అతిపెద్ద సంఖ్య ఎంతో తెలుసా? (GOOGOLPLEXIANTH)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
విశ్వస్వరూపం: లెక్కకు అందని సంఖ్యామానం మన #పూర్వికులు ఎలా చెప్పారు?
తెలుగులో పది, ఒండు పదకొండు ఎలా అయిందో అదే విధంగా పాత ఇంగ్లీషులో “ఎలెవెన్” అంటే “(పదిమీద) మిగిలింది ఒకటి” అని అర్థం. ఇదే విధంగా “ట్వెల్వ్” అర్థం “మిగిలింది రెండు”. ఇది కాస్తా సంస్కృతంలో ద్వ, దశ ద్వాదశ అయింది. ఇదే మాట లేటిన్‌లో “డూవోడెసిమ్”. “డూవో” అంటే రెండు, “డెసిమ్” అంటే పది. మాటకట్టడి చూసేరా? లేటిన్‌కీ సంస్కృతానికీ పోలిక ఉంది. పాత ఇంగ్లీషుకీ తెలుక్కీ పోలిక ఉంది. ఈ డూవోడెసిమ్ అన్న లేటిన్‌మాట భ్రష్టయి ఇంగ్లీషులో “డజను”గా మారింది. కనుక డజనుని ద్వాదసికి భ్రష్టరూపంగా తెలుగులోకి తీసేసుకోవచ్చు. లేదా తెలుగులో డజనుని ద్వాదశం అనొచ్చు. ఇలాంటి నియమాలు ఒక డజను సంపాయించగలిగే మంటే ఇంగ్లీషు మాటల్ని డజన్ల కొద్దీ తెలుగులోకి తీసుకురావచ్చు.
సంస్కృతంలో లెక్క పెట్టే పద్ధతిని ఒకసారి పునర్విమర్శిద్దాం. ఉదాహరణకి, ఎనభైరెండుని ద్వ్యశీతి అంటే 2, 80 అనీ, ఎనభై మూడుని త్య్రశీతి అంటే 3, 80 అనీ చెబుతూ, ఎనభై తొమ్మిది దగ్గరికి వచ్చేసరికి “నవాశీతి” అనకుండా “ఏకోన నవతి” అన్నారు. అంటే “తొంభైకి ఒకటి తక్కువ” అని అర్థం. ఈ పద్ధతి ఇంగ్లీషులోనూ తెలుగులోనూ కూడ కనిపించదు. కాని రోమక సంఖ్యలని రాసేటప్పుడు ఈ సంస్కృతంలో వాడే పద్ధతినే ఇప్పటికీ వాడుతున్నాం అని గమనించండి.
అసలు ఆధునిక శాస్త్రీయ యుగం మొదలయే వరకు పాశ్చాత్య దేశాలలో పెద్ద పెద్ద సంఖ్యలతో పనే ఉండేది కాదు. బిలియనుతో సామాన్యులకి అవసరం ఏముంటుంది? కనుక మొన్న మొన్నటి వరకూ పాశ్చాత్య భాషలలో పెద్ద పెద్ద సంఖ్యలకి పేర్లే లేవు. పని ఉంటే కదా పేర్ల అవసరం? కాని భారతదేశంలో ఏమి పని వచ్చిందో తెలియదు కాని “పెద్ద పెద్ద” సంఖ్యలకే కాదు, “పేద్ద పేద్ద” సంఖ్యలకి కూడ పేర్లు ఉన్నాయి. ఉదాహరణకి ఒకటి తర్వాత 11 సున్నలు చుడితే అది అర్బుదం, 13 సున్నలకి ఖర్వం, 15 సున్నలకి పద్మం, 17 సున్నలకి క్షోణి, 19 సున్నలకి శంఖం, ఇలాగే తరువాయి బేసి సంఖ్యల సున్నలుంటే వాటిని క్రమంగా క్షితి, క్షోభం, నిధి, సరి సంఖ్యలైన సున్నలుంటే వాటి పేరుకి “మహా” తగిలించి మహాపద్మం, మహాఖర్వం, వగయిరా పేర్లు. ఒకటి తర్వాత 27 సున్నలుంటే పర్వతం, 28 పరార్థం, 29 అనంతం. ముప్పయ్ సున్నలుంటే సాగరం, 31 అవ్యయం, 32 అచింత్యం, 33 అమేయం, … భూరి, వృందం, అన్న పేర్లు ఉన్నాయి. ఈ లెక్కలో వృందం తర్వాత ఏమి పేర్లు వస్తాయో ఇదమిత్థంగా తెలియదు కానీ రావణాసురుడి సైన్యం ఎంత పెద్దదో వర్ణిస్తూ వాల్మీకి ఒకటి తర్వాత 55 సున్నలు చుడితే వచ్చే సంఖ్యంత అని చెప్పి దానికి #మహౌఘం అని పేరు పెట్టేడు.
ఈ పేర్లు భారత దేశంలో వాడుకలో లేవు కానీ వారి దగ్గర ఈ పేర్లు నేర్చుకున్న జపాను వాళ్లు ఇప్పటికీ వీటిని వాడుతున్నారు. మచ్చుకి ఒకటి తర్వాత 80 సున్నలు వేయగా వచ్చిన సంఖ్యని జపాను వాళ్ళు “పుకషీగీ” అంటారు. పుకషీగీ అంటే ఆలోచనకి అందనిది లేదా “అచింత్యం”. ఒకటి తర్వాత 56 సున్నలు వేయగా వచ్చిన సంఖ్యని “కుగాషా” అంటారు. కుగాషా అంటే “గంగా నది ఒడ్డున ఉన్న ఇసకంత” అని అర్థం ట!
భారతీయులు పేర్లు పెట్టటం అంటూ పెట్టేరు కానీ, ఈ పేర్లలో ఒక బాణీ లేకపోతే జ్ఞాపకం పెట్టుకోవటం కష్టం. అప్పుడు ఒకదానికి మరొక పేరు వాడే ప్రమాదం ఉంది. భారతీయ ప్రాచీన గ్రంథాలలో, మచ్చుకి, ఒకటి తర్వాత 12 సున్నలు ఉన్న సంఖ్యని ఒక చోట మహార్బుదం అన్నారు, మరొక చోట న్యర్బుదం అన్నారు. ఇలాంటి ఇబ్బందుల నుండి తప్పించుకుందికి అధునాతనులు ఒక పద్ధతి ప్రవేశపెట్టేరు. ఈ పద్ధతిలో సంఖ్యల పేర్లలో బాణీ ఈ విధంగా ఉంటుంది: పది, వంద, వెయ్యి మామూలే. తరువాత కొత్త పేరు ఒకటి తర్వాత ఆరు సున్నలు చుట్టగా వచ్చిన మిలియను. తరువాత కొత్తపేరు ఒకటి తరువాత తొమ్మిది సున్నలు చుట్టగా వచ్చిన బిలియను. అలా మూడేసి సున్నలు అధికంగా చేర్చినప్పుడల్లా మరొక కొత్త పేరు. ఈ లెక్కని ఒకటి తర్వాత ఆరు సున్నలుంటే మిలియను, తొమ్మిది ఉంటే బిలియను, 12 అయితే ట్రిలియను, 15 సున్నలకి క్వాడ్రిలియను, తదుపరి క్వింటిలియను, అలా.
పెద్ద సంఖ్యలని, చిన్న సంఖ్యలని రాసే పద్ధతి
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
పెద్ద పెద్ద సంఖ్యలని, చిన్న చిన్న సంఖ్యలనీ రాసి చూపించటానికి ఒక శాస్త్రీయ పద్ధతి ఉంది. ఈ పద్ధతిని #ఘాతీయ_పద్ధతి (Exponential Notation) అంటారు. ఈ పద్ధతితో సుఖం ఏమిటంటే సంఖ్యల పేర్ల ముందు వచ్చే పూర్వ ప్రత్యయాలని కంఠస్థం చేసి గుర్తు పెట్టుకోనవసరం లేదు. ఈ ఘాతీయ పద్ధతిని కూడ రకరకాలుగా రాయవచ్చు. ఇక్కడ మనకి అనుకూలమైన పద్ధతి కంప్యూటరు రంగం నుండి అరువు తెచ్చేను. ఉదాహరణకి, 10E1 అంటే 10 ని ఒకసారి వెయ్యటం. 10E2 అంటే 10 ని రెండు సార్లు వేసి గుణించగా వచ్చినది లేదా 100 అని అర్ధం. 10E2 లో ఉన్న 2 ఒకటి తరువాత రెండు సున్నలు ఉన్నాయని చెబుతోందన్నమాట. ఇదే సూత్రం ప్రకారం 10E3 = 1000, 10E6 = 1,000,000 = మిలియను.
ఇదే ధోరణిలో చిన్న చిన్న సంఖ్యలని కూడ రాయవచ్చు. ఉదాహరణకి 10E-1 అంటే 1 ని 10 చేత భాగించగా వచ్చిన 0.1. అలాగే 1E-2 అంటే 1 ని 100 చేత భాగించగా వచ్చిన 0.01. ఇదే సూత్రం ప్రకారం 10E-3 = 0.001, 10E-6 = 0.000001.
ఈ పద్ధతి ఉపయోగించి కొన్ని విషయాలు చెబుతాను. ఒక సంవత్సరంలో 31.7E6 సెకండ్లు ఉన్నాయి. కావలిస్తే లెక్క కట్టి చూసుకొండి. భూమి నుండి సూర్యుడి సగటు దూరం 150E6 కిలోమీటర్లు. ఈ భూమి వయస్సు ఉరమరగా 4.6E9 = 4.6 బిలియను సంవత్సరాలు. మన సూర్యుడి నుండి మనకి అత్యంత సమీపంగా ఉన్న ఆల్ఫా సెంటారీ నక్షత్రం దూరం 40E12 = 40 ట్రిలియను కిలోమీటర్లు. విశ్వంలో ఉరమరగా 10E22 నక్షత్రాలు ఉన్నాయి ట. విశ్వంలో 10E80 ప్రాధమిక రేణువులు ఉన్నాయని ఒక అంచనా!
మరికొన్ని ఉదాహరణలు ఇస్తాను. మనం చూడటానికి వెలుగు (లేదా కాంతి) కావాలి కదా. బొమ్మ గీసినప్పుడు ఈ కాంతిని కిరణాల (లేదా గీతల) మాదిరి చూపించినా, నిజానికి కాంతి కెరటాల మాదిరి ఉంటుంది. ఇవి సెకండుకి 600 ట్రిలియను (లేదా 600E12 లేదా 6E14) కెరటాలు చొప్పున వచ్చి మన కంటిని చేరుకుంటాయి, తెలుసా? ఈ కాంతి సూర్యుడి నుండి మన కంటికి ఎంత జోరుగా ప్రయాణం చేసి వచ్చిందో తెలుసా? సెకండుకి 3E10 సెంటీమీటర్లు చొప్పున! ఈ కాంతి కెరటాల శిఖకి, శిఖకి మధ్య దూరం (దీనినే ఇంగ్లీషులో WaveLength అంటారు) కావాలంటే కాంతి వేగం అయిన 3E10 ని కాంతి కెరటాల జోరు (Frequency) అయిన 6E14 చేత భాగించటమే. అలా భాగిస్తే 0.5E-4 సెంటీమీటర్లు వస్తుంది. దీనిని 0.00005 సెంటీమీటర్లు అని రాయవచ్చు. ఇది సెంటీమీటరులో 20 లక్షో భాగం. ఇంత చిన్న పొడుగు మన కంటికి ఆనదు. అందుకనే కాంతి నిజంగా తరంగమే అయినా మన కంటికి కిరణం లా కనిపిస్తుంది.
ఇలా లెక్కలు వేసి చూపిస్తూన్నా ఈ సంఖ్యలని నేనూ ఊహించలేను, నేనూ ఆకళింపు చేసుకోలేను. కాని ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే, క్రమేపీ, మనకి అలవాటు అయిపోయి, మన నైజం గా మారిపోతుంది.
ఈ వ్యాసం భౌతిక శాస్త్రంలో పాఠంలా అనిపించినా, ఈ రకం సంఖ్యలు, ఊహలు మనకి కొల్లలుగా ఎదురవుతాయి. ఎప్పుడో ఒకప్పుడు నేర్చుకోవాలి కనుక, అవసరం వచ్చే ముందే నేర్చేసుకుంటే సరిపోతుంది.
EXPONENT XX MULTIPLICATION AA WORD NAME
10E2 10 x 10 HUNDRED
10E3 10 x 10 x 10 THOUSAND
10E6 MULTIPLY 6 TENS MILLION
10E12 MULTIPLY 12 TENS TRILLION
10E15 MULTIPLY 15 TENS QUADRILLION
10E18 MULTIPLY 18 TENS QUINTILLION
10E21 MULTIPLY 21 TENS SEXTILLION
10E24 MULTIPLY 24 TENS SEPTILLION
10E27 MULTIPLY 27 TENS OCTILLION
10E30 MULTIPLY 30 TENS NONILLION OR NOVENTILLION
10E33 MULTIPLY 33 TENS DECILLION
10E36 MULTIPLY 36 TENS UNDECILLION
10E39 MULTIPLY 39 TENS DUODECILLION
10E42 MULTIPLY 42 TENS TREDECILLION
10E45 MULTIPLY 45 TENS QUATTUORDECILLION
10E48 MULTIPLY 48 TENS QUINDECILLION
10E51 MULTIPLY 51 TENS SEXDECILLION
10E54 MULTIPLY 54 TENS SEPTENDECILLION
10E57 MULTIPLY 57 TENS OCTODECILLION
10E60 MULTIPLY 60 TENS NOVEMDECILLION
10E63 MULTIPLY 63 TENS VIGINTILLION
10E100 MULTIPLY 100 TENS GOOGOL
10Egoogol MULTIPLY GOOGOL TENS! GOOGOLPLEX
10Egoogolplex MULTYPLY GOOGOLPLEX TENS!
GOOGOLPLEXIAN
10Egoogolplexian MULTYPLY GOOGOLPLEXIAN TENS!
⏫ #GOOGOLPLEXIANTH ⏫
English వారి పరిజ్ఞానం ప్రకారం 1 ప్రక్కన 10100 సున్నాలను వ్రాస్తే దానిని గూగోల్ గా వ్యవహరిస్తారు.
ఇటువంటి 10 గూగోల్ లను ప్రక్క ప్రక్క గా రాస్తే ఒక గూగోల్ ప్లెక్స్ గా పిలవబడుతుంది.
గూగోల్ ప్లెక్స్ గురించి కొన్ని ఆసక్తి కర విషయాలు
😯🤔😯🤔😯🤔😯🤔😯🤔😯🤔😯🤔😯
దీనిని రాయాలంటే
లైన్ కు 50 సున్నాలు చొప్పున
పేజీ కి 50 లైన్ల చొప్పున
400 పేజీలు కల ఒక పుస్తకాన్ని తయారు చేస్తే
అటువంటి పుస్తకాలు 10 పక్కన 94 సున్నాలను పెడితే ఎంత సంఖ్య వస్తుందో అన్ని పుస్తకాలలో ఉన్నన్ని సున్నాలన్నమాట.
ఈ పుస్తకం బరువు 100గ్రాములు అనుకుంటే
ఒకగూగోల్ ప్లెక్స్ రాసిన పుస్తకాలన్నింటి బరువు ఎంతో తెలుసా?
*10పక్కన 93 సున్నాలను పెడితే ఎంతో అంత సంఖ్య గల కిలోగ్రాములు బరువన్నమాట*.
అదే మన భూమి బరువు 15 పక్కన 24 సున్నాలను పెడితే ఎంతో అన్ని కిలోగ్రాములు మాత్రమే!!
మన సూర్యమండలం ఉన్న పాలపుంత(Galaxy) బరువు 10పక్కన 42 సున్నాలను పెడితే వచ్చే సంఖ్య అంత కిలోగ్రాములు మాత్రమే!
*సమయం* :-అటువంటి గూగోల్ ప్లెక్స్ ను రాయాలంటే
*😯ఒక మనిషి సెకనుకు 2 సున్నాల చొప్పున రాసుకుంటూ పోతే ఒక గూగోల్ ప్లెక్స్ ను రాయడానికి 151 పక్కన 92 సున్నాలను పెడితే ఎంత సంఖ్య వస్తుందో అన్ని సంవత్సరాల కాలం పడుతుందట*.😯
మన విశ్వాన్ని దాటడానికి 11 పక్కన 82 సున్నాలను పెడితే ఎంత సంఖ్య వస్తుందో అన్ని సంవత్సరాల సమయం మాత్రమే .
ఇప్పుడు గూగోల్ ప్లెక్స్ గురించి అర్ధమైంది కదా
అలాంటి 10 గూగోల్ ప్లెక్స్ లు కలిపితే ఒక గూగోల్ ప్లెక్సీయాన్ (GoogolPlexian)
ఇటువంటి 10 GoogolPlexian లను కలిపితే ఒక గూగోప్లెక్సీయంత్ (GoogolPlexianth) అవుతుంది.
So ఒక GoogolPlexianth ను రాయాలన్నా అది ఎంత పెద్ద సంఖ్యో ఈ పాటికి అర్ధమైందనుకుంటాను.
A #googolplex Is The Number 10Googol, or Equivalently, 10(10100). Written Out In Ordinary Decimal Notation, It Is 1 Followed By 10100 Zeroes, That Is, A 1 Followed By A Googol Of Zeroes.
#Size
A Typical Book Can Be Printed With 10×6 Zeros (Around 400 Pages With 50 Lines Per Page nd 50 Zeros Per Line). Therefore, It Requires 10×94 Such Books To Print All The Zeros Of A Googolplex (That Is, Printing A Googol Of Zeros). If Each Book Had A Mass Of 100 Grams, All Of Them Would Have A Total Mass Of 10×93 Kilograms. In Comparison, Earth's Mass Is 5.972 x 10×24 Kilograms, nd The Mass Of The Milky Way Galaxy Is Estimated At 2.5 x 10×42 Kilograms.
♊ Writing The Number Would Take An Extreme Amount Of Time: If A Person Can Write Two Digits Per Second, Then Writing A GoogolPlex Would Take About 1.51×10×92 Years, Which Is About 1.1×10×82 Times The Accepted Age Of The Universe.♊
❗Consider When I Wrote 10×Number Is Equal To 10 To The Power Of Number ❕
#Example: 10×92 Is Equal To 10 To The Power of 92 Means10 followed by 92 zeros .{ 10 పక్కన 92 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య }
No comments:
Post a Comment