పెరుగు ఎరువు... ఎలా?
యూరియాకు ప్రత్యామ్నాయం స్థానిక ఆవు పాల పెరుగు:
ఒక్క 50 కిలోల యూరియా బ్యాగ్ కంటే, 2 కిలోల స్థానిక ఆవు పాల పెరుగుతో చేసిన ప్రయాగం ఎంతో మేలైన ఫలితాలు ఇస్తోంది.
50 కిలోల యూరియా కి బదులుగా, 15 రోజులు 2కిలోల స్థానిక ఆవు పాల పెరుగులో రాగి ముక్కముంచి వుంచి,
తరువాత ఆ పెరుగును వంద లీటర్ల నీటితో కలిపి, ఒక ఎకరంలో పిచికారీ చేయాలి.
ఈ పెరుగును చల్లడం ద్వారా, మొక్క వరుసగా 45 రోజులు ఆకుపచ్చగా ఉంటుంది.
యూరియా 25 రోజుల మాత్రమే మొక్కను పచ్చగా ఉంచుతుంది.
2 కిలోల స్థానిక ఆవు పాల పెరుగుతో, 50 కిలోల యూరియా వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందో, అంతకంటే చాలా ఎక్కువ ప్రయోజనము ఉంటుంది మరియు ఖర్చులు కూడా తగ్గుతాయి.
దీన్ని మీరూ ఉపయోగించి ఫలితం చూడండి, ఆపైన మీ అనుభవాలను పంచుకోండి..
సిక్కిం రాష్ట్రం మొత్తం స్థానిక ఆవు పాలను పెరుగును చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తోంది.
యూరియా సిక్కిం రాష్ట్రమంతటా నిషేధించబడింది.
వందే గౌ మాతరం
======
వారెవా.. పులిసిన పెరుగు ద్రావణం!
📷10–15 రోజులు నిల్వ చేసిన పెరుగు ద్రావణంతో పంటలకు సకల పోషకాలు.. చీడపీడలకూ చెక్!
📷రసాయన ఎరువులు, కీటకనాశనులకు బదులుగా వాడుతున్న వేలాది మంది బీహార్ రైతులు
📷కూరగాయ పంటలు, పండ్ల తోటల సాగుతో అధికాదాయం
📷బిహార్ రైతు శాస్త్రవేత్త దినేష్ కుమార్ ఆవిష్కరణ
📷పరిశోధనలకు ఉపక్రమిస్తున్న శాస్త్రవేత్తలు
పంటతోపాటు పాడి కూడా ఉన్న రైతు ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడగలుగుతాడన్న విషయం అనాదిగా మనకు తెలిసిన విషయమే. అయితే, 10–15 రోజులు పులియబెట్టిన పెరుగును చిలికి నీటిని కలిపి తయారు చేసిన పుల్ల మజ్జిగతో చక్కని ప్రకృతి వ్యవసాయోత్పత్తులు పండించవచ్చని బిహార్ రైతులు చెబుతున్నారు. యూరియా, డీఏపీ, ఫాస్పేట్ వంటి ఎటువంటి రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగుల మందులు కూడా చల్లకుండా.. జీవామృతం కూడా వాడకుండా.. కేవలం ‘పెరుగు ఎరువు’తోనే నిశ్చింతగా అనేక ఏళ్లుగా పంటలు పండిస్తుండడం విశేషం
No comments:
Post a Comment