Saturday, June 27, 2020

వ్యక్తుల మధ్య నుండే మహానుభావులు వస్తారు

వ్యక్తుల మధ్య నుండే మహానుభావులు వస్తారు

1991 లో ఈ దేశానికీ వచ్చిన ఫైనాన్సియల్ క్రైసిస్ గురించి దాని నుంచి దేశాన్ని పి వి గారు బయట పడవేసిన విధానం గురించి డీటెయిల్ పోస్ట్ . 
తప్పకండా చదవండి 
పదిమంది తో చదివించండి .

దేశాన్ని 1991 సంక్షోభం నుంచి బయటపడేసింది నర్సింహారావు అయితే అటువంటి సంక్షోభం వైపు దేశం మళ్ళీ వెళ్ళకండ చేసింది వాజపాయి..

ఈ దేశాన్ని 1991 లో జరిగిన ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టు ఎక్కించిన్నా మేధావి పి వి నర్సింహ రావు గారు, మన్మోహన్ సింగ్ 
అసలు 1991 లో ఏమి జరిగింది ??

మన దేశం అవలంబించిన మిశ్రమ ఆర్ధిక విధానాలు వల్ల , 1985 వచ్చేసరికి మన దేశం యొక్క ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరగటాము మొదలు అయింది .
దీని ఫలితం దేశం యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు మీద పడింది 

దిగుమతులు పెరగటామ్ వల్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోవడం మొదలు అయింది 

1991 లో వచ్చిన గల్ఫ్ యుద్ధం ప్రభావం వల్ల దిగుమతులు భారం మరింత అధికం అయింది.

చివరికి 1991 మే నెల ఆఖరుకు వచ్చేసరికి మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు 1.2 బిలియన్ డాలర్లు కి పడి పోయాయి 
ఇవి కేవలం 3 వారాలు కి మాత్రమే సరిపోతాయి 

అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితి ఎటువంటిది 

1991 మే లో మనకి తాత్కాలిక ప్రధానిగా చంద్రశేఖర్ వున్నారు , 1991 మే 21 న రాజీవ్ గాంధీ హత్యకు గురి అయ్యారు 
వాస్తవానికి 1991 మే 20, 23, 25 లోక్ సభ ఎన్నికలు జరగాలి 
మే 20 న మొదటి విడత పూర్తి అవ్వగానే రాజీవ్ హత్య జరిగింది, దీనితో రెండో విడత, మూడో విడత ఎన్నికల వాయిదా పడింది 
అవి జూన్ 12, 15 కి వాయిదా పడ్డాయి..
ఈ లోపు కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వం ఉంది 
1991 మే 31 కి విదేశీ నిల్వలు అడుగంటుతున్నాయి ..
ఈ నేపద్యంల్ చంద్రశేఖర్ ప్రభుత్వం బంగారాన్ని వరల్డ్ బ్యాంక్ కి తక్కట్టు పెట్టింది.

బంగారం తక్కట్టు పెట్టినప్పుడు వదంతులే వదంతులు.

వాస్తవానికి భారతీయ రిజర్వ్ బ్యాంకు వద్ద 200 టన్నుల బంగారు నిల్వలు ఎప్పుడు ఉంటాయి .

అందులో 67 టన్నుల బంగారం తాకట్టు పెట్టారు 

కానీ దేశము లో మన అందరూ బంగారం తక్కట్టు పెట్టేసారూ అనే వదంతులు అప్పట్లో సృష్టించారు .

ఇక ద్రవ్యోల్బణం అప్పట్లొ 18 శాతం ఉండేది..

ఇక ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని నష్టాల్లో ఉండేవి 
భారతీయ స్టేట్ బ్యాంక్ తప్ప మిగిలిన ప్రభుత్వ బ్యాంకులు అన్ని నష్టాలు లో ఉండేవి ..

ఎవరు అన్న పరిశ్రమలు స్థాపించాలి అన్నా , అనేక అనుమతులు, లైసెన్సులు పొందాల్సిన పరిస్థితులు, 

ప్రభుత్వ రంగం నష్టాల్లో, ప్రైవేట్ రంగం పుంజుకొని పరిస్థితులు లో ఉండేది .

బాంబే స్టాక్ మార్కెట్ లో హర్షద్ మెహతా స్కామ్ వల్ల దేశీయంగా స్టాక్ మార్కెట్లు కుదేలు అయి పోయాయి 

ఇటు వంటి పరిస్థితులు మధ్య పి వి ప్రధాని అయ్యారు. 
ప్రధాని అవ్వగానే రిజర్వ్ బ్యాంకు గవర్నర్గగా పని చేసిన మన్మోహన్ సింగ్ ని ఆర్ధిక మంత్రిగా నియమించారు , 

దేశం లో సరళీకృత ఆర్ధిక విధానాలు ప్రవేశ పెట్టారు వాటిని చిత్త శుద్ధి తో అమలు చేశారు 

1 స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు నియంత్రణ కోసం  సెబీ ని ఏర్పాటు చేశారు .సెబీ ఏర్పటు చేసాక స్టాక్ మార్కెట్లు కార్యక్రమలు నియంత్రణ లోనికి వచ్చాయి.

2 లైసెన్స్ విధానం రద్దు చేశారు 

3 బ్యాంకింగ్ సంస్కరణలు కోసం నర్సింహం కమిటీ వేశారు వాటి సిఫార్సులు కి అనుగుణంగా కొత్త తరం ప్రైవేట్ బ్యాంకులు పట్టుకొని వచ్చాయి 

ICICI బ్యాంక్, 
HDFC బ్యాంక్, 
AXIS బ్యాంక్, 
ఈ సమయంలో పురుడు పోసుకున్నాయి 

4 నష్టాలు లో ఉన్న ప్రభుత్వ బ్యాంకులు అన్ని బ్రేక్ ఈవెన్ లు కి తీసుకుని వచ్చారు 

5 దేశం అంత ఒకే రైల్వే గెజి తీసుకుని వచ్చారు 
దేశంలో మీటర్ గెజి ని తొలగించి బ్రాడ్ గెజి రైల్వే లైన్లు వేశారు 

6 పంచాయతీ లకి , 
నగరపాలక సంస్థలు కి
 రాజ్యాంగ బద్ధత కల్పించారు 

7 నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసారభారతి బిల్లు ఆమోదింప చేశారు ,
 ప్రసార భారతి బిల్లు వల్ల దూరదర్శన్ గుతాధిపత్యం అంతం అయ్యి పలు ప్రైవేట్ చానెల్స్ వచ్చాయి .

ఈ టివి,
 జెమిని, 
జీటివి, లాంటి 
మొదటి తరం ప్రైవేట్ చానెల్స్ పురుడుపోసుకున్నాయి 

8 దేశంలో ఫోన్ చెయ్యాలి అంటే ట్రాంకల్ బుక్ చేసు కునే రోజులు నుంచి ఎస్టీడీ బూతులు ఏర్పాటు చేయించారు , 

వాస్తవానికి సెల్ ఫోన్ నెట్వర్క్ కి అనుమతులు పి వి హయంలో ఇచ్చారు
 కానీ దేశంలో సెల్ ఫోన్లు 1996 చివర్లో వచ్చాయి 

9. పివి పగ్గాలు చెప్పటనాటికి ఉన్న 18 శాతం ద్రవ్యోల్పణం 1996 కి 8 శాతం కి డౌన్ అయి నది 

10 .1991 లో తక్కట్టు పెట్టిన బంగారం 1993 వచ్చేసరికి విడిపించుకుని తీసుకుని వచ్చేసారు .

అదే పివి సాధించిన గొప్ప విజయం .

11. 1996 ఎన్నికల పూర్తి స్థాయి ఫోటో గుర్తింపు కార్డులు తో జరిగాయి.

పివి తరవాత వచ్చిన వాజపాయి సంస్కరణలు కి మానవీయ కోణం జోడించారు.

1) 2004 వచ్చేసరికి దేశంలో ద్రవ్యోల్బణం 2 శాతం కి పరిమితం చేశారు .

2) 1991 లో 1.2 బిలియన్ డాలర్లు ఉన్న విదేశీ మారక నిల్వలు 2004 వచ్చేసరికి 100 మిలియన్ డాలర్ల మిగులు కి తీసికుని వచ్చారు.

3) బ్యాంకింగ్ రంగం పరుగుల తీసింది , దేశవ్యాప్తంగా బ్యాంకుల కంప్యూటర్ కరణ్ పూర్తి అయి ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి .

4 ) దేశంలో పరిశ్రమల స్థాపన కి అడ్డంగా ఉన్న MRTP చట్టం రద్దు చేశారు .

5  ) ఫెరా చట్టాన్ని రద్దు చేశారు.
 
6) ఇన్సూరెన్స్ రంగంలో LIC గుతాధిపత్యం పోయి అనేక ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు వచ్చయి .

7) దేశ వ్యాప్తంగా జాతీయ రహదారుల 4 వరసలు గా మార్పు చేయబడ్డాయి .

8 ) దేశం అంత విస్తృతంగా సెల్ సెట్విర్క్ ఏర్పడింది .

9) హర్షద్ మెహతా సంక్షోభం స్టాక్ మార్కెట్లు ని కుదేలు చేస్తే కేటన్ పరెక్ సంక్షోభం ను స్టాక్ మార్కెట్లు తట్టుకోగలిగాయు .

10) వాజపాయి ప్రారంభించిన పనికి ఆహార పధకం చట్ట బద్దం అయి తరవాత కాలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గా రూపు దిద్దుకుంది .

11) 2004 వచ్చేసరికి దేశ వ్యాప్తంగా ఎన్నికల ఈవీఎంలు ద్వారా జరిగాయి 

ఈ విధంగా సంస్కరణలు అమలు లో 
పివి , వాజపాయి  దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు.. 🙏

No comments:

Post a Comment

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...