Thursday, October 29, 2020

రైతు సాధించిన విజయం ..1

మిత్రులకు  నమస్తే.

1987 లో.డిగ్రీ వరకు  చదివిన నాకు  1992 వరకు ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది..చిన్నప్పటి నుంచి నాన్న గారికి ఆసరాగా ఉన్న నేను 1990 సంవత్సరం లో గుంటూరు ప్రకాశం జిల్లాల నుంచి కొంత మంది రైతులు గాంధారి కామారెడ్డి ప్రాంతానికి వలస వచ్చి భూములు కౌలుకు తీసుకొని పత్తి పంటలు వేసారు .

కౌలుకు భూములు ఇచ్చి వారికే 10 రూపాయల కూలీకి ఆడవారు 30 రూపాయల కూలీకి మగవాళ్ళు  లభించే వారు...నేను కూడా ఎందుకు పత్తి పంటలు వేయరాదనే ఉద్దేశంతో..10 ఎకరాల భూములు ఎకరాకు పది వేయి రూపాయల చొప్పున కౌలుకు తీసుకొని పత్తి పంటలు వేస్తే 10 ఎకరాల భూమి లో 110 క్వింటాళ్ల పత్తి  రెండు సంవత్సరాలు పండించాను ఆరోజుల్లో 12నుండి 15 వందల రూపాయలకు క్వింటాలు అమ్ముడు పోయేది రెండు సంవత్సరాల లో 3 లక్షల రూపాయలు చేతికి రాగా 1994 లో రెవెన్యూ శాఖ లో తహసిల్దారు గా  పనిచేస్తున్న ఒకరు భూముల అమ్మకానికి ఉన్నది అని తెలిసి నేను వెల్లి  కొనాలని ఉంది అని ఏ ఉద్యోగం లభించడం లేదు అని వినయంగా కోరగా  ఎంతో మంది పోటీ పడినా  ఆయన  ఎకరా16 వేల చొప్పున 4 లక్షలకు 25 ఎకరాల భూమి బేరమాడితిమి. నా వద్ద ఉన్న 3 లక్షల రూపాయలు మూడు నెలల వాయిదాలలో చెల్లించడం జరిగింది...ఇందులో  ఏ దాపరికం లేదు  సారవంతమైన నల్ల రేగడి భూములు కావడంతో నేటికీ కూడా పాత పద్ధతి ప్రకారం చెరకు పత్తి సోయా  మొక్క జొన్న వరి  పంటలు అందిస్తున్నాం..ఏనాడూ కూడా నష్టాలు చూడలేదు..2000 సంలో 20 లక్షలు ఖర్చు పెట్టి మంచి షాపింగ్ కాంప్లెక్స్ ఇల్లు  కూడా వ్యవసాయ ఆదాయం తో నిర్మాణం పూర్తిగావించినాను..కష్టపడి పనిచేసిన  నాలాంటి వారికి  అంతా మంచే జరుగింది...ధన్యవాదములు




మీ అభివృద్ధిని కోరుకునే
రైతులసంస్థ
చార్వి ఇన్నోవేషన్స్

No comments:

Post a Comment

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...