Saturday, June 27, 2020

జై జవాన్ జై కిసాన్

*శతృ భయంకర ఆయుధం "కాళి"*

ఇది మానవ మనుగడకు బారి మలుపు తిప్పిన విధ్వంసకర సృష్టి. మనిషి పుట్టిన తొలి నాళ్ళలో తన ఆకలి తీర్చే వేటని సులువుగా వేటాడడానికి కనిపెట్టిన ఈ ఆయుధం తరువాత రూపులు మారుతూ అహంకారపు అధిపత్యానికి ఒక చిహ్నంగా , మంచి - చెడులు మధ్య పోరాటానికి ఒక ఆసరాగా మారింది. తమ స్వప్రయోజనాల కోసం ఇతరులను నాశనం చేయాలి అని తలచే దుష్టులు తమ కార్యం సాధించటం కోసం ఈ ఆయుధాన్ని చేతభూని అందరిని భయబ్రాంతులకు గురిచేయాలని ఉబలాట పడితే అటువంటి వారినుంచి తమని తాము రక్షించుకోడానికి  , దుష్ట చర్యలు పెచ్చరిల్లినప్పుడు అవసరమైతే వారిని శిక్షించటానికి తక్కిన వారు ఈ ఆయుదాన్నే ఆశ్రయించారు. 

ఆ తరుణంలో మానవ మేదస్సు రకరకాల బలమైన సమర్ధవంతమైన ఆయుధాలను తయారు చేయడానికి పూనుకోగా దాని ఫలితంగా ఎన్నోరకాల ఆయుధాలను వివిధ దేశాల వారు సమకూర్చుకున్నారు. అటువంటి దేశాలలో మన దేశం కూడా అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ అత్యాధునిక అత్యంత విద్వంసకర ఆయుధాలను సొంతంగా తయారు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో మన పేరు చెబితేనే కళ్ళలో నిప్పులు పోసుకొనే దాయాది దేశం ఆ దేవత పేరు స్మరణకు రాగానే ఉలిక్కిపడి చెమటలు తుడుచుకుంటుంది , ఎప్పుడూ ఒక చేతిని స్నేహహస్తంలా చాపి మరోచేతిలో కత్తి పట్టుకొని వెన్నుపోటు పొడవాలని చూసే గుంటనక్క చైనా ఆ మాత పేరు వినగానే బిక్కచచ్చిపోతుంది. ఆయుధాల గురించి మాట్లాడుతున్న సమయంలో ఒక దేవత పేరు మధ్యలో ఎందుకు వచ్చింది, అసలు ఆ దేవతకి ఆయుధాలకి సంబంధం ఏమిటి , ఆ దేవత పేరు చెబితే మన శత్రుదేశాలు ఎందుకు వణికిపోతున్నాయి. అనేక సందేహాలకు సమాధానం ఈ ఆర్టికల్ చెబుతుంది.

అది 2012 ఏప్రిల్ 7 వ తేదీ లడాక్ లోని సియాచిన్ గ్లాసియర్ వద్ద పాకిస్తాన్ వైపు ఉన్న గయారీ సెక్టార్ అక్కడ తమ స్తావరాన్ని ఏర్పాటు చేసుకున్న పాకిస్తాన్ సైన్యంపై అర్ధరాత్రి 2 గంటల సమయం లో ఉన్నట్టుంది బారి మంచు విరుచుకు పడింది ఉన్నట్టుంది ఆ హిమశికరం పై ఉద్బవించిన అవలాంచీ కింద ఉన్న పాకిస్తాన్ సైనికుల పాలిట యమపాశం అయ్యింది. దాయాది దేశ సైనికులు ఎన్నడూ చూడని అంత పెద్ద అవలాంచ్ దెబ్బకి ఆ దేశంతో పాటు యావత్ ప్రపంచం ఉలిక్కి పడింది, అత్యాధునిక మిషన్ లు ఉపయోగించి మన పొరుగు దేశం అక్కడి మంచును తొలగించడానికి సుమారు మూడు నెలలు సమయం పట్టగా అందులో 140 మంది పాకిస్తాన్ సైనికులు హిమ సమాధి అయినట్లు గమనించారు. ఈ సంఘటన జరిగిన తరువాత ఆ దేశ మీడియా ఒక పక్క చనిపోయిన సైనికులకు సంతాపం తెలియజేస్తూనే మన కాళీ మాతపై ఒక ఆసక్తికరమైన విషయం బయటపెట్టింది. పాకిస్తాన్ ప్రభుత్వం ద్వారా వచ్చిన ఈ న్యూస్ లో ఈ దుర్ఘటనకు కారణం కాళీ మాత ఆగ్రహమే అని దాని సారాంశం దానితో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడగా దాయాది దేశం మాత్రం గజగజలాడింది , కాళీ మాతకు కోపం వస్తే ఇక మాదేశం బ్రతుకు ఏమి కావాలని ఆర్తనాదాలు పెట్టటం మొదలు పెట్టింది, మన పురాణాలలో చెప్పబడిన మహాశక్తి కాళీమాతకి పాక్ సైన్యం పై ఉన్నట్టుండి కోపం ఎందుకు వచ్చింది, అసలు మన కాళీమాత అవలాంచ్ సృష్టించటం ఏమిటి? అని ఆశ్చర్య పోతున్నారు కదూ....., ఐతే ఒకసారి చరిత్రలోకి వెళ్లాల్సిందే ఎన్నో ఏళ్ళుగా మన దాయాది దేశంతో జరుగుతున్న గొడవలు , మరో పక్క స్నేహం నటిస్తూనే పక్కలో బల్లెం లా తయారైన చైనా తో పాటు భవిష్యత్ లో మన దేశం పై కాలు దువ్వాలని చూసే దేశాలకు సమాధానం చెప్పటానికి మనం ఒకసారి 1989 కి వెళ్ళాలి, ఆనాడు మన శాస్త్ర వేత్తలు దేశ రక్షణకోసం ఒక అత్యాధునిక ఆయుధం కావాలని ఆలోచించి వారి ప్లాన్ ని నాటి మన దేశ ప్రభుత్వానికి చెప్పగా అందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది , దాంతో మన దేశంలోనే అత్యుత్తమైన బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్లో డాక్టర్. రాజగోపాల్ చిదంబరం నేతృత్వం లో చరిత్ర ఎన్నడూ చూడని ఒక అద్భుతమైన కార్యానికి శ్రీకారం చుట్టింది. ఈ చిదంబరం ఆధ్వర్యంలోనే మన దేశం అణ్వస్త్ర సామర్థ్యం పొందటానికి కారణమైన పోక్రాన్1, పోక్రాన్2 టెస్టులు జరిగాయి అంతే కాదు నేడు మన ప్రదానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం లో చీఫ్ సైంటిఫిక్  అడ్వైజర్ గా ఉన్నారు మొదట ఆ మెషిన్ ఆరంభంలో తమ లక్ష్యం వేరని ప్రపంచానికి చెప్పిన ఎప్పుడైతే ఆ మెషిన్ లో మన దేశ DRDO వారు పాల్గొన్నారో అప్పుడు దాని రూపురేఖలు మొత్తం మారిపోయాయి. పాక్ తో పాటు చైనా కలవరపాటుకి కారణం బాబా అటమిక్ సెంటర్ వారు DRDO వారు చేస్తున్న ఆ మెషిన్ నే ఆ మెషిన్ పేరే *#కాళీ......*

మన హిందూ ధర్మంలో అమితమైన శక్తి కి వినాశనానికి  ప్రతీకగా భావించే కాళీమాత పేరును దీనికి పెట్టటం వెనుక ఈ ఆయుధం సృష్టించే వినాశనం అంత భయంకరం గా ఉండటం ఒక కారణంగా ఉన్నా  దీని వెనక ఉన్న అసలు అర్థం ఏంటంటే Kilo Ampere Linear Injector దీన్ని షార్ట్ కట్ లో కాళీ *KALI* గా పిలుస్తున్నారు.

2012 లో జరిగిన అవలాంచ్ లో తమ సైనికులు చనిపోవడం వెనుక ఈ కాళీ హస్తం ఉందని , అవలేంచ్ సహజం గా వచ్చేది కాదని దాన్ని కాళీతో సృష్టించారని ఆ ఆపరేషన్ పేరు వైట్ వాష్ అని పాక్ ఆరోపిస్తూ వస్తుంది , దానికి భారత ప్రభుత్వం అలాంటిది ఏదిలేదు అని చెబుతున్నా పలు విదేశీ వార్తా సంస్థలు భారతదేశం *కాళీ* అనే అత్యాధునిక ఆయుధాన్ని తయారు చేస్తుంది  దాని ముందు అమెరికా వంటి దేశాలు కూడా నిలబడలేవు అని చెబుతున్నాయి. ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా మన దేశ ప్రభుత్వం మాత్రం దీన్ని చాలా రహస్యంగానే ఉంచింది. అమెరికా ఇప్పటికే ప్రోటాన్స్ సాయంతో చేసిన  అత్యాధునిక లేజర్ వెపన్ సిస్టం ని ఈ మధ్యనే విజయవంతంగా ప్రయోగం జరిపింది ఇదే తరహలో ఎలక్ట్రాన్స్ సహాయంతో పనిచేసే అత్యాధునిక ఎలక్ట్రో మ్యాగ్నటిక్ రేడియేషన్ టెక్నాలజీ ఉపయోగించి కాళీ వెపన్ ని తయారు చేశారు. లేజర్ వెపన్ నిర్దేశించిన లక్ష్యానికి పెద్ద రంద్రం చేసుకుంటూ పోయి దాన్ని మొత్తం నాశనం చేస్తుంది. ఐతే ఈ *కాళీ వెపన్* మన దేశంపైకి దండెత్తివచ్చే అన్ని రకాల యుద్ధ వాహనాలు , షిప్పులు , విమానాలు , మిస్సైల్స్ నుంచి అంతరిక్షం నుండి మన పై కన్నేసే స్పై శాటిలైట్ వరకు ఇది పంపించే ఎలెక్ట్రాన్ దెబ్బకి అన్నిటిని పనిచేయకుండా చేస్తుంది. దానితో అవి ఎక్కడికక్కడ ఆగిపోవడం లేదా కూలిపోవడమో జరుగుతుంది. ఇంకా అర్ధమైఎలా చెప్పాలి ......అంటే మన ఇళ్లల్లో ఎప్పుడైనా సడన్ గా హై వోల్టేజ్ కరెంట్ వస్తే దాని ఎఫెక్ట్ తో ఇంట్లో ఉండే టీవీ లు ఫ్రీజ్ లు వంటి ఎలెక్ట్రానిక్ పరికరాలు పాడైపోతాయి అందుకు కారణం ఏంటంటే మనము ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువు ఒక పరిమితి పవర్ మాత్రమే తీసుకొని పనిచేస్తుంది అంతకంటే ఎక్కువ ఐతే అవి పాడైపోతాయి , నేడు ఈ భూమి మీద ఉపయోగిస్తున్న దాదాపు అన్ని వస్తువులు ఎలక్ట్రానిక్ వే అందువల్ల వాటన్నిటికి ఈ ముందు చెప్పిన తీరీనే అప్లయ్ అవ్వుతుంది ఈ తీరి ని ఉపయోగించి కాళీ అని పేరు పెట్టారు మన శాస్త్రజ్ఞులు , ఈ ఆయుధాన్ని గురి పెట్టిన లక్ష్యాలపై అమితంగా వెలువడే ఎలెక్ట్రాన్ కిరణాల వల్ల ఆ లక్ష్యాలలోని ఎలక్ట్రానిక్ వ్యవస్త మొత్తం సర్వనాశనమై అది దేనికీ పనికి రాకుండా పోతుంది. ఇప్పటికే మన శాస్త్రవేత్తలు ఈ మిషన్ లో
 #కాళీ 80 ,
 #కాళీ 200 , 
 #కాళీ 1000 ,
 #కాళీ 5000 , అనే వివిధ రకాల వివిధ సామర్థ్యం గల ఆయుధాలను సిద్ధం చేసారని ఇప్పుడు
 #కాళీ 10000 పేరుతో అత్యంత ప్రమాధకరమైన ఆయుధాన్ని తయారు చేసే పనిలో ఉన్నారని అదికూడా అతి త్వరలో సిద్ధం కాబోతున్నదని ఒకవేళ అది సిద్ధం ఐతే అంతరిక్షిం నుంచి మనపై రహస్యంగా నిఘాపెట్టే చైనా శాటిలైట్స్ కూడా తప్పించు కోలేవని విదేశీ వార్త సంస్థలు పలు వార్త కథనాలను ప్రచురిస్తున్నాయి, ఐతే మన దేశ ప్రభుత్వం గానీ అధికారులు గాని ఈ సీక్రెట్ మిషన్ పై ఎటువంటి సమాచారం ఇవ్వటం లేదు . ఐతే మళ్ళీ చాలా మందికి ఈ ఆయుధం కేవలం ఎలెక్ట్రానిక్ వస్తువులు మాత్రమే పాడు చేయగలదని మరి ఇది అవలేంచ్ నిం ఎలా సృష్టించగలదు అనే సందేహం కలగవచ్చు భారత దేశము నిజంగానే అవలేంచ్ ని సృష్టించిందో లేదో తెలియదు గాని , ఈ టెక్నాలజీ తో అది సాధ్యపడుతుంది అని పలువురు నిపుణులు తెలియచేస్తున్నారు అందుకు ఎలెక్ట్రాన్ బీమ్ వెల్డింగ్ మెషిన్ అనే ఒక రకమైన మెషిన్ ఉపయోగపడుతుందని దీని ద్వారా దాని శక్తివంతమైన ఎలెక్ట్రాన్ బీమ్ కిరణాలు పంపించి లావు పాటి మెటల్స్ ని సైతం కరిగించటం లేదా కట్ చేయటం చేయవచ్చు అని అంటున్నారు , భారత్ దేశం కూడా దీన్నే ఉపయోగించి గ్లరియన్ సెక్టర్ లో అవలాంచ్ ని సృష్టించింది ని అని పాక్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆరోపణలు ఎలా ఉన్నా ఇప్పుడు భారత్ దేశం దగ్గర ఉన్న కాళీ టెక్నాలజి ఇంక మరి కొన్ని నెలలలో రాబోతున్న కాళీ 10000 వెపన్ దెబ్బకి దాయాది దేశం తో పాటు, మనకంటే బలవంతులము అని విర్రవీగే చైనా సైతం గజగజ వణికి పోతుంది.
#భారత్_మాతాకీ_జై_జై_హింద్.

#జై #హింద్.
#జై #భారత్.

No comments:

Post a Comment

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...