Sunday, July 26, 2020
స్త్రీ అంటే అవసరం కాదు ?
Saturday, July 25, 2020
కర్పూరం గురించి ఆశ్చర్యపోయే కొన్ని నిజాలు ?
90% అనారోగ్యాలకు మూలకారణం ప్రతికూల ఆలోచనలే (Negative thoughts)
Friday, July 24, 2020
భూమిలో వేపపిండి వేసుకోవటం వలన పంటకు కలిగే కొన్ని లాభాలు
Thursday, July 23, 2020
వ్యవసాయ ఉత్పత్తులు ఆన్లైన్ కొనుగోలు చేస్తున్న అన్నదాతలు
*చార్వి ఇన్నోవేషన్స్ సంస్థ ద్వారా ఆన్లైన్ లో షెడ్ నెట్స్ కొనుగోలు చేసిన అన్నదాతలు* *www.chaarviinnovations.com*
Friday, July 17, 2020
తోడులేకుండానే పాలు గడ్డకట్టుకుంటాయి ... ఈ రాయితో
వర్షాధారిత పంటల్లో సమగ్రసస్యరక్షణప్రాముఖ్యత
Tuesday, July 14, 2020
అనంతపద్మనాభస్వామి దేవాలయం గురించి కొంత సమాచారం
Monday, July 13, 2020
అతిపెద్ద సంఖ్య ఎంతో తెలుసా? (GOOGOLPLEXIANTH)
Sunday, July 12, 2020
మొబైల్ ఛార్జింగ్.. ఈ పొరపాట్లు చేస్తున్నారా
మొబైల్‌లో ఛార్జింగ్ అయిపోతుందంటే.. గుండె ఆగిపోయినంత పని అవుతుంది ఇప్పటి యువతకు. మొబైల్ చేతిలో ఉందంటే విశ్వమే అరచేతులో ఉన్నట్లే కదా. అందుకే అందరూ మొబైల్‌ను అతిజాగ్రత్తగా చూసుకుంటారు. ఫోన్‌కి పౌచ్ కొంటారు, టెంపర్డ్ గ్లాస్ వేస్తారు. తరచూ క్లీన్ చేస్తారు. కానీ మొబైల్ ఛార్జింగ్ పెట్టే విషయంలో మాత్రం ఇప్పటికీ కొందరు కొన్ని పొరపాట్లు చేస్తారు. వాటి వల్ల మొబైల్ పాడయ్యే అవకాశాలున్నాయి. మరి ఛార్జింగ్ పెట్టే క్రమంలో అందరూ చేసే పొరపాట్లు ఏంటి? వాటికి పరిష్కారం ఏంటి?
ఛార్జర్‌ను ప్లగ్‌లోనే వదిలేయకండి
చాలా మంది మొబైల్ ఛార్జింగ్ పూర్తయిన తర్వాత కేవలం మొబైల్ నుంచి యూఎస్‌బీ వైర్‌ను మాత్రమే తీసేసి.. ప్లగ్‌లో ఛార్జర్‌ను అలాగే వదిలేస్తారు. అలా వదిలేస్తే ఛార్జర్ నుంచి విద్యుత్ యూఎస్‌బీ వైర్ మొత్తం ప్రసరణ అవుతుంది. కొన్ని సందర్భాల్లో షాక్ సర్క్యూట్ అయ్యే అవకాశముంది. కాబట్టి ఇకపై అలా చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. ఛార్జింగ్ పూర్తయ్యాక ఛార్జర్‌ను ప్లగ్ నుంచి తీసేయడం మంచిదట.
ఫుల్ ఛార్జ్ చేయకండి
చాలా మంది మొబైల్‌ను పూర్తిగా ఛార్జ్ అంటే 100 పూర్తయ్యేవరకు ఆగుతుంటారు. దీని వల్ల మొబైల్ బ్యాటరీ పనిచేసే కాలం తగ్గిపోతుందనే వాదనలూ ఉన్నాయి. ప్రతి బ్యాటరీలోనూ కొన్ని ఖచ్చితమైన ఛార్జ్ సైకిల్స్ ఉంటాయి. అంటే ఒక బ్యాటరీని ఇన్ని సార్లు మాత్రమే ఛార్జింగ్ పెట్టాలి అనేది నిర్ణయించి ఉంటుంది. వాటిని పూర్తిగా ఛార్జ్ చేస్తే అవి తొందరగా పనిచేయడం మానేస్తాయి. నెలలో ఒక్కసారే 100 శాతం ఛార్జింగ్ పెట్టాలని, ఎల్లప్పుడూ ఛార్జింగ్ 20 శాతం నుంచి 80 శాతం మధ్యలోనే ఉంచాలని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.
ఛార్జింగ్ జీరో అయ్యే వరకు చూడొద్దు
కొన్నిసార్లు ఛార్జింగ్ జీరో అయ్యే వరకు మొబైల్‌ను ఛార్జింగ్ పెట్టకుండా వాడుతుంటారు. అది మంచిది కాదు. ప్రస్తుత లిథియం ఆధారిత బ్యాటరీలు ఛార్జ్ సైకిల్స్‌తో పనిచేస్తాయి. ఒకవేళ మీరు ఛార్జింగ్ జీరో అయ్యే వరకు చూస్తే బ్యాటరీతోపాటు మొబైల్ కూడా నెమ్మదిగా పాడైపోతుందని నిపుణులు చెబుతున్నారు.
రాత్రి ఛార్జింగ్ పెట్టి పడుకోవడం
కొందరు రోజంతా మొబైల్ వాడి.. రాత్రి ఛార్జింగ్ పెట్టి పడుకుంటారు. సాధారణంగా రెండు, మూడు గంటల్లో ఛార్జింగ్ ఫుల్ అవుతుంది. కానీ రాత్రంతా ఛార్జింగ్ పెడితే.. మొబైల్ వేడెక్కే ప్రమాదం లేకపోలేదు. కొన్ని గంటలపాటు ఛార్జింగ్ పెట్టి వదిలేస్తే.. బ్యాటరీలోఉండే ఛార్జ్ సైకిల్స్ పాడవుతాయి. అలాగే విద్యుత్ బిల్లు పెరగడం ఖాయం. ఒక్కోసారి మొబైల్ పేలిపోవడమూ జరుగుతుంది. కాబట్టి రాత్రి అంతా ఛార్జి పెట్టడం అంత శ్రేయస్కరం కాదు.
ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్ వాడొద్దు
కొన్నిసార్లు ఛార్జింగ్ పెట్టి మొబైల్‌ను వాడేస్తుంటారు. కొందరు ఫోన్‌కాల్స్ మాట్లాడుతుంటారు. అలా చేయడం వల్ల బ్యాటరీ పాడయ్యే అవకాశముంది. ఛార్జ్ చేయడం.. వినియోగించడం ద్వారా బ్యాటరీపై అధిక ఒత్తిడి పెరుగుతుంది. ఇది మొబైల్‌కు, వినియోగదారుడుకీ చాలా ప్రమాదం. అందుకే మీరలా చేయకండి. మొబైల్‌తో పని ఉంటే ఛార్జింగ్ తీసి పని పూర్తయ్యాక మళ్లీ ఛార్జింగ్ పెట్టండి.
పదే పదే ఛార్జింగ్ బ్యాటరీకి చేటు
మొబైల్ బ్యాటరీలో ఛార్జ్ ఉన్నా కొందరు పదే పదే మొబైల్‌ను ఛార్జింగ్ పెడుతుంటారు. ఎప్పుడు ఫుల్ ఛార్జ్‌లో ఉంచుకోవడం మంచిది కదా అంటుంటారు. అయితే ఇది ఏ మాత్రం నిజం కాదంటున్నారు నిపుణులు. అలా పదే పదే ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ పనికాలం తగ్గిపోతుంది. అందుకే అవసరమైతేనే పెట్టండి.
పౌచ్‌తో మొబైల్‌ను ఛార్జ్ పెట్టొద్దు
స్మార్ట్ ఫోన్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని పౌచ్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే ఫోన్‌ను పౌచ్‌లో ఉంచే చాలా మంది ఛార్జింగ్ పెడతారు. దీని వల్ల పెద్ద ప్రమాదమే ఉంది. ఛార్జింగ్ వల్ల ఫోన్ వేడెక్కే సందర్భంలో పౌచ్ ఆ వేడిని బయటకు రానీయకుండా చేస్తుంది. దీని వల్ల ఫోన్‌లోని ఇతర పరికరాలు వేడేక్కి పాడయ్యే అవకాశముంది. కాబట్టి ఈ విధానాన్ని వినియోగించకపోవడం మంచిదని నిపుణుల అభిప్రాయం.
నాసిరకం ఛార్జర్లు వాడొద్దు
మొబైల్ ఫోన్‌ను కొన్నప్పుడే ఫోన్‌తోపాటు ఒక ఛార్జర్ వస్తుంది. దానిని మాత్రమే వాడాలి. ఛార్జింగ్ అవుతుంది కదా అని ఇతర ఫోన్ల ఛార్జర్లు.. నాసిరకం ఛార్జర్లు ఉపయోగించొద్దు. వేరే ఛార్జర్లు వాడటం వల్ల మీ మొబైల్‌కు ఛార్జింగ్ వేగంగా లేదా నెమ్మదిగా ఎక్కొచ్చు. దీని వల్ల బ్యాటరీ వేడెక్కడం.. పాడవడం జరుగుతాయి. పవర్ బ్యాంకుల వినియోగం విషయంలోనూ ఇంతే.
యాప్‌లతో జాగ్రత్త
మొబైల్ ఛార్జింగ్‌ను పరిశీలించే కొన్ని యాప్స్ ఉంటాయి. అనవసరమైన సమయంలో యాప్స్ బ్యాక్‌గ్రౌండ్ పనిని నిలిపివేసి బ్యాటరీ పనితనాన్ని పెంచుతాయి. అయితే కొన్ని నకిలీ యాప్స్ యూజర్ల మొబైల్ ఛార్జింగ్ తొందరగా అయిపోయేలా చేస్తున్నాయి. అందుకే అలాంటి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకునే ముందు జాగ్రత్త వహించండి. నమ్మదగిన యాప్స్‌ను మాత్రమే వాడండి.
ల్యాప్‌టాప్‌తో ఛార్జింగా..?
ల్యాప్‌టాప్ వాడుతున్న సమయంలో పనిలోపనిగా మొబైల్‌ను యూఎస్‌బీ పోర్టుకు కనెక్ట్ ఛార్జింగ్ చేస్తారు. దీని వల్ల నష్టం లేదు గానీ.. ఛార్జింగ్ చాలా నెమ్మదిగా అవుతుంది. కాబట్టి గోడకుండే ప్లగ్‌లోనే ఛార్జర్‌తో సరైన సమయంలో.. జాగ్రత్తలు పాటిస్తూ ఛార్జింగ్ పెట్టండి. అప్పుడే మొబైల్ బ్యాటరీ పనితనం బాగుంటుంది. మొబైల్ ఎక్కువకాలం మన్నికగా పనిచేస్తుంది.
Friday, July 10, 2020
పీఎం కిసాన్ పతకం లో పథకనికి మీరు హర్హులు లో కాదో తెలుసుకోండి
Thursday, July 9, 2020
వరి సాగుగురించి పూర్తి సమాచారం
వరిలో దొడ్డురకాలు
మీ దిగుబడిని ప్రభావితం చేసే ముఖ్యమైన వరి తెగులు/చీడపీడల ఏమిటి?
వరి పంట చక్రం యొక్క వివిధ దశలలో మీ పంటలపై దాడి చేసే దిగుబడి మరియు వరి నాణ్యత నుండి 5 ముఖ్యమైన తెగుళ్ళు ఉన్నాయి. మీ ప్రయత్నాలకు ఉత్తమమైన రాబడిని నిర్ధారించడానికి ప్రతి తెగులును ఒక నిర్దిష్ట పద్ధతిలో నిర్వహించాలి.
వరి పంట దశలు మరియు ప్రతి దశకు సంబంధించిన తెగులు/చీడపీడల యొక్క సమాచారం ఇక్కడ ఉంది. ప్రతి తెగులు/చీడపీడలు, వాటి ప్రభావం మరియు ఉత్తమ నిర్వహణ విధానం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
మొదటిదశ 1
బలమైన పునాదిని ఎలా ఏర్పాటు చేయాలి?
పంట జీవిత చక్రం యొక్క ప్రారంభ దశలో వరి తెగులు నిర్వహణ గురించి మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు ఇక్కడ ఉన్నాయి.
వరి నారుమడి తయారీ
1) నాణ్యమైన విత్తనాలు తీసుకోవాలి
2) నేలను సూక్ష జీవరాహితము చేసుకోవాలి
3) విత్తనాలను నీటిలో ఉంచి తీసి మొలకలు వచ్చేలా చెయ్యాలి.
4) అప్పటికే సిద్ధం చేసిన నారుమడి ప్రాంతంలో ఈ విత్తనాల్ని చల్లలి
5) పక్షుల నుండి రక్షణ కల్పించాలి
6) నేల స్వభావాన్ని బట్టి ఎరువులు అందించాలి
7) 21 నుండి 29 రోజుల్లో నాటు కోవడం మంచిది.
కలుపు నివారణకు
కలుపు మొక్కలు ఎందుకు పెద్ద ముప్పు?
కలుపు మొక్కలు ప్రమాదకరం ఎందుకంటే పోషకాలు, నీరు మరియు సూర్యరశ్మి వంటి విలువైన వనరుల కోసం అవి మీ పంటతో పోటీపడతాయి, కాబట్టి మొత్తం ఉత్పత్తి నాణ్యతను ప్రభావితం చేస్తాయి. వచ్చే ప్రధాన వ్యాధులు వచ్చే నష్టాలు మరియు నివారణ చర్యలు తెలుసుకుందాం.
సరైన కలుపు మొక్కల నిర్వహణ రెండు ముఖ్యమైన కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది, తరచుగా రైతులు పట్టించుకోరు, ఇది పంట నష్టం మరియు ఉత్పాదకతకు ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది
1) అజోళ్ళను పెంచడం వాళ్ళ కాలుపును నివారించి నత్రజని స్థాపన చెయ్యొచ్చు.
2) మార్కెట్లో చాలా రకాల గడ్డి నివారణ మందులు అందుబాటులో ఉంటాయి.
వరి పంటకు వచ్చే ప్రధాన వ్యాధులు
* కాండం తొలుచు పురుగు ప్రమాదకరమైనది.
* ఎందుకంటే ఇది పంట యొక్క ప్రారంభ దశలో కనిపిస్తుంది, ఇది మొత్తం పంట నాణ్యత మరియు దిగుబడిని ప్రభావితం చేస్తుంది.
* దిగుబడి నష్టాలు 20% నుండి 70% వరకు మారవచ్చు.
* వరి మొక్కలు ఈ కాండం తొలుచు పురుగుకి ప్రారంభ దశ నుండి పుష్పించే దశ వరకు ఎక్కువగా గురి అవుతాయి.
కాండం తొలిచే పురుగును ఎలా గుర్తించాలి?
కాండం తొలుచు పురుగును ఎలా నివారించుకోవాలి?
కాండం తొలుచు పురుగు ఆశించిన మొదటి వారం తరువాత నష్టం జరుగుతుంది, కానీ అప్పుడు నష్టాన్ని నియంత్రించడానికి చాలా ఆలస్యం అవుతుంది. ఆ కారణంగా, పురుగు ఆశించకముందు మీరు చర్య తీసుకోవాలి. వీలైనంత త్వరగా నాట్లు వేసుకోవాలి,ఆలస్యంగా వేయడం వలన దిగుబడి మీద ప్రభావితం చూపెడుతుంది.కాండం తొలుచు పురుడు నివారణకు పురుగు మందు పిచికారి చేసుకోవాలి.
" వెల్ & ,దండ" కాండం తొలుచు పురుగులపై అద్భుతమైన మరియు దీర్ఘకాలిక నియంత్రణను అందిస్తుంది.
సుడిదోమ
సుడిదోమ వరి పంటలో ప్రధానమైనది.
ఇది వరి మొక్కలకు ఆకుల నుండి సారం పీల్చడం ద్వారా నష్టం కలిగిస్తుంది, తరువాత పసుపు రంగులోకి మారుతుంది.
వరి పంటలు ఎండిపోయి, పొలంలో పసుపు నుండి గోధుమ రంగు ప్యాచ్ ఏర్పడతాయి - వరిలో హాప్పర్ బర్న్(ఎండిపోవడం) అని పిలుస్తారు.
సుడిదోమ అధిక తేమ, వాంఛనీయ ఉష్ణోగ్రత, అధిక స్థాయిలో నత్రజని ఉపయోగించడం మరియు గాలి లేని పరిస్థితులలో వృద్ధి చెందుతుంది.
సుడిదోమను ఎలా నియంత్రించాలి?
విత్తే దశలో మీ వరి పంట నిర్వహణ పద్ధతులను ప్రారంభించండి.
సుడిదోమ యొక్క నియంత్రణ చర్యలలో ఒకటి మీరు సుడిదోమను గమనించిన వెంటనే మీ సీడ్‌బెడ్‌లను నీటితో నింపడం.
అయినప్పటికీ, నీరు పెట్టడం ఒక ఎంపిక కాకపోతే మరియు సుడిదోమ ఉధృతి వారి సహజ శత్రువులను మించిపోతున్నాయని మీరు తేల్చిచెప్పినట్లయితే, మీరు వాటిని వదిలించుకోవడానికి మరియు నష్టాన్ని నివారించడానికి సాఫ్ట్ & ప్రభ పురుగు మందులను ఉపయోగించాలి.
రైతుల సంస్థ
చార్వి ఇన్నోవేషన్స్ వారి సైట్ లో దొరుకును
www.chaarviinnovations.com
పాముపొడ తెగులు
వరి పంటలను ఎలా ప్రభావితం చేస్తుంది?
పాముపొడ తెగులు మొక్కల పెరుగుదలకు అంతరాయం కలిగిస్తుంది. ఇది మొక్క యొక్క కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది మరియు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఇది దిగుబడి తగ్గింపుతో పాటు, పోటాకుకు కూడా ఒత్తిడిని కలిగిస్తుంది, ఇది తక్కువ పరాగసంపర్కానికి దారితీస్తుంది.
పాముపొడ తెగులు వరి ఆకులను నాశనం చేయడం ద్వారా వరి ఉత్పాదకత మరియు ధాన్యం నాణ్యతలో తీవ్రమైన నష్టాలకు దారితీస్తుంది, దిగుబడి 50% వరకు తగ్గుతుంది.
కోశ ముడత తెగులును ఎలా నిర్వహించాలి?
పాముపొడ తెగులు కేవలం 21 రోజుల తక్కువ జీవిత చక్రం ఉన్నందున దానిని నిర్వహించడం మరియు నియంత్రణలో ఉంచడం చాలా కష్టం. పాముపొడ తెగుల నివారణకు మొక్కను
ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యమైన విషయం.పాముపొడ తెగులను నివారించడానికి ఉత్తమమైన విధానం నమ్మకమైన శిలీంద్ర సంహారిణిని ఉపయోగించడం.
మీ ధాన్యానికి ఎక్కువ మెరుపుని ఇవ్వండి. సరైన సమయంలో మీ వరి పొలాలకు చికిత్స చేయండి మరియు అధిక దిగుబడి, మెరిసే నాణ్యమైన ధాన్యాలతో బలమైన ముగింపుని ఇవ్వండి .
సమర్థవంతమైన శిలీంద్ర సంహారిణి యొక్క పూర్వ మరియు పంటకోత తర్వాత ఉపయోగించడంతో ధాన్యం రంగు పాలిపోవడాన్ని నివారించవచ్చు.
మెడ విరుపు తెగులు
అగ్గి తెగులు
Wednesday, July 8, 2020
వరిలో సన్న రకాలు
వరిలో దొడ్డు రకాలు
అవసరానికి తగిన ఆవిష్కరణ వేలాది మంది అన్నదాతలకు ఉపయోగకరం అయినది
Tuesday, July 7, 2020
ఆరటి ఆకుల్లో భోజనలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి తెలుసా
దేశీ వరి రకాలు
దేశీ వరి రకాలు 1) రక్తశాలి >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...
-
స్థలాలు లేదా ఇల్లు కొని లేదా అమ్మినప్పుడు Brokers, Banks నమ్మకంగా మన పక్కనే ఉండే వాళ్ళు చేసే మోసాలు. చాలా మంది తెలియక మోసపోతూ ఉంటారు వారికోస...
-
వరిలో దొడ్డురకాలు మీ దిగుబడిని ప్రభావితం చేసే ముఖ్యమైన వరి తెగులు/చీడపీడల ఏమిటి? వరి పంట చక్రం యొక్క వివ...
-
ఒక ఎకరాకు = 40 గుంటలు 2) ఒక ఎకరాకు = 4840 Syd 3) ఒక ఎకరాకు = 43,560 Sft 4) ఒక గుంటకు = 121 Syd 5) ఒక గుంటకు = 1089 Sft 6) ఒక స్క్వయర్...