఇచ్చిన మీ కంటికి భూమిపై తేమ తక్కువగా కనపడుతుంది భూమి లోపలికి పోయేకొన్ది నెమ్ముశాతం పెరుగుతుంది 

కావున మొక్క వయస్సును బట్టి మన భూమి స్థితిని బట్టి వాతావరణాన్ని బట్టి నీరు ఇచ్చుకోవాలి 

అప్పుడే మొక్కలలో సూక్ష్మపోషక లోపాలు తగ్గిపోతాయి మనం ఇచ్చిన ఎరువులు 100% మొక్క వినియోగించుకొని దిగుబడి పెరుగుతుంది


మరింత సమాచారం కోసం
రైతుల సంస్థ
చార్వి ఇన్నోవేషన్స్
9700763296
www.chaarviinnovations.com

తులసి మొక్క ప్రాధాన్యత ??

🌿తులసి మొక్క ప్రాధాన్యత🌿

తులసి మొక్క ప్రాధాన్యత🌿

భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసిలేని హిందువుల ఇల్లు
ఉండదు. తులసి లక్ష్మీ స్వరూపం.

అసలు తులసి మొక్కకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? తులసి ప్రత్యేకత ఏమిటి?

మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే, అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. మనకు అవి తెలియవి, అంతే. తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం.

మాములు మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజెన్ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్వన్-డై-ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి.

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని మన భారతీయుల పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు.

తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసి కున్న ఘాటైనవాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు.

అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుకా కూడా తులసిమొక్కను పెట్టి పూజించమన్నారు, ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి.

తులసిలో విద్యుఛ్చక్తి అధికంగా ఉందని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వేదంలో కూడా వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి ప్రస్తావన ఉంది.

తులసి ఏ ఇంటిలో ఉంటే, ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు.

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

తులసిలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని మనం శరీరం గ్రహిస్తే, ఆరోగ్యం చేకూరుతుంది, అందుకోసమే తులసమ్మకు నీరు పోసి, చుట్టు ప్రదక్షిణం చేయాలి. అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా, ఆరికాళ్ళలోకి చేరి, నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది.

తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంధాలు చెప్పాయి. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడ అంగీకరించారు.

ప్రపంచాన్ని హడలుగొట్టిన స్వైన్‌ప్లూ భారత్‌లో స్వైరవిహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది.

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

తులసి గాలి కారణంగా జనంలో స్వైన్‌ప్లూను తట్టుకునే రోగనిరోదక శక్తి పెరిగిందట.

అంటే మన తులసమ్మ మనకు ఆయుషు పోసిందన్నమాట. ఏ ఇంట్లో అధికంగా తులసిమొక్కలు ఉంటాయో, ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు.

తులసిచెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. తాజ్‌మహల్ కాలుష్యం బారినపడి మసకబారకుండా ఉండడం కోసం, తాజ్‌మహల్ పక్కనే, లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు.

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

అట్లాగే తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయి. కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కైనా పెంచాలి.

నల్గోండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తోంది. తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్ వ్యాపితిని తగ్గిస్తాయని ఈ మధ్యే దృవీకరించారు.

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే, రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఇది తులసి మహాత్యం.

తులానాం నాస్తి ఇతి తులసి అన్నారు, దేని గురించి ఎంత చెప్పుకున్నా, ఇంకా చెపుకోవలసినది మిగిలి ఉంటుందో, దాన్ని తులసి అంటారని అర్దం.

తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతారు    🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...