కడక్ నాథ్ జాతి – ప్రసిద్ధ పోషక విలువలు గల భారతీయ నాటు జాతి
గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు ఈ కోళ్ల పెంపకం ద్వారా ప్రత్యామ్నాయ ఆదాయాన్ని . ప్రస్తుతం నాటుకోడి మాంసానికి అధిక డిమాండ్ ఉంది. ఈ నాటుకోడికి ప్రత్యామ్నాయంగా కడక్ నాథ్ కోడి కొత్తగా అందుబాటులోకి వచ్చింది.
"కడక్నాథ్" అనేది మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరికే అరుదైన జాతికి చెందిన నాటుకోడి.ప్రాంతీయంగా ‘కలమాశి’ అంటారు, అంటే దీని అర్ధం నల్లని మాంసం కలది – మధ్యప్రదేశ్ లోని జాబ్యూ మరియు ధర్ జిల్లాలు, రాజస్ధాన్ మరియు గుజరాతీ సరిహద్దు ప్రాంతాలలో సుమారు 800 చ. మైళ్ళ విస్తీర్ణంలో వ్యాపించి వుంటాయి .
ముదురు నలుపు, ముదురు నీలం రంగుల్లో ఉండే కడక్నాథ్ కోళ్లలో వెంట్రుకలు, చర్మం, మాంసంతో పాటు రక్తం కూడా ఉంటుంది. ఈ కోళ్ళను కాలామాళి అని కూడా పిలుస్తారు. ఈ జాతి మాంసం నల్లగా ఉన్నా, దీనికి చాలా ఔషధ విలువలతోపాటు. ఈ జాతి కోళ్ళలో పొదుగుడు లక్షణం తక్కువ, ఆరు నెలల వయసు నుండే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. వేసవిలో సుమారు 100 గుడ్లు పెడుతుంది
కడక్ నాథ్ జాతి పోషక విలువలు ప్రాముఖ్యత:
మాంసం తినడం వల్ల మహిళలు అధిక రక్తస్రవం, గర్భస్రవం, ప్రసవానంతర సమస్యల నుంచి బయటపడవచ్చు
అధిక మాంసకృతులు, లినోలెనిక్ ఆమ్లాలు, తక్కువ కొవ్వు పదార్ధాలు ఉన్నాయి
పురుషుల్లో నరాల బలహీనతకు, పురుషుల్లో వంధ్యత్వ నిరోధానికి సైతం వాడతారు
కీళ్ళ సమస్యలు, ఎముకలు విరిగిన వారికి ఇది అద్భుత ఆహారంగా భావించవచ్చు
గ్రుడ్లు, మాంసం లో ప్రొటీన్లు (25.47%) మరియు ఇనుము ఎక్కువగా ఉంటుంది.
20 వారాల వయస్సులో 920గ్రాముల బరువు ఉంటుంది.
గ్రుడ్లు పెట్టే వయస్సు – 180 రోజులు.
సంవత్సరనికి గ్రుడ్ల ఉత్పత్తి – 105
40 వారాల వయస్సుకి గ్రుడ్ల బరువు 49 గ్రా
గ్రుడ్లు పెట్టే సామర్ధ్యం - 55%
అధిక వృద్ధి శాతానికి షెడ్లల్లో 6 కోళ్ళకు, ఒక పుంజు చాలు.
రోగ నిరోధక టీకాలు:
కొక్కెర తెగులుకు- 7వ, 28 వ రోజు, 9, 18,41, 56 వ వారాల్లో కొక్కెర తెగులు నివారణకు టీకా ఇవ్వాలి. 15 వ 21వ రోజుల్లో గంబోర 6, 17 వారాల్లో కోళ్ళ మశూచికి టీకా ఇవ్వాలి.
మీ అభివృద్ధి ని కోరుకునే
రైతుల సంస్థ
చార్వి ఇన్నోవేషన్స్
No comments:
Post a Comment