Saturday, September 26, 2020
ఆహార విహార నియమాలు - ఋతువును మార్చుకుంటే మంచిది
గాయం చేసిన ఘనత... ఈ సరస్వతి పుత్రుడు
Thursday, September 17, 2020
పెరుగు ఎరువు .....సాధ్యమేనా
Wednesday, September 16, 2020
silpaulin గురించి ముఖ్యమైన సమాచారం
HDPE Tarpaulin గురించి ముఖ్య సమాచారం
వ్యవసాయంలో లాభాలు రావాలంటే
భారతదేశం వ్యవసాయము ప్రధాన జీవనఆధారంగా ఉన్నదేశం.
దోమలను తరిమికొట్టే మొక్కలివే..ఇప్పుడే పెంచడం మొదలు పెట్టండి
ప్రస్తుత కాలంలో దోమల బెడద మామూలుగా లేదు. కాస్త చినుకులు పడితే, మురుగు కాల్వ పొంగితే చాలు విజృంభిస్తాయి. సాయంత్రం అయితే చాలు ప్రతి ఒక్కరి రక్తం పీల్చేసేందుకు సిద్ధమైపోతాయి. దీంతో ఆలౌట్, కాయిల్స్, దూపం, క్రీములూ అంటూ రకరకాల ఆయుధాలను మనం ప్రయోగిస్తాం. ఇలాంటి రసాయనాలతో కాకుండా సహజసిద్ధంగా దోమల దండు నుంచి మనల్ని కాపాడే మొక్కలు ఉన్నాయి. వాటిని మన గార్డెన్‌లోనో, ఇంటిలోనో పెంచుకుంటే దోమల బెడద నుంచి కుటుంబాన్ని రక్షించుకోవచ్చు. అవేంటంటే..?
లావెండర్
లావెండర్ ఉత్పత్తులు చర్మ సౌందర్యానికి ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలానే రూం స్ప్రేలు తయారీలోనూ వాడుతుంటారు. లావెండర్ మొక్క ఉన్న చోట దోమలు గానీ, ఇతర కీటకాలు గానీ తిరగవు. కారణం ఆ మొక్క ఆకుల్లో ఉత్పత్తి అయ్యే ఆయిల్‌కు దోమలు, కీటకాలు నశిస్తాయి. ఈ మొక్కలు ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగలవు. అయితే కాస్త వెచ్చని ప్రాంతాల్లో లావెండర్ మొక్కలు పెరగగలవు.
బంతిపూల మొక్కలు
ఏదైనా శుభకార్యాలు, పండుగల సందర్భంగా బంతిపూలను వాడుతుంటాం. పూల వాడకం వెనుక కూడా శాస్త్రీయపరమైన కారణాలూ ఉన్నాయి. బంతిపూల మొక్కలు కూడా దోమల నుంచి మనల్ని కాపాడతాయి. చాలా సులువుగా చిన్న కుండీల్లో బంతి మొక్కలను ఇంటి ప్రవేశ ప్రాంతంలో పెంచుకుంటే దోమలను అరికట్టొచ్చు. అంతేకాదు ఇంటి అలంకరణకూ ఉపయోగపడతాయి.
పుదీనా జాతికి చెందిన మొక్కలు
* క్యాట్‌పిన్
పుదీనా రకానికి చెందిన మొక్క క్యాట్‌పిన్. ప్రతి చోటా ఇలాంటి మొక్కలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. దోమలను తరిమేయడంలో క్యాట్‌పిన్ మొక్క ఎంతో సమర్థంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చాలా తేలికగా ఈ రకం మొక్కలు పెరుగుతాయి. ఓ కుండీలో నల్లమట్టితో ఎలాంటి వాతావరణంలోనైనా మొక్క పెరుగుతుంది. సహజ సిద్ధంగా దోమలను నివారణకు సరిగ్గా పని చేస్తుంది.
* రోజ్‌మ్యారీ
రోజ్‌మ్యారీ మొక్క కూడా పుదీనా జాతికి చెందినదే. ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలాగే దోమలను తరిమికొట్టడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మొక్కను మన ఇళ్లల్లోని బాల్కనీలు, పెరడులోనూ తేలికగా పెంచుకోవచ్చు. రోజ్‌మ్యారీ మొక్కతో దోమలనే కాకుండా ఇతర కీటకాలను కూడా నివారించవచ్చు.
* తులసి
తులసి ఆకులు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో.. దోమలను తరిమేయడంలోనూ అలానే సాయపడుతుంది. దైనందిన ఆహారంలో తులసిని ఓ భాగం చేసుకునేవారు ఉన్నారు. ఉదయాన్నే మనం సేవించే తేనీటిలో ఓ రెండు తులసి ఆకులు వేసుకుంటే ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే ఆరోగ్యానికి, ఇటు దోమల నుంచి రక్షణకు ఇంటి ఆవరణలో ఓ తులసి మొక్కను పెంచుకోవడ ఉత్తమం.
* పుదీనా
సంవత్సరం పొడువునా పచ్చదనం పంచే అరుదైన మొక్కల్లో పుదీనా ఒకటి. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆరోగ్యం పరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్న పుదీనా మొక్క ఇంట్లో ఉంటే దోమలు కూడా దరిచేరవు.
Sunday, September 13, 2020
సొంతషాప్ & సొంత తయారీ లేదు కాని ప్రపంచ కోటీశ్వరుడు ఎలా ??
‘నేను ప్రయత్నించి విఫలమైతే పెద్దగా బాధపడను. అసలు ప్రయత్నించకుండానే ఉండడమనే నిర్ణయమే నన్ను ఎక్కువ బాధపెడుతుంది.’’
-ఒక సందర్భంలో జఫె్ బెజోస్ అన్నమాటలివి.
ఈ ఆలోచనా ధోరణే అతన్ని ఆ స్థాయికి చేర్చి ఉండొచ్ఛు ప్రపంచంలోనే అత్యంత కుబేరుడిని చేసి ఉండొచ్ఛు భూగోళం మొత్తం మీద 200 బిలియన్ డాలర్ల ( దాదాపు రూ.15 లక్షల కోట్లు) నికర విలువను కలిగి ఉన్న ఏకైక వ్యక్తిగా నిలబెట్టి ఉండవచ్ఛు విత్తనం కూడా భూమిని చీల్చుకుని బయటకు వస్తేనే మొక్క అవుతుంది. అలాంటిది ఈ స్థాయి విజయం సాధించాలంటే ఎంత కష్టపడి ఉండాలి.అమెజాన్‌కు సీఈఓగా, ద వాషింగ్టన్ పోస్ట్ యజమానిగా, అంతరిక్ష కంపెనీ బ్లూ ఆరిజిన్‌కు వ్యవస్థాపకుడిగా.. ఇలా ఎన్నో విజయవంతమైన వ్యాపారాలను నిర్వహించిన బెజోస్ జీవితం ఎవరికైనా ఆసక్తికరమే.
టెడ్ జోర్గెన్‌సన్, జాక్లిని గిజ్ జోర్గెన్‌సన్ దంపతులకు 1964లో జఫె్ బెజోస్ జన్మించారు. ఆయన పుట్టే సమయానికి, తండ్రి బైక్ షాపు యజమాని కాగా.. తల్లి జాక్లిని 17 ఏళ్ల విద్యార్థిని. బెజోస్‌కు నాలుగేళ్ల వయసున్నపుడు తల్లి మైక్ బెజోస్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 1986లో ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పట్టా పుచుకున్న బెజోస్‌కు ముందు నుంచీ కంప్యూటర్లపైన ఆసక్తి. తన తల్లిదండ్రుల గ్యారేజ్‌ని ఒక లేబొరేటరీగా మార్చాడు కూడా. టీనేజ్ వయసులో తన కుటుంబం మెక్సికో నుంచి మియామీకి వెళ్లే సరికే ఆ ఆసక్తి ఉంది.
వాల్‌స్ట్రీట్‌లో అడుగు
ప్రిన్స్‌టన్ నుంచి బయటకు వచ్చాక.. న్యూయార్క్‌లోని వాల్‌స్ట్రీట్‌లో బెజోస్ పలు కంపెనీల్లో పనిచేశారు. 1990లో డి.ఈ. షాలకు అత్యంత పిన్న వయస్కుడైన వైస్ ప్రెసిడెంట్‌గానూ మారారు. ఫైనాన్స్‌లో కొనసాగడానికి అతని మనసు ఎంత మాత్రం అంగీకరించకపోవడంతో 1994లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
తొలి అడుగు అదే..
అతనికున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో ఇ-కామర్స్ ప్రపంచంలోకి అడుగుపెడదామని అనుకున్నాడు. 1995లో ఆన్‌లైన్ బుక్‌స్టోరును ప్రారంభించారు. దాని పేరే అమెజాన్.కామ్. అదృష్టమో..పడ్డ కష్టమో ఏమో కానీ.. ఎటువంటి ప్రచారమూ లేకుండానే.. అమెరికాతో పాటు 45 దేశాల్లో 30 రోజుల్లో పుస్తకాలు భారీగా విక్రయించారు. రెండు నెలల్లోనే వారానికి 20,000 డాలర్ల అమ్మకాలు జరిగాయి. గ్యారేజీ నుంచి రెండు పడక గదుల ఇంటికి కార్యకలాపాలను మార్చారు.
1997లో అమెజాన్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసినపుడు చాలా మంది విశ్లేషకులు పెదవి విరిచారు. షాపులున్న వారే సొంతంగా ఇ-కామర్స్ సైట్లు నిర్వహిస్తున్న వేళ ఎటువంటి షాపులూ లేకుండా ఎలా విజయం సాధిస్తారని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే రెండేళ్ల తర్వాత అందరికీ సమాధానం దొరికింది. అది కూడా చాలా బలంగా. ఎందుకంటే పోటీదార్ల కంటే ఎంతో వేగంగా ఇ-కామర్స్ దిగ్గజంగా అమెజాన్ మారింది. పుస్తకాల దగ్గరే ఆగిపోతే.. అమెజాన్ గురించి కానీ.. బెజోస్ గురించి కానీ ప్రపంచానికి తెలిసేది కాదు.
1998లో సీడీలు, వీడియాలను విక్రయించడం మొదలుపెట్టిన బెజోస్ క్రమంగా.. దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బొమ్మలు.. ఇలా అన్నిటినీ విక్రయిస్తూ.. వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోయారు. 1995లో 510,000 డాలర్ల వార్షిక అమ్మకాలు కాస్తా 2011 నాటికి 17 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2018 నాటికి అమెజాన్ పెయిడ్ చెల్లింపుదార్లు 10 కోట్లకు చేరుకోవడం గమనార్హం. అదే ఏడాది సెప్టెంబరుకు అమెజాన్ విలువ లక్ష కోట్ల డాలర్లకు చేరుకుని.. యాపిల్ తర్వాత ఆ స్థాయికి చేరుకున్న సంస్థగా నిలిచింది.
కరోనా సమయంలోనూ..
ఈ ఏడాది జనవరి 1న బెజోస్ నికర విలువ 115 బిలియన్ డాలర్లే. అయితే అమెజాన్ షేరు అప్పటి నుంచి ఇప్పటి దాకా 80 శాతం దూసుకెళ్లడంతో అందులో బెజోస్‌కున్న 11 శాతం వాటా(90 శాతం నికర సంపద ఇందులోదే) కూడా కాసులు కురిపించింది. కరోనా వల్ల వినియోగదార్ల ధోరణిలో వచ్చిన మార్పే 56 ఏళ్ల బెజోస్‌ను 200 బి. డాలర్ల నికర సంపదను అధిగమించేలా చేసింది.
* బెజోస్‌కు అంతరిక్షంలో ప్రయాణించాలన్న కోరిక ఉంది. అందుకే స్పేస్‌లోకి వెళ్లే నౌకలను తయారు చేయడానికి తన సంపదలో కొంత భాగాన్ని ఖర్చు చేస్తున్నారు.
* 2020లో 100 మి. డాలర్లను ఫీడ్ అమెరికా అనే లాభాపేక్ష రహిత సంస్థకు విరాళం ఇచ్చారు. దీని ద్వారా అమెరికాలో ఆకలితో ఉన్న వారికి చేయూతనిచ్చారు.
* కరోనా సమయంలోనూ 1,75,000 మందికి ఉద్యోగాలిచ్చారు.
* 2026 కల్లా లక్ష కోట్ల డాలర్ల(ట్రిలియన్ డాలర్లు)ను సాధించే తొలి వ్యక్తి ఈయనే అవుతారన్న అంచనా ఉంది.
* గతేడాది తన భార్యతో విడాకులకు సంబంధించిన సెటిల్‌మెంట్ కింద అమెజాన్‌లో 25% వాటా ఇచ్చారు. ఆ వాటా విలువ ఇపుడు 63 బి. డాలర్లు.
* డేవిడ్ జిఫెన్‌ను చెందిన వార్నర్ ఎస్టేట్‌ను 165 మి. డాలర్లతో కొనుగోలు చేశారు. ఇంతకంటే విలాసమైన కలల సౌధం ఈ ప్రపంచంలో ఉండదని వినికిడి
భూమిలో వేపపిండి వేసుకోవటం వలన పంటకు కలిగే కొన్ని లాభాలు
నిత్యా జీవితంలో మనం వినే కొన్ని సెక్షన్స్ వాటి వివరాలు
దేశీ వరి రకాలు
దేశీ వరి రకాలు 1) రక్తశాలి >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...
-
స్థలాలు లేదా ఇల్లు కొని లేదా అమ్మినప్పుడు Brokers, Banks నమ్మకంగా మన పక్కనే ఉండే వాళ్ళు చేసే మోసాలు. చాలా మంది తెలియక మోసపోతూ ఉంటారు వారికోస...
-
వరిలో దొడ్డురకాలు మీ దిగుబడిని ప్రభావితం చేసే ముఖ్యమైన వరి తెగులు/చీడపీడల ఏమిటి? వరి పంట చక్రం యొక్క వివ...
-
ఒక ఎకరాకు = 40 గుంటలు 2) ఒక ఎకరాకు = 4840 Syd 3) ఒక ఎకరాకు = 43,560 Sft 4) ఒక గుంటకు = 121 Syd 5) ఒక గుంటకు = 1089 Sft 6) ఒక స్క్వయర్...