డైరీ ఫార్మ్ కొత్తగా పెట్టాలనుకునే వారికి మేము కొన్ని సలహాలు.
మీరు సమయం కేటాయించకుండా ఫలితం రాదు.
1. సొంతంగా భూమి ఉండాలి ఒకవేళ లేనిచో భూమి కౌలు కి తీసుకొని చేయాలనుకుంటే తక్కువ కౌలు ధర లో చూసుకోవాలి.
2. సంవత్సరం మొత్తం నీళ్ల సౌకర్యం ఖచ్చితంగా ఉండాలి.
3. పచ్చ గడ్డి మొత్తం మనమే పండించుకోవాలి.
4. పచ్చ గడ్డి లో పప్పు జాతి మరియు గడ్డి జాతి రెండు పెంచుకోవాలి. అధిక పాల ఉత్త్పత్తి కి ఇది దోహదపడుతుంది. గడ్డి జాతి లో సూపర్ నేపియర్ మరియు పప్పు జాతి లో దశరథ గడ్డి ఉండేలాగా చూసుకోండి.
5. షెడ్ పై ఖర్చు తక్కువ పెట్టి మంచి నాణ్యమైన పశువుల పై డబ్బు ఖర్చు చేయాలి.
6. షెడ్ నిర్మాణంలో పైకప్పు కంటే ఫ్లోర్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి.
7. మీరు ఎంచుకొనే జాతి (గేదెలు లేదా ఆవులు) పై పూర్తి అవగాహన ఉండాలి.
8. పశువులు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఏమేమి అవసరం ఉంటాయో అన్నింటి పై అవగాహన ఉండాలి.
9. పశువులకు ప్రాథమిక చికిత్స తెలిసి ఉండాలి.
10. పశువుల ని కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. మంచి అనుభవం ఉన్నవాళ్ళని తీసుకెళ్లాలి.
11. పాల కి మార్కెట్ లేకుండా దేశి ఆవు జోలికి వెళ్ళకూడదు
12. మీరు సంవత్సరం మొత్తం లో ప్రతి రోజు పాల ఉత్పత్తి ఒకేవిధంగ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి
13. మీ పాలు మొత్తం మీరే మార్కెట్ చేసుకోవాలి
14. మీ ఏరియా లో పాలకు సరైన ధర లేకపోతే పాల ఉత్పత్తుల పై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు నెయ్యి, పనీర్, బట్టర్, బట్టర్ మిల్క్ మొదలగునవి. ఇంకా చాలా ఉంటాయి
15. పాల కి మార్కెట్ లేకపోతే పాల సెంటర్ కి పోయాలి అనుకుంటే HF క్రాస్ బ్రీడ్ లేదా Jersey క్రాస్ బ్రీడ్ ఎంచుకోవాలి. ఫారిన్ బ్లడ్ 60 to 70% ఉండేలా చూసుకుంటే మన ప్రాంతం కి సెట్ అవుతాయి. ఈ జాతులలో ప్యూర్ బ్లడ్ కి అనుభవం లేకుండా వెళ్ళకూడదు.
16. మీ ఏరియాలో మంచి సెమెన్ ఎక్కడ దొరుకుతదో కనుక్కోవాలి లేదా ఒక మంచి జాతి లక్షణాలున్న దున్నపోతు లేదా ఆంబోతు ని పోషించాలి.
17. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక పశువు నుండి ఒక దూడ వచ్చేలా చూసుకోవాలి.
18. పశువు ఈనిన మూడు నుంచి నాలుగు నెలల లోపు మల్లి తిరిగి కట్టించాలి.
19. ప్రతి ఆడ దూడ ని తిరిగి పాలిచ్చే పాడి పశువుల తయారు చేసుకోవాలి.
20. దాణా ని మనమే తయారు చేసుకోవాలి.
21. సమీకృత దాణా కోసం మీ దగ్గరలో ఉన్న వెటర్నరీ డాక్టర్ ని సంప్రదించాలి
22. సమీకృత దాణా లో తగు పాళ్లల్లో పిండి పదార్థాలు(కార్బోహైడ్రేట్స్), మాంస కృత్తులు(ప్రోటీన్), పీచు పదార్థాలు(ఫైబర్), కాల్షియమ్, మినరల్ మిక్సర్ మరియు ఉప్పు ఉండేలా చూసుకోవాలి
23. దాణా ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అంటే అజోల్లా లాంటి వాటిని పెంచాలి.
24. బయో గ్యాస్ ప్లాంట్ పెట్టుకోవాలి. పని వారికి మరియు మీకు గ్యాస్ ఖర్చు తగ్గుతుంది.
25. పశువుల పేడ ని విడిగా అమ్మకుండా వర్మి కంపోస్టు తయారు చేసుకొని లేదా బయో గ్యాస్ నుండి వచ్చె slurry ని అమ్ముకుంటే ఎక్కువ లాభంగ ఉంటుంది
No comments:
Post a Comment