Saturday, June 27, 2020

పండ్ల తోటలో కలుపు సమస్య నివారణకు సహజ నివారణ ?

పండ్ల తోటలో కలుపు సమస్య నివారణకు ?

పండ్ల తోటలు పెట్టుకున్న మిత్రులు కలుపు సమస్యతో చాలా బాధ పడుతున్నారు.. కావున మీ తోటల్లో "స్టైలో హమాట" పెంచండి.. నత్రజని శాతం పెరగటమే కాకుండా కలుపును ఎక్కువగా రానివ్వదు మరియు మన ఆవులకు పశువులకు జీవాలకు మేతగాను ఉపయోగపడుతుంది 

స్టైలో హెమాటా వర్షాధారం
జూన్, జులై మాసాల్లో సాగు చేయాలి.

నీటిపారుదల సమాయం
ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఎకరాకు 10 కిలోల విత్తనాలు, తోటలలో అయితే 4 నుంచి 5 కిలోల విత్తనాలు. విత్తనాలు వెదజల్లుతూ, మరీ ఎక్కువ లోతుగా పడకుండా జాగ్రత్తపడాలి. విత్తనాలు విత్తేముందు 85 డిగ్రీ సెంటిగ్రేట్‌ వేడి నీటిలో 5 నిమిషాలు ఉంచి ఆరబెట్టాలి. 

దుక్కిని చదునుచేసి నేలలో ఒక సెంటీమీటర్‌ లోతులోనే విత్తనాలు పడేట్లుగా ఎదచల్లాలి. అనంతరం విత్తనాలపై మట్టి పడేలా చేయాలి. స్టైలో పశుగ్రాసం సాగు చేయడానికి ఎరువులు అవసరం లేదు. కాని వేయాలంటే  ఘనజీవామృతం మరియు జీవామృతం పారించుకోవచ్చు. 

30 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. స్టైలో పచ్చిమేతలు విత్తిన 75 రోజులకు మొదటి సారి కోతకు వస్తాయి. ప్రతి 50 రోజులకు ఒకసారి 8–10 కోతలు వస్తాయి. ఒకసారి సాగుచేస్తే నాలుగు నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది. హెక్టారుకు ఏడాదికి వర్షాధారంగా 30–35 టన్నులు, నీటిపారుదల ఆధారంగా 50 టన్నుల వరకు పచ్చిమేత దిగుబడి వస్తుంది. వర్షాకాలంలో విత్తనాలు పొలంలో రాలే విధంగా గడ్డిని కోసుకుంటే మరుసటి ఏడాది గడ్డి విస్తారంగా పెరిగే అవకాశం ఉంటుంది. 

స్టైలో పశుగ్రాసంలో జీర్ణమయ్యే మాంసకృత్తులు 12.15 శాతం, శక్తినిచ్చే పోషకాలు 60 శాతం, కార్బోహైడ్రెట్స్‌ 2 శాతం ఉంటాయి. ఈ మేతతో గొర్రెలు, మేకలు, పాడిపశువులకు ఆరోగ్యకరంగా ఉంటుంది. పాడిపశువులు సమృద్ధిగా పాలిస్తాయి.


న్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

టార్పాలిన్స్1099 మాత్రమే, 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com


  ఎకరం సాగు చేస్తే ఏడాది వరకు 50 గొర్రెల మేతకు సరిపోతుంది. పాడిపశువులకు ఈ పశుగ్రాసాన్ని రోజుకు 2 కిలోల చొప్పున ఇతర మేతలతో కలిపి వేయాలి.


No comments:

Post a Comment

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...