Saturday, July 4, 2020

రైతులకు ఉచిత బోర్‌వెల్స్ ఆంద్రప్రదేశ్ లో


రైతులకు ఉచిత బోర్‌వెల్స్



ఆంధ్రప్రదేశ్ లో 'వైఎస్సార్‌ రైతు భరోసా' పథకం ద్వారా సన్న, చిన్న కారు రైతులకు ఉచిత బోర్‌వెల్స్ కార్యక్రమం అమలు చేయబోతున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది..*

*దీని అమలుకు సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు..*

◆ఈ క్రమంలో బోరు డ్రిల్లింగ్‌ కార్యకలాపాలు చేపట్టే ముందు సంబంధిత రైతు పొలంలో హైడ్రో-జియోలాజికల్, జియోఫిజికల్‌ సర్వే నిర్వహిస్తారు. 

◆ఆ తరువాతే బోరు బావుల నిర్మాణ ప్రక్రియ మొదలు కానుంది. 

◆అయితే భూగర్భ జల మట్టం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు గుర్తించిన 1,094 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ పథకాన్ని అమలు చేయబోరు..


*బోర్‌వెల్స్‌కు అర్హతలు, విధివిధానాలు:*

◆రైతుకు కనిష్టంగా 2.5 ఎకరాలు, గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండాలి. ఒకవేళ లేకపోతే పక్కనున్న రైతులతో కలిసి గ్రూపుగా ఏర్పడొచ్చు. అంతేకాదు ఆ భూమిలో అంతకు ముందు ఎలాంటి బోరు బావి నిర్మాణం చేపట్టి ఉండకూడదు.

◆ఈ అర్హతలు కలిగిన లబ్ధిదారుడు పట్టాదార్‌ పాస్‌ బుక్, ఆధార్‌ కార్డు కాపీతో గ్రామ సచివాలయంలో లేదా నేరుగా ఆన్‌లైన్‌లో బోరు బావి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ఆ తరువాత దీనికి సంబంధించి పంచాయతీ కార్యదర్శి క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తారు. ఆ తరువాతే తదుపరి అనుమతికి ఎంపీడీవోకు ఆ దరఖాస్తు వెళుతుంది.

◆జిల్లా మొత్తంలో ఎంపిక చేసిన రైతుల జాబితాలను డ్వామా పీడీలకు ఎంపీడీవోలు అందజేయనున్నారు.

*బోరు బావి మంజూరు సమాచారాన్ని గ్రామ సచివాలయం ద్వారా రైతులను తెలియజేయనున్నారు..*


అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

టార్పాలిన్స్1099 మాత్రమే, 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com

No comments:

Post a Comment

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...