⚛️🥦🐛🏹🐞 వ్యవసాయ సమగ్ర సస్యరక్షణ కు మరియు విత్తన శుద్ధి అమృత ద్రావణం.
👍 రైతులు ముఖ్యముగా నాణ్యమైన విత్తనాలు/దుంపలు/గడ్డలు/కనుపు కొమ్మలు/నారుమాత్రమే సేకరించాలి.
నర్సరీ నుండి తెచ్చిన మొక్కల పాకెట్స్ లోని PAT CULTURE లో అన్ని రకాల రోగకారకాలు నిక్షిప్తమై నిద్రావస్థలో ఉంటాయి, ఎన్నో రకాల కలుపు సీడ్ బాల్స్ మొదలగునవి విపరీతంగా ఉంటాయి☠️☠️☠️...
ఒక్క మొక్క కొనుక్కుంటే దానివెంట ఉచితము గా కష్టాలు దరిద్రం కొని తెచ్చుకుంటాము. నర్సరీ మొక్క పేకెట్ లోని మట్టి /కోకోపీట్ వెంట మన నేల/చేను మొత్తానికి ఈ కొత్త కొత్త తెగుళ్లు, చీడపీడలు ఇంకా కొన్ని విదేశి రకాలయిన కత్తెర పురుగు, గులాబీ రంగుపురుగు, తెల్లదొమ మరియు భవిష్యత్ లో రాబోయే కొత్త తెగుళ్ళు మనకు తెలవని కొత్త తెగులు (కరోనా వైరస్ లాగా) మొదలగునవి దిగుమతి చేసుకుని మన వ్యవసాయ క్షేత్త్రాలలో వ్యాపింపజేసుకుని మల్టీనేషనల్ కంపెనీల గుప్పెట్లోకి వెళ్లిపోతున్నాం😢..
అందు వల్ల వెంటనే నాటకూడదు కనీసం వారం రోజులు విత్తనశుద్ది ద్రావణం తో శుద్ధి చేసుకోవాలి.. మొక్కలకు రోజు అమృత ద్రావణం/విత్తన శుద్ది ద్రావణం రోజ్ క్యాన్ లో పోసుకుని తడుపుకోవాలి.
⚛️👌ద్రావణం తయారీ విధానం:- 50 లీ.నీటికి పావు లీ.250ml చొప్పున. NSKE 50000ppm,(50000ppm నూనెల పిప్పి) EPFs( ట్రెయికోడేర్మ, మెటారైజాం, బవేరియా, వెర్టిసిల్లమ్, BD-500 ఇసారియా) EPBs బాక్టీరియా లు 12 రకాలు. తప్పనిసరిగా ఐదు కిలోల Mychorrhiza మైకోరైజా, మూడు లీటర్ల ఆవు మూత్రం లో కరిగించి కలిపి మూడురోజులు మక్కబెట్టుకోవాలి. దీనితో ప్రతిరోజు రోజ్ క్యాన్ లేక పంపు తో తడపాలి.
30 కేజీల విత్తనాలకి ఒక కిలో mychorrhiza/ VAM, పావు లీటరు ఆవుమూత్రం EPFs, EPBs,100గ్రా బెల్లం కొంత నీటిలో చిక్కగా కలుపుకుని పేస్ట్ లాగా చేసుకుని నాలుగురోజుల మక్కబెట్టుకోవాలి.
(పచ్చి ఆవు పేడలో రకరకాల కలుపు విత్తనాల సీడ్ బాల్ రూపములో పెద్ద పెద్దమొత్తములో విపరీతంగా ఉంటాయి, అందువల్ల పచ్చి పేడ/గొర్రె,పశువుల మక్కిన పేడ నేరుగా ఇవ్వకుండా డాక్టర్ సాయిల్ గా మార్చుకుని ఇవ్వాలి,, వర్మీ కంపోస్ట్, వర్మీ వాష్ కలుపుకోవాలి.)
దీనిని విత్తనాలకు బాగా పట్టించి నీడలో ఆరబెట్టి సీడ్ బాల్సు గా మార్చుకోవాలి. గడ్డలు/దుంపలు/కనుపు కొమ్మలు/నారు కనీసం 15 నిమిషాలు నానబెట్టి నాటుకోవాలి.
💐 ఉపయోగం :- మొలకల వేర్లకు VAM(mychorrhiza) స్పోర్స్ అంటుకుని వేరువ్యవస్థ నాలుగు రెట్లు పెరిగి మొక్క వేగముగా అభివృద్ధిచెందుతుంది. EPFs తో చీడపీడలు రాకుండా రక్షణ వలయం ఏర్పరుచుకుంటాయి. EPBs (సూక్ష్మ జీవన ఏరువులు) వేరు వ్యవస్థకు బుడిపెల రూపములో నివాసం ఏర్పరుచుకుని స్వయముగా కావలిసిన పోషకాలు సమానముగా అందిస్తాయి. ఇవి మొక్కల వేర్ల ద్వారా మొక్కల విసర్జకాలు తీసుకుని వాటి జాతిని multiplyply చేసుకొంటూ వేగంగా అభివృద్ధి చేసుకుని నేలలో గల రసాయన ఖనిజాలను సేంద్రియ రూపంలోకి మార్చి మొక్కలకు తగు పరిమాణంలో అందిస్తాయి. సూడోమోనాస్ బ్యాక్టీరియా మొక్కలవృద్ధినియంత్రణలో తోడ్పడుతుంది.
🥰 సమగ్ర సస్యరక్షణ కు అమృత ద్రావణం పెద్ద ఎత్తున తయారీ విధానము :
నానో ప్లాంట్ నిర్మాణము చేసుకునే విధానము:
రైతులు లు కనీస ఖర్చుతో ఒక ఎకరా నుండి వందలాది ఎకరాల వరకు నానో టెక్నాలజీ తో పటిష్టమైన శాశ్వత ఏర్పాట్లు చేసుకోవాలి. డ్రిప్ వెంచరీ వద్ద లేదా మనము నీరు పంపే కాలవల వ్యవస్థ వద్ద ఒక పాక/షెడ్ నిర్మించుకోవాలి. మనకు కావల్సిన పరిమాణంలో లో వ్యవసాయ క్షేత్రము పరిమాణమును బట్టి కనీసము 200 లీటర్ల రెండు ప్లాస్టిక్ డ్రమ్ములు గాని లేక వెయ్యి లీటర్ల రెండు సిమెంటు టబ్బులు అమర్చి వాటి పక్కనే వర్మి వాష్ యూనిట్స్ ఏర్పరుచుకోవాలి. ఒకటి బియ్యం కడుగు నీళ్ళు వెలువడే 100 లీ. ప్లాస్టిక్ drum అమర్చుకోవాలి. ఒక ఆఫ్ హెచ్ పి మోటార్ తో నేరుగా డ్రిప్ వెంచరీ లేక కాలువలోకి పోయేటట్లు సిద్ధ పరచుకోవాలి.
⚛️ శాస్త్రీయ పద్ధతలో పూర్తిగా స్వచ్ఛమైన సేంద్రియ అమృత ద్రావణం తయారీ విధానము :
200 లీటర్ల డ్రమ్ము లో కనీసము ఒక్కొక్కటి ఒక కేజీ చొప్పున ఐదు కేజీల చెక్క గానుగ లో నూనె తీసిన పిండి చెక్క/ప్రెస్డ్ మడ్ వేసుకోవాలి, రెండు కిలోల బెల్లం లేక అయిదు కిలోల బాగా మగ్గిన మురిగిన తియ్యటి పండ్లు కలుపుకోవాలి దానిలో వేస్ట్ డీకంపోజర్ WDC కొంచెం వేసుకోవాలి. ఒక టీ గ్లాస్ తో సుమారుగా 200 ml పన్నెండు రకాల సూక్ష్మ జీవన ఎరువులు EPBs . ఒక్క లీటర్ చొప్పున EPFs సూక్ష్మజీవ కీటకనాశిని లు కలుపుకోవాలి. దానికి బియ్యం కడుగు నీళ్ళు మరియు వర్మీ వాష్ కనీసం 50 లీటర్ల చొప్పున కలుపుకోవాలి,10 లీటర్ల దేశి ఆవు మూత్రము కూడా తప్పనిసరిగా కలుపుకోవాలి..
10 కిలోల దొడ్డు బియ్యం/రేషన్ బియ్యం షేడ్ నెట్ జాలీ లో మూటకట్టి వేలాడ తీసుకోవచ్చు. అలాగే 10 కిలోల ఆవు పెండ లేక 10 కిలోల డాక్టర్ సాయిల్ మూటగట్టి వేలాడదీయాలి ఈ మూట వారంకు ఒకసారి మార్చుతూ ఉండాలి. బియ్యం కరిగిపోతే మళ్లీ కొన్ని చేర్చుకోవాలి. కనీసం ఈ ప్లాంట్ నుండి కనీసం 45 రోజులపాటు ఐదుసార్లు పైన పేర్కొన్న ద్రావణాన్ని తీసుకోవాలి అంటే వెంచర్ లోకి పంపే ముందు కానీ పిచికారీ చేసే ముందు గాని కలపడము ఆపి ద్రావణం పూర్తిగా పేరు ద్రావణాన్ని మూడు వంతులు తీసుకోవాలి సెడిమెంట్ అలాగే ఉంచాలి తిరిగి దానికి మళ్ళీ బియ్యం కడుగు నీళ్ళు నీళ్లు,వెర్మువాష్ చేర్చితే చాలు. మిగతా భాగము నీటిని చేర్చుకుని వారం నుండి పది రోజులు రోజుకు ఒకసారి బాగా కలియతిప్పుతూ ఉండాలి.
పైన పేరుకున్న ద్రావణాన్ని మూడాకుల దశలో, పూత,పిందె,కాయ దశల్లో తప్పని సరిగా పిచికారి మరియు నేలకు డ్రిప్, sprinklers లేక కాల్వల ద్వారా తర్చుగా పంపుకుంటే మంచి నాణ్యమయిన దిగుబడి సాధించవచ్చు. మొదటి ప్రయత్నము లొనే రసాయన పంటలకంటే 10% ఎక్కువ దిగుబడి గల నాణ్యమైన ఎలాంటి 250 కి పైగా రసాయన అవశేషాలు లేని ఆర్గానిక్ సర్టిఫికేషన్ తో కనీస ఖర్చులతో సహజ పంటలు సాధించ వచ్చు.
😊💐ఒక్క డాక్టర్ సాయిల్ బియ్యం కడిగిన నీటిలో కరిగించి మొక్కలకు తరచుగా ఇస్తే చాలు 👌
ఈ విధానం పూర్తిగా పాటిస్తే సమగ్రసస్య రక్షణతో పాటు కూలీల బెడద ,కలుపు నివారణ, మొదలగు ఖర్చులు చాలా తగ్గించుకోవచ్చు.
...కొక్కు అశోక్ కుమార్ గారు
సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల నిపుణులు
No comments:
Post a Comment