డైరీ ఫార్మ్ లో నష్టపోవడానికి మేము గమనించిన కొన్ని కారణాలు:
1. పశువులపై పూర్తి అవగాహన లేకపోవడం. అవగాహన లేని అనుభవం కూడా వ్యర్థమే.
2. డైరీ ఫార్మ్ ని ఒక పార్ట్ టైం జాబ్ లాగ చేసుకుంటూ పని వారికి మొత్తం అప్పగించడం
3. డైరీ ఫార్మ్ కి తగినంత సమయం కేటాయించక పోవడం. మెదలు పెట్టినప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ తర్వాత ఉండకపోవడం
4. అవగాహన లేకుండా ఎక్కువ పశువులతో మొదలు పెట్టడం
5. పని వారిపై పూర్తిగ ఆధారపడడం
6. పని వారితో ఎలా మెలగాలో తెలియక పోవడం. ఫలితంగ పనివారు మధ్యలో వదిలేసి వెళ్లడం. మనకు మొత్తం చేసుకోవడం కష్టమై డైరీ ఫార్మ్ మూసివేయటం
7. మన ప్రాంత పరిస్థితులని తెలుసుకోకుండా గేదెల ఆవులలో మనకు నచ్చిన దానికి పోవడం
8. షెడ్ పై ఎక్కువ ఖర్చు పెట్టి పశువుల దగ్గరికి వచ్చే సరికి ఖర్చు కి వెనకాడడం. నాణ్యమైన పశువుల బదులు తక్కువ లో దొరికే పశువులకు వెళ్లడం
9. పశువులు కొనేటప్పుడు రాజి పడడం
10. పచ్చ గడ్డి కూడా బయట నుండి కొనుకోవడం
11. దాణా సొంతంగ తయారు చేసుకోకుండా బయట దొరికే రెడీమేడ్ ది కొనుకోవడం
12. దాణా లో మినరల్ మిక్చర్ మరియు ఉప్పు వాడకపోవడం
13. దాణా పై ఖర్చు తగ్గించుకునే ఆలోచన చేయకపోవడం. దాణా అంటే సమీకృత దాణా.
14. మీకు తక్కువ ధరలో దొరికినది మాత్రమే పెట్టి సమీకృత దాణా పెట్టకపోవడం. ఫలితంగా పాలు శక్తి మేర తీసుకోకపోవడం
15. పాలను సొంతంగ మార్కెట్ చేసుకోకుండా పాల సెంటర్ కి పోయడం
16. పాలను రిటైల్ గ కాకుండా హోల్సేల్ గ అమ్మడం. ఫలితంగ తక్కువ రేట్ కి పాలను అమ్ముకోవడం
17. పచ్చ గడ్డి లో పప్పు జాతి మరియు గడ్డి జాతి రెండు పండించుకోకుండా కేవలం గడ్డి జాతి అయిన సూపర్ నేపియర్ ఒక్కటే పెంచడం
18. ఒక పశువు నుండి దాని శక్తి మేర పాలు ఎలా తీసుకోవాలో తెలియక పోవడం
19. సరైన సమయం లో యద ని గుర్తించక పోవడం
20. కృత్రిమ గర్భధారణ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం
21. ఈనిన పశువుని తిరిగి 2 నుండి 3 నెలలలో కట్టించకపోవడం
22. కొన్న పశువుని పూర్తిగా పాలు తీసుకొని కట్టించకుండా అమ్మడం
23. దూడలను పోషించకుండా అమ్ముకోవడం లేదా చంపేయడం
24. మంచి జాతి లక్షణాలున్న దున్నపోతు లేదా ఆంబోతు తో క్రాస్ చేయించకపోవడం. AI అయితే మంచి సెమెన్ వాడకపోవడం. మంచి బ్రీడ్ మనమే డెవలప్ చేసుకోకపోవడం
25. ప్రతి సంవత్సరం ఒక దూడ ని తీసుకోకపోవడం
26. పశువులకు 24 గంటలు నీళ్లు అందుబాటులో ఉంచకుండా మనం నచ్చినవుడు నీళ్లు పెట్టడం. ఫలితంగా పాలు తగ్గిపోవడం
27. రికార్డ్స్ మైంటైన్ చేసుకోకపోవడం. ఇది మన దగ్గర ఉన్న మంచి పశువులను గుర్తించడానికి ఉపయోగపడుతుంది
28. ప్రతి దూడలకు, పశువులకు సమయానికి టీకా మరియు నట్టల నివారణ చేయించకపోవడం
29. పశువులకు వచ్చే రోగాలను సరైన సమయంలో గుర్తించకుండా ఆలస్యం చేయడం. ముఖ్యంగ పొదుగు వాపు లాంటివి గుర్తిచడం లో ఆలస్యం చేస్తే చాలా నష్టపోవాల్సి వస్తుంది
30. డైరీ ఫార్మ్ లో ఆధునాతన సాంకేతిక ను జోడించకపోవడం అంటే పాలు పితికే యంత్రాలు, ఛాఫ్ కట్టర్, బ్రష్ కట్టర్, మిల్క్ చిల్లర్స్, Pulverizer మొదలగునవి
My next post will be on ఆవులా, గేదెలా లేదా దేశి ఆవులా ?
ఇట్లు,
ఓ రైతు అనుభవం
No comments:
Post a Comment