చిల్లగింజల గురించి సంపూర్ణ వివరణ -
ఈ చిల్లగింజలను సాధారణ భాషలో ఇండుప గింజ , నిర్మలి అని కూడా పిలుస్తారు . మురికిగా ఉన్న నీటిని తేటగా చేయుటకు ఈ గింజను వాడతారు. వర్షాకాలములో నదీ ప్రవాహములలో , వాగులలో వచ్చు నీరు బురద , కల్మషముతో కూడి ఉండును. ఆ నీటిని నిర్మలముగా చేయుటకు నీరు పట్టి ఉన్న బిందెలలో ఈ చిల్లగింజని అరగదీసి వచ్చిన గంధమును నీటిలో కలుపుతారు. ఇది నీటిలోని బురద , కల్మషములను శుద్ది చేయుటయే కాక నీటిలో గల అనేకరకాల విషపదార్ధాలను కూడా నిర్మూలించును అని ఆధునిక పరిశోధనలు రుజువుచేసినవి .
ఈ చిల్లగింజలు నీటిలో కలిగిన రసాయనిక విషపదార్ధాలనే కాకుండా పరమాణు జన్యుమైన విషపదార్ధాలను కూడా నిర్మూలించును. ఇది కేవలం నీటిని శుభ్రపరచడం మాత్రమే కాకుండా అనేకరకాలైన వ్యాధులను కూడా నయం చేయును . ముఖ్యంగా మూత్రాశయ సంబంధ వ్యాధులను తగ్గించి మూత్రమును జారీ అయ్యేట్టు చేయును . మూత్రాశయం నందలి రాళ్లను కరిగించును. మధుమేహమును తగ్గించును . మధుమేహరోగులు చిల్లగింజలు , చండ్ర చెక్క , వేగిసచెక్క ఈ మూడింటితో తయారుచేసిన కషాయం నిత్యం వాడుట వలన మధుమేహము తగ్గును. కామెర్ల నందు కూడా పనిచేయును . వాపులు తగ్గును. తరచుగా వచ్చు జలుబు తగ్గును. శరీరం బరువు తగ్గి సన్నబడేలా చేయును . నేత్రములకు మంచిది .
చిన్నపిల్లల్లో మరియు పెద్దవారిలో తరచుగా కనిపించే నులిపురుగుల సమస్యను నిర్మూలించును. చర్మవ్యాధులు నందు పనిచేయును . చర్మవ్యాధుల యందు నిమ్మగింజలతో కలిపి వాడుచున్న మంచి ఫలితం కనిపించును. తెలంగాణ ప్రాంతములో తాంబూలం నందు వక్కతో పాటు చిల్లగింజల ముక్కలు కూడా వాడుట సాంప్రదాయముగా ఉన్నది. ప్రతిరోజు చిల్లగింజను వాడుట వలన మూత్రాశయములో రాళ్లు ఏర్పడకుండా మూత్రం సాఫీగా జారి అయ్యేలా చేస్తుంది .
No comments:
Post a Comment