నిత్యా జీవితంలో ఫెస్టిసైడ్ దుష్ప్రభావాలు
సబ్బు
మనం రోజుకు రెండు సార్లు శరీరంపై జారనిచ్చే ఈ సబ్బుల్లో మనకు నచ్చే, మనం మెచ్చే ఎన్నో రకాలు, రంగులు, సువాసనలతో మనందరినీ ఆకట్టుకుంటాయి.
అభిరుచికి తగ్గట్టుగా ఒక్కో సబ్బుని ప్రతి ఒక్కరు ఎంచుకోవడం కూడా మన ఇళ్లలో సాధారణ విషయం.
అయితే, మన దేహంపైన పేరుకునే మాలిన్యాలను తొలగించుట కొరకు వాడే ఈ సబ్బులు పూర్తిగా రసాయనాల భరితమే.
అయితే ఈ సబ్బుల్లో గల రకరకాల రసాయనాలు మన చర్మంపైకి వచ్చినప్పుడు మనకు జరిగే హాని ఒకసారి చూద్దాం.
ట్రైక్లోసన్
కిందటి ఎపిసోడ్లో టూత్ పేస్ట్లో గల ఈ రసాయనం యొక్క దుష్ప్రభావాలు రాసాను. మరొక్కసారి పాఠకుల కోసం రాస్తున్నాను.
ట్రైక్లోసన్ అనే ప్రాణాంతకమైన రసాయనిక పదార్థాన్ని టూత్ ఫేస్టుల్లో, సబ్బుల్లో, టాయిలెట్ క్లీనర్స్లో వాడతారు!
ఈ ట్రైక్లోసన్ అనే రసాయనం క్లోరిన్ కలిగిన మన కుళాయి నీళ్లతో కలిసినప్పుడు నీటి ద్వారా క్లోరోఫామ్ మరియు వాతావరణంలోకి డైయాక్సిన్ విడుదల చేస్తుంది.
ట్రైక్లోసన్ థైరాయిడ్ గ్రంథి పనితీరును పాడుచేస్తుంది.
అధ్యయనాల ప్రకారం మానవ తల్లిపాలలో, రక్తంలో, మూత్రంలో ట్రైక్లోసన్ ఉన్నట్లు గుర్తించడం ఆధారంగా, ట్రైక్లోసాన్ క్యాన్సర్ లక్షణాలను కలిగిస్తుందనే ఆందోళన పెరుగుతోంది.
టూత్ పేస్ట్ రూపంలో నోటి ద్వారానే కాకుండా, సబ్బుల రూపంలో చర్మం ద్వారా ట్రైక్లోసన్ గ్రహించబడుతుంది .
అది పేగు క్యాన్సర్,రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్లకు కారణం అవుతోంది!
ఈ ట్రైక్లోసాన్ సబ్బుల్లో ప్రధానంగా ఉండేది. అది చర్మం గుండా కూడా కణజాలాల్లోకి చేరేది.
ఈ ట్రైక్లోసన్ ముఖ్యంగా గర్భస్థ శిశువుల పునరుత్పత్తి వ్యవస్థను దెబ్బ తీసే లక్షణాలు కలిగి ఉంది.
అయితే 2016లో సబ్బుల్లో ట్రైక్లోసన్ వినియోగాన్ని బాన్ చేసారు.
ఇది శరీరంలోని ప్రమాదకర బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుందని అనిపించవచ్చు. కానీ, ఇది పెస్టిసైడ్.
DIOXANE
డయాక్సేన్ ఒక రసాయనం, ఇది సింథటిక్ కొబ్బరి నుండి ఉద్భవించినందున చర్మానికి మంచిదని ఇతరులు భావిస్తారు. అయినప్పటికీ, ఈ రసాయనాన్ని చెడు రసాయనంగా పరిగణిస్తారు, ఎందుకంటే ఇది మూత్రపిండాలు, మెదడు మరియు కాలేయం పనితీరును ప్రభావితం చేస్తుంది.
ఫార్మాల్డిహైడ్
ఫార్మాల్డిహైడ్ సాధారణంగా సబ్బులో ఉండే రసాయనాలలో ఒకటి. అయినప్పటికీ, రోగనిరోధక వ్యవస్థ బలహీనం చేయటానికి, ఈ రసాయనం సామర్ధ్యం కలిగి ఉంటుంది.
ఇది శరీరం వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. అలాగే, శ్వాసకోశ వ్యవస్థ కూడా ప్రభావితమవుతుంది. అసమాన హృదయ స్పందన, అలసట మరియు తలనొప్పి కూడా సంభవించవచ్చు.
parabens
పారాబెన్స్ అనేవి సబ్బులను ఎక్కువ కాలం నిల్వ చేయడం కోసం ఉపయోగించే ఒక రసాయనం. కానీ ఈ రసాయనం చర్మానికి మంచిది కాదు. పారాబెన్స్ మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌కు మూలం. అలాగే, నాడీ సంబంధిత సమస్యలు కూడా ఉత్పన్నమౌతాయి, ఇవి శరీరంలోనికి విషాన్ని తెస్తాయి.
PEG -6
మీ శరీరం ఈ రసాయనానికి ఎక్కువగా గురైనప్పుడు, మీ శరీరంలో రొమ్ము క్యాన్సర్ వంటి వివిధ ఆరోగ్య పరిస్థితులు ఏర్పడవచ్చు.
DIETHANOLAMINE
DEA అనేది మీరు జాగ్రత్తగా ఉండవలసిన మరొక రసాయనం. ఈ రసాయనం కాలేయం మరియు మూత్రపిండాల క్యాన్సర్‌కు కారణమవుతుంది, ఇది ఆరోగ్యానికి చెడ్డది.
కానీ, చెడు రసాయనాలు కలిగి ఉన్న సబ్బులు వాడుతున్నామంటే, మనం మన శరీరం మరియు ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నామన్న మాటే.
No comments:
Post a Comment